ముంబై: సిల్వర్ స్క్రీన్ పై మొదటి లిప్లాక్ సీన్ ఎపుడు చిత్రీకరించారో తెలుసా? మూకీ సినిమాల టైంలోనే ఈ సీన్లను హీరో హీరోయిన్లు పండించారంటే నమ్ముతారా? ఈ వివరాలతో కూడిన రెండు వీడియోలు ఇపుడు మళ్లీ యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.
తరతరాలుగా సినిమాలలో ముద్దు సీన్లకున్నంత ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నానాటికీ ఈ సీన్ల గాఢత,నిడివి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే 60, 70లలో వచ్చిన సినిమాలలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను సింబాలిక్గా చూపించడం మనకు తెలుసు. రెండు పువ్వులను కలపడం ద్వారా ముద్దు సీన్ ను పండించడం ఆప్పటి సినిమాల్లో చూసిందే.
అయితే 1929లో అంటే మూకీ సినిమాల కాలంలోనే చుంబన దృశ్యాలు ఉన్నాయంటే నమ్మగలమా.. కానీ ఇది నిజం. 'ఎ థ్రో ఆఫ్ డైస్' అనే సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ను చిత్రించారు. సీతాదేవి, చారు రాయ్ మధ్య ఈ అరుదైన సన్నివేశాన్ని షూట్ చేశారట. ఆ తరువాత ఈ కోవలో చెప్పుకోదగ్గది కర్మ సినిమాలోనిది. దేవికా రాణి, హిమాంశు మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రించారు. 1933లో వచ్చిన ఈ సినిమాలో భారతీయ సినిమాల్లో సుదీర్ఘ ముద్దు సీన్లలో ఒకటిగా నిలిచిందట. నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ దృశ్యం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే ఈ సినిమాలో దేవికా రాణి, హిమాంశు రాయ్ భార్యభర్తలు కావడం విశేషం.