onscreen
-
పధ్నాలుగేళ్లకు మళ్లీ...
సూర్య, జ్యోతిక జంటగా ఏడు సినిమాలు చేశారు. ఆ తర్వాత ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలసి సినిమా ఎప్పుడు చేస్తారు? అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. ‘‘కలిసి కనిపించాల్సిన కథ వస్తే మళ్లీ ఆన్‌స్క్రీన్ మీద మరోసారి జోడీగా కనబడతాం’’ అని పలు సందర్భాల్లో సూర్య చెప్పారు. ఇప్పుడు కథ కుదిరిందని, పధ్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ స్క్రీన్ మీద కనిపించనున్నారని టాక్. మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పాట్టి’ దర్శకురాలు హలితా షహీమ్‌తో కలసి అంజలీ మీనన్ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. -
తండ్రీ కూతుళ్లుగా...
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఫస్ట్ సినిమా ‘కేధార్నాద్’ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్‌గా ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో జాయిన్ అయ్యారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరో. ఈ సినిమా తర్వాత తండ్రి సైఫ్ అలీఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట సారా అలీఖాన్. నితిన్ కక్కర్ తెరకెక్కించనున్న ఫ్యామిలీ డ్రామాలో సైఫ్, సారా ఆన్‌స్క్రీన్ కూడా తండ్రీ కూతుళ్ల పాత్రల్లోనే యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమా కథ తండ్రీ కూతుళ్ల రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. -
మొదటి లిప్‌లాక్ సీన్ ఏదో తెలుసా?
ముంబై: సిల్వర్ స్క్రీన్ పై మొదటి లిప్‌లాక్ సీన్ ఎపుడు చిత్రీకరించారో తెలుసా? మూకీ సినిమాల టైంలోనే ఈ సీన్లను హీరో హీరోయిన్లు పండించారంటే నమ్ముతారా? ఈ వివరాలతో కూడిన రెండు వీడియోలు ఇపుడు మళ్లీ యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. తరతరాలుగా సినిమాలలో ముద్దు సీన్లకున్నంత ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నానాటికీ ఈ సీన్ల గాఢత,నిడివి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే 60, 70లలో వచ్చిన సినిమాలలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను సింబాలిక్‌గా చూపించడం మనకు తెలుసు. రెండు పువ్వులను కలపడం ద్వారా ముద్దు సీన్ ను పండించడం ఆప్పటి సినిమాల్లో చూసిందే. అయితే 1929లో అంటే మూకీ సినిమాల కాలంలోనే చుంబన దృశ్యాలు ఉన్నాయంటే నమ్మగలమా.. కానీ ఇది నిజం. 'ఎ థ్రో ఆఫ్ డైస్' అనే సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ను చిత్రించారు. సీతాదేవి, చారు రాయ్ మధ్య ఈ అరుదైన సన్నివేశాన్ని షూట్ చేశారట. ఆ తరువాత ఈ కోవలో చెప్పుకోదగ్గది కర్మ సినిమాలోనిది. దేవికా రాణి, హిమాంశు మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రించారు. 1933లో వచ్చిన ఈ సినిమాలో భారతీయ సినిమాల్లో సుదీర్ఘ ముద్దు సీన్లలో ఒకటిగా నిలిచిందట. నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ దృశ్యం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే ఈ సినిమాలో దేవికా రాణి, హిమాంశు రాయ్ భార్యభర్తలు కావడం విశేషం. -
సైనా పై రానున్న బాలీవుడ్ ఫిల్మ్