
సూర్య, జ్యోతిక జంటగా ఏడు సినిమాలు చేశారు. ఆ తర్వాత ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలసి సినిమా ఎప్పుడు చేస్తారు? అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. ‘‘కలిసి కనిపించాల్సిన కథ వస్తే మళ్లీ ఆన్‌స్క్రీన్ మీద మరోసారి జోడీగా కనబడతాం’’ అని పలు సందర్భాల్లో సూర్య చెప్పారు. ఇప్పుడు కథ కుదిరిందని, పధ్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ స్క్రీన్ మీద కనిపించనున్నారని టాక్. మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పాట్టి’ దర్శకురాలు హలితా షహీమ్‌తో కలసి అంజలీ మీనన్ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment