Actor Suriya Praises His Wife Jyothika By Sharing Her Gym Workout Video - Sakshi
Sakshi News home page

Jyothika Gym Video: 'మై వండర్ ఉమెన్'.. భార్యపై ప్రశంసలు కురిపించిన సూర్య!

Published Sun, Jun 25 2023 7:36 PM | Last Updated on Mon, Jun 26 2023 12:47 PM

Suriya gives a shout out to his wife Jyothika fitness video In Gym - Sakshi

నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్‌ నటి నగ్మా చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉండగానే తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబయిలో ఉంటోంది.  

(ఇది చదవండి: 'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్ )

తాజాగా జ్యోతిక జిమ్‌లో చేసిన కసరత్తులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారామె. ఆ వీడియోలో స్టన్నింగ్ వర్కవుట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది చూసిన సూర్య సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మై వండర్ వుమెన్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో జ్యోతిక జిమ్‌ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జ్యోతిక జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమడ్చోతున్న వీడియో తెగ వైరలవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోకు భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని జిందా పాటను జోడించింది. 

కాగా.. జ్యోతిక వెంకట్ ప్రభు దర్శకత్వం తెరకెక్కించబోయే  దళపతి-68లో  విజయ్‌తో కలిసి నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ జంట 'కుషి', 'తిరుమలై' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. మరోవైపు రాజ్‌కుమార్ రావు  రాబోయే చిత్రం శ్రీలో  బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా అజయ్ దేవగన్ నటిస్తోన్న థ్రిల్లర్‌ మూవీలో కనిపించనుంది.ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో నటించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు సూర్య. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. 

(ఇది చదవండి: విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement