
సైఫ్ అలీఖాన్, సారా అలీఖాన్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఫస్ట్ సినిమా ‘కేధార్‌నాద్’ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్‌గా ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో జాయిన్ అయ్యారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరో. ఈ సినిమా తర్వాత తండ్రి సైఫ్ అలీఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట సారా అలీఖాన్. నితిన్ కక్కర్ తెరకెక్కించనున్న ఫ్యామిలీ డ్రామాలో సైఫ్, సారా ఆన్‌స్క్రీన్ కూడా తండ్రీ కూతుళ్ల పాత్రల్లోనే యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమా కథ తండ్రీ కూతుళ్ల రిలేషన్‌షిప్ మీద ఎక్కువగా ఉండబోతోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment