బ్రిటన్ కుటుంబంతో విందుకు నో..! | Britain is family dinner no ..! :- Kareena Kapoor | Sakshi
Sakshi News home page

బ్రిటన్ కుటుంబంతో విందుకు నో..!

Published Sun, Apr 3 2016 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

బ్రిటన్ కుటుంబంతో  విందుకు నో..!

బ్రిటన్ కుటుంబంతో విందుకు నో..!

బ్రిటన్   కుటుంబీకులతో డిన్నర్ చేసే అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా?.. దాదాపు కాదనలేరు. కానీ, కరీనా కపూర్ మాత్రం కాదనేశారు. అసలు విషయంలోకి  వెళితే... బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్‌టన్‌తో కలిసి విహార యాత్ర ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే, ఈ దంపతులిద్దరూ ఈ నెల 10న భారత్‌కు రానున్నారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నారు. అలాగే ఓ చారిటీ విందులో కూడా పాల్గొనున్నారు.

ఆ చారిటీ ట్రస్ట్‌కు సంబంధించిన నిర్వాహకులు ఈ విందుకు బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌లను ఆహ్వానించారట. కరీనా వెళ్లాలనుకుప్పటికీ సైఫ్ కారణంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారట. ప్రస్తుతం సైఫ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నందున ఈ విందుకు హాజరయ్యే వీలు చిక్కదట. ఇదే కారణం చెప్పి, ఒక్కదాన్నే విందుకు హాజరు కాలేనని కరీనా పేర్కొన్నారట. ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, యువహీరోలు అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్, హీరోయిన్ సోనమ్ కపూర్ తదితరులను కూడా ఈ విందుకు ఆహ్వానించారట. వీళ్లు విందుకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement