
బాహుబలిపై నోరువిప్పిన బాలీవుడ్ హీరో
ఇండియన్ సినిమాను తొలిసారిగా 1000 కోట్ల క్లబ్ లో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి 2. భారీ వసూళ్లతో భారత్ లోని ఇండస్ట్రీ రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన బాహుబలి, బాలీవుడ్ స్టార్స్ కు కూడా చుక్కలు చూపించింది. అందుకే మీడియా సాధారణ ప్రేక్షకులు బాహుబలిని ఆకాశానికి ఎత్తేసినా.. బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమా పై స్పందించలేదు. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ లో ఒక్క స్టార్ హీరో కూడా బాహుబలి సక్సెస్ పై మాట్లాడలేదు.
తాజాగా కిలాడీ అక్షయ్ కుమార్ బాహుబలి 2 సక్సెస్ పై స్పంధించాడు. సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తరువాత బాహుబలి 2కు సంబంధించిన ట్వీట్ చేశాడు అక్షయ్ కుమార్. 'ఫైనల్ గా బాహుబలి సినిమా చూశా. వస్తున్న హైప్, సక్సెస్ కు బాహుబలి 2కి అర్హత ఉంది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్.
Finally saw #BaahubaliTheConclusion, it deserves every bit of hype & success,taking Indian cinema 2 an international level.Congrats 2 d team
— Akshay Kumar (@akshaykumar) 15 May 2017