మెగాస్టార్‌కి బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన గేల్‌! | Chris Gayle gifts his bat to legend Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌కి బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన గేల్‌!

Published Sat, Feb 27 2016 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

మెగాస్టార్‌కి బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన గేల్‌!

మెగాస్టార్‌కి బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన గేల్‌!

ముంబై: భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా పెద్దగా ప్రాచుర్యం లేదని అనుకుంటాం కానీ, బ్యాటింగ్ సెన్సేషన్ క్రిస్‌ గేల్ ఈ విషయాన్ని తప్పని నిరూపించాడు. తన అభిమానంతో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను క్లీన్‌బోల్డ్‌ చేశాడు. భారతీయ సినిమాను ప్రపంచంలో పెద్దగా ఎవరు చూస్తారులే అనుకుంటున్న సమయంలో ఈ వెస్టిండిస్ క్రికెటర్ తనకు పెద్ద ఫ్యాన్ అని తెలియడం విస్మయంలో ముంచెత్తిందని బిగ్‌ బీ అమితాబ్ తెలిపారు. తన అభిమానానికి గుర్తుగా క్రిస్‌ గేల్ తన సంతకం చేసిన బ్యాటును కానుకగా ఇచ్చాడని, ఈ అభిమానం తనకెంతో ఆనందం కలిగించిందని ఉబ్బితబ్బిబ్బవుతూ బిగ్‌ బీ చెప్పారు.

'మిస్టర్ క్రిస్‌ గేల్‌. ఇది నిజంగా గొప్ప గౌరవం. నువ్వు నన్ను గుర్తుపట్టగలవని నేనెప్పుడూ అనుకోలేదు. నిజంగా ఎంతో ముగ్ధుడినయ్యాను. మేమంతా నీ వీరాభిమానులం. హిందీ సినిమాల అభిమాని క్రిస్‌ గేల్ తన సంతకంతో ఉన్న గోల్డెన్ బ్యాటును నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇది నాకు దైవసందేశంతో సమానం' అని బిగ్ బీ ట్విట్టర్‌లో తెలిపారు.

ఐపీఎల్‌లో వీరబాదుడు బాదే క్రిస్‌ గేల్‌ తనకు బాలీవుడ్ షెహన్‌షా అంటే ఎనలేని అభిమానమని ట్విట్టర్‌లో తెలిపాడు. 'లెజండ్ అమితాబ్ బచ్చన్‌కు నా స్పార్టన్ బ్యాటును బహుమానంగా ఇవ్వడం గర్వంగా ఉంది. ఆయన సినిమాలు, స్టైల్‌ను ఎంతోగానో అభిమానిస్తా. థాంక్యూ' అంటూ క్రిస్‌ గేల్ ట్వీట్‌ చేశాడు. ఇందుకు ప్రతిగా అమితాబ్‌ కూడా ట్విట్టర్‌లో స్పందించడంతో 'త్వరలోనే భారత్‌లో కలుద్దాం' అంటూ బిగ్‌ బీకి గేల్‌ మరో మెసేజ్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement