
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సినిమా విడుదలైన మొదటిరోజే రూ. 100 కోట్లు సాధించిన హీరోలు ఏడుగురు మాత్రమే ఉన్నారు.

ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు మొదటిరోజే రూ. 100 కోట్లు రాబట్టాయి (బాహుబలి2,సాహో,ఆదిపురుష్,సలార్,కల్కి 2898AD) ఐదు సినిమాలతో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

ఎన్టీఆర్ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్, దేవర' రెండు సినిమాలు కూడా ఫస్ట్ డే ఈ రికార్డ్‌ను అందుకున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'లియో, ది గోట్' రెండు సినిమాలు డే-1 రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాయి.

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్,జవాన్' రెండు సినిమాలు ఫస్ట్ డే రూ. 100 కోట్లు సాధించాయి.

గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ 'ఆర్‌ఆర్‌ఆర్' ఒక సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లో ఉన్నారు.

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కేజీఎఫ్-2' చిత్రం డే వన్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్' యానిమల్' సినిమాతో డే-1 రూ. 100 కోట్లు సాధించాడు.