
ముద్దు సీన్లు ఉంటే చాలు
ముద్దు సన్నివేశాలే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తాయని బాలీవుడ్ దర్శకుడు కర ణ్ జోహార్ అంటున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. ముద్దు సీన్ల ఫార్ములా ఆయనకు బాగా కలిసొచ్చింది.
2012లో కరణ్ జోహార్ నిర్మించిన ‘స్ట్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంలో ఆలియాభట్, సిద్దార్థ్ మల్హోత్రా ముద్దు సీన్‌కు ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్‌తో తన తాజా చిత్రం ‘2 స్టేట్స్’లో ఆలియా, అర్జున్ కపూర్‌లతో కరణ్ ముద్దు సీన్ చిత్రీకరించారట