
ముద్దు పెట్టనని చెప్పానా?
బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించరని తెలిస్తే ఆమె అభిమానుల గుండె ఆగినంత పనవుతుంది. కేవలం సన్నీ చేసే అలాంటి హాట్ సీన్స్ కోసమే ఆమె అభిమానులు థియేటర్లకు వస్తుంటారు. అది తెలుసుకుని దర్శకులు ముద్దు సన్నివేశాలను సృష్టిస్తుంటారు. ఇన్నాళ్లూ ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ తరహా సీన్స్‌లో నటించిన సన్నీ ఇప్పుడు ఉన్నట్టుండి ‘ముద్దంటే నాకు చేదు’ అంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది.
ఇకపై తాను నటించే సినిమాల్లో ముద్దు సీన్లు లేకుంటేనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తానని సన్నీ నిర్మాతల దగ్గర కరాఖండిగా పేర్కొన్నారనే వార్త ఇటీవల పెద్ద దుమారమే రేపింది. ఈ వార్త సన్నీ లియోన్ వరకూ వెళ్లింది. అంతే.. ‘‘ముద్దు సీన్లో నటించనని నా అంతట నేను చెప్పానా? అసలు ఇటువంటి రూమర్స్ ఎక్కడి నుంచి పుడతాయో అర్థం కావటం లేదు’’ అని వివరణ ఇచ్చేశారు. దాంతో ఇటు సినీరంగంవారూ అటు అభిమానులూ శాంతించారు.