అభద్రతా భావం లేదు | I don`t feel overshadowed by Armaan Jain: Deeksha Seth | Sakshi
Sakshi News home page

అభద్రతా భావం లేదు

Published Sun, Jun 29 2014 10:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అభద్రతా భావం లేదు - Sakshi

అభద్రతా భావం లేదు

 సహనటుడు అర్మాన్‌జైన్ రాజ్‌కుమార్... నిర్మాత రాజ్‌కపూర్ మనవడే అయినప్పటికీ తానేమీ అభద్రతా భావానికి లోనవడం లేదని నటి దీక్షాసేథ్ చెప్పింది. అర్మాన్‌తో కలసి ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమాతో బాలీవుడ్‌లో తొలిసారిగా నటిస్తున్న ఈ సుందరి... గతంలో ‘వేదం’  అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించింది. ‘అతడు కూడా కపూరేనని తెలిసిన తర్వాత కూడా నేనేమీ అభద్రతా భావానికి లోనవడం లేదు. ఈ సినిమాలో నా పాత్ర సరైనది కాకపోతే మాత్రమే నాకు కచ్చితంగా ఆ భావన కలుగుతుంది.
 
 ఈ సినిమా చూసినట్టయితే పని విభజన సరిగ్గా జరిగిందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అర్మాన్... కరీనాకపూర్, కరిష్మా కపూర్‌లకు సోదరుడి వరుస. కొత్త నటుడు బాలీవుడ్‌లోకి అడుగిడితే అతగాడు ఎవరి కుమారుడనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన వారిని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం అత్యంత సహజమనేది నా భావన. అసలేం జరుగుతోందనే విషయం తెలుసుకోవాలనే తొందరపాటు కూడా సహజమే’ అని అంది.
 
 ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమా శుక్రవారం విడుదల  కానుంది. ఇల్యూమినాటి, ఇరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్ ఇండియా పోటీల్లో తలపడ్డ దీక్షాసేథ్ బాలీవుడ్‌లో తాను నటిస్తున్న తొలి సినిమాలో సంభాషణలు ఎలా చెప్పాననే విషయం తెలుసుకునేందుకు తెగ తొందరపడిపోతోంది. ‘మాతృభాషలో తొలిసారిగా నటించిన సినిమా కావడంతో సినిమా విడుదల కోసం నేను కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నానని తెలి పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement