Armaan Jain
-
వేడుకలో తళుక్కుమన్న మలైకా, అర్జున్
ముంబై : బాలీవుడ్ ప్రేమికులు మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఓ వేడుకలో తళుక్కుమన్నారు. ఇటీవల నటుడు ఆర్మాన్ జైన్, అనిస్సా మల్హోత్రాల వివాహం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరు మంగళవారం గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. కాగా ఈ పార్టీలో లవ్ బర్డ్స్.. రణ్‌బీర్ కపూర్-అలియా భట్, వరుణ్ దావన్-నటాషా దలాల్, మైలైకా అరోరా-అర్జున్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో మలైకా ఆరెంజ్, అర్జున్ గ్రీన్ దుస్తుల్లోధగధగ మెరుస్తూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (దిష్టి తగులుతుందేమో జాగ్రత్త!!) మలైకా, అర్జున్ కపూర్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే, అయితే ఈ విషయాన్ని బహిర్గతంగా ఎప్పుడూ ప్రకటించకపోయినా ప్రతి సందర్భంలోనూ ఒకరిమీద మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాగా 2017లో వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ మలైకా అరోరా సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ విడాకులు తీసుకున్నారు. ఇక అర్జున్ కంటే మలైకా దాదాపు పన్నెండేళ్లు పెద్దవారన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ త్వరలోనే వివాహానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram #ArjunKapoor #MalaikaArora for #ArmaanJain #AnissaMalhotra wedding cocktail bash tonight 😍❤️ 😍 #tuesday #ManavManglani A post shared by Manav Manglani (@manav.manglani) on Feb 4, 2020 at 10:03am PST -
నాకు సిక్స్ ప్యాక్ లేదు.. ఫ్యామిలీ ప్యాకే!
ముంబై: తనకు ఇంకా సిక్స్ ప్యాక్ రాలేదని, ప్రస్తుతానికి ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నానని బాలీవుడ్ వర్దమాన నటుడు అర్మాన్ జైన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం అర్మాన్ సిక్స్ కోసం పరితపిస్తున్నా..శరీరాకృతిలో పెద్దగా మార్పులు కనిపించడం లేదని అంగీకరించాడు. 'నేను ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నాను. ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేస్తే నా బాడీ లాంగ్వేజీలో మార్పు కోసం యత్నిస్తానని' అర్మాన్ తెలిపాడు. తనకు సినిమాలతో పాటు.. ఆటలంటే మహాప్రాణమన్నాడు. ప్రతీరోజూ రెండు గంటలపాటు ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్ ఆటలు ఆడుతుంటానన్నాడు. అరిఫ్ ఆలీ దర్శకత్వంలో రూపొందిన 'లేకర్ హమ్ దీవానా దిల్ ' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అర్మాన్..దీక్షాసేథ్ తో జోడీ కట్టాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్ కు ముఖానికి రంగువేసుకునేముందే సినిమాతో సంబంధం ఉంది. కరణ్ జోహార్ వద్ద అతను మూడు సంవత్సరాలు దర్శకత్వశాఖలో పనిచేశాడు. 'మై నేమ్ ఈజ్ ఖాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ', 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాలకు అర్మాన్ శిక్షను పొందాడు. కేవలం కరణ్ వద్దకు సినిమా డైరెక్షన్ నేర్చుకుందామనే మాత్రమే ఫీల్డ్ లో అడుగుపెట్టినట్లు ఈ 23 ఏళ్ల యువనటుడు తెలిపాడు. తాను లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చని గతంలో అర్మాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు అని పేర్కొన్నాడు. -
మా అమ్మ కొట్టలేదు
ఒక చెంప దెబ్బ షాట్‌ను సరిగ్గా తీయడం కోసం 200 టేక్‌లు తీసుకున్నానని ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాతో బాలీవుడ్లో అడుగిడుతున్న అర్మాన్‌జైన్ చెప్పాడు. ‘మా అమ్మ రీమా నన్ను ఏనాడూ కొట్టలేదు. అందువల్లనే ఆ సీన్‌ను పండించడానికి అన్ని టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది’ అని రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘నేను అసలు అల్లరే చేసేవాడిని కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఆమెను సతాయిస్తే వెంటనే ఓ గదిలో బంధించేది. అంతేతప్ప ఏనాడూ నాపైకి చేయెత్తలేదు. ఈ సినిమాలో నా తల్లి పాత్రధారి అనిత నన్ను తొలిసారిగా కొట్టింది. దీంతో దిగ్భ్రాంతికి గురయ్యా’ అని అన్నాడు. కపూర్ల కుటుంబానికి చెందిన ఈ నటవారసుడు తన బంధువులైన రణ్‌బీర్, కరిష్మా, కరీనా కపూర్ల సహాయం ఏనాడూ తీసుకోలేదు. అయినప్పటికీ తొలి సినిమా ద్వారా భారీ హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాడు. అరిఫ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాలో అర్మాన్ సరసన దీక్షాసేథ్ నటించింది. ఈ సినిమాకు కరీనా భర్త సైఫ్ అలీఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుద ల కానుంది. ‘సైఫ్ సినిమాలో నాకు ఓ అవకాశం దొరికింది. మా సోదరులు ఎవరైనా కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని అంతా అనుకుంటారు. అయితే అది సరికాదు. సినిమాలు మినహా అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఏ ఒక్కరికీ చెప్పకుండానే ‘లేకర్ హం దివానా దిల్’ సినిమా ఆడిషన్లో పాల్గొన్నా. ఈ సినిమాకోసం ఆరిఫ్ నన్ను ఎంపిక చేసిన తర్వాత ఈ విషయాన్ని దీదీ (కరీనాక పూర్) తెలియజేశా’ అని అన్నాడు. -
అభద్రతా భావం లేదు
సహనటుడు అర్మాన్‌జైన్ రాజ్‌కుమార్... నిర్మాత రాజ్‌కపూర్ మనవడే అయినప్పటికీ తానేమీ అభద్రతా భావానికి లోనవడం లేదని నటి దీక్షాసేథ్ చెప్పింది. అర్మాన్తో కలసి ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమాతో బాలీవుడ్లో తొలిసారిగా నటిస్తున్న ఈ సుందరి... గతంలో ‘వేదం’ అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించింది. ‘అతడు కూడా కపూరేనని తెలిసిన తర్వాత కూడా నేనేమీ అభద్రతా భావానికి లోనవడం లేదు. ఈ సినిమాలో నా పాత్ర సరైనది కాకపోతే మాత్రమే నాకు కచ్చితంగా ఆ భావన కలుగుతుంది. ఈ సినిమా చూసినట్టయితే పని విభజన సరిగ్గా జరిగిందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అర్మాన్... కరీనాకపూర్, కరిష్మా కపూర్లకు సోదరుడి వరుస. కొత్త నటుడు బాలీవుడ్‌లోకి అడుగిడితే అతగాడు ఎవరి కుమారుడనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన వారిని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం అత్యంత సహజమనేది నా భావన. అసలేం జరుగుతోందనే విషయం తెలుసుకోవాలనే తొందరపాటు కూడా సహజమే’ అని అంది. ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఇల్యూమినాటి, ఇరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్ ఇండియా పోటీల్లో తలపడ్డ దీక్షాసేథ్ బాలీవుడ్లో తాను నటిస్తున్న తొలి సినిమాలో సంభాషణలు ఎలా చెప్పాననే విషయం తెలుసుకునేందుకు తెగ తొందరపడిపోతోంది. ‘మాతృభాషలో తొలిసారిగా నటించిన సినిమా కావడంతో సినిమా విడుదల కోసం నేను కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నానని తెలి పింది. -
రాజ్ కపూర్ మనవడు, దీక్షసేత్ ల మూవీ ప్రెస్ మీట్
-
నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు
న్యూఢిల్లీ: వర్ధమాన నటుడు అర్మాన్ జైన్ నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అతని జీవితంలో ప్రేమ ప్రయాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధమూ లేదని ఈ 23 ఏళ్ల యువ నటుడు అంగీకరించాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్... ఆరిఫ్ అలీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘లేకర్ హం దివానా దిల్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చన్నాడు. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు. అందువల్లనే నావైపు ఎవరూ చూడడం లేదు. ఇదిలాఉంచితే మరికొంతమంది యువతులు నాకు రాఖీ కట్టారు. నన్ను వారి సోదరుడిగా భావించారు. చాలా చిన్నతనంనుంచే పని చేయడం ప్రారంభించాను. దృష్టంతా పనిమీదనే ఉంచా. ఎక్కడికైనా బయటికి వెళ్లేందుకు కూడా నాకు తగినంత సమయం దొరకడం లేదు’ అని అన్నాడు. టీనేజర్‌గా ఉన్న సమయంలో అర్మాన్... కరణ్‌జోహార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం కాకుండా పెట్టుబడిదారుడు మనోజ్‌జైన్, రాజ్‌కపూర్ కుమార్తె రీమా కుమారుడైన అర్మాన్... నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో మొదటినుంచి తన కొవ్వును తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాడు. ‘నేను నిజంగా చాలా బరువుగా ఉంటాను. నటన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నా. దీంతో తిండి బాగా తగ్గించేశా ’ అని ఈ ఫుట్‌బాల్ క్రీడా ప్రేమికుడు చెప్పాడు. -
'గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడం ఫన్నీగా ఉంది'
న్యూఢిల్లీ: వర్ధమాన నటుడు అర్మాన్ జైన్ నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అతని జీవితంలో ప్రేమ ప్రయాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధమూ లేదని ఈ 23 ఏళ్ల యువతార అంగీకరించాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్... ఆరిఫ్ అలీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘లేకర్ హం దివానా దిల్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చన్నాడు. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు. అందువల్లనే నావైపు ఎవరూ చూడడం లేదు. ఇదిలా ఉంచితే మరికొంతమంది యువతులు నాకు రాఖీ కట్టారు. నన్ను వారి సోదరుడిగా భావించారు. చాలా చిన్నతనంనుంచే పని చేయడం ప్రారంభించాను. దృష్టంతా పనిమీదనే ఉంచా. ఎక్కడికైనా బయటికి వెళ్లేందుకు కూడా నాకు తగినంత సమయం కూడా దొరకడం లేదు’ అని అన్నాడు. టీనేజర్‌గా ఉన్న సమయంలో అర్మాన్... కరణ్‌జోహార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం కాకుండా పెట్టుబడిదారుడు మనోజ్‌జైన్, రాజ్‌కపూర్ కుమార్తె రీమా కుమారుడైన అర్మాన్... నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో మొదటినుంచి తన కొవ్వును తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాడు. బాలీవుడ్లో అడుగు పెట్టడం కోసం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును మధ్యలోనే వదిలేసిన అర్మాన్...తన బరువు కొంతకాలం పెరగడం, మరికొంతకాలం తగ్గడం తరచూ జరుగుతుంటుందన్నాడు. కళాశాలకు వెళుతున్న సమయంలో తాను 12 కిలోల మేర బరువు తగ్గానన్నాడు. ఒకసారి తన బరువు 66 కిలోల వరకూ కూడా తగ్గిందన్నాడు.