నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు | I've never had a girlfriend: Armaan Jain | Sakshi
Sakshi News home page

నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు

Published Sat, Jun 21 2014 10:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు - Sakshi

నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు

 న్యూఢిల్లీ: వర్ధమాన నటుడు అర్మాన్ జైన్ నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అతని జీవితంలో ప్రేమ ప్రయాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధమూ లేదని ఈ 23 ఏళ్ల యువ నటుడు అంగీకరించాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్... ఆరిఫ్ అలీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘లేకర్ హం దివానా దిల్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చన్నాడు. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు. అందువల్లనే నావైపు ఎవరూ చూడడం లేదు.
 
 ఇదిలాఉంచితే మరికొంతమంది యువతులు నాకు రాఖీ కట్టారు. నన్ను  వారి సోదరుడిగా భావించారు. చాలా చిన్నతనంనుంచే పని చేయడం ప్రారంభించాను. దృష్టంతా పనిమీదనే ఉంచా. ఎక్కడికైనా బయటికి వెళ్లేందుకు కూడా నాకు తగినంత సమయం దొరకడం లేదు’ అని అన్నాడు. టీనేజర్‌గా ఉన్న సమయంలో అర్మాన్... కరణ్‌జోహార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం కాకుండా పెట్టుబడిదారుడు మనోజ్‌జైన్, రాజ్‌కపూర్ కుమార్తె రీమా కుమారుడైన అర్మాన్... నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో మొదటినుంచి తన కొవ్వును తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాడు. ‘నేను నిజంగా చాలా బరువుగా ఉంటాను. నటన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నా. దీంతో తిండి బాగా తగ్గించేశా ’ అని ఈ ఫుట్‌బాల్ క్రీడా ప్రేమికుడు చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement