రాజ్‌కపూర్‌ భార్య కన్నుమూత | Krishna Kapoor, Widow of Raj Kapoor Dead | Sakshi
Sakshi News home page

రాజ్‌కపూర్‌ భార్య కన్నుమూత

Published Mon, Oct 1 2018 10:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Krishna Kapoor, Widow of Raj Kapoor Dead - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత రాజ్ కపూర్ భార్య కృష్ణ కపూర్ (87)  సోమవారం   కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మరణించారని ఆమె పెద్ద కుమారుడు , బాలీవుడ్‌ నటుడు  రణదీర్‌ కపూర్‌  వెల్లడించారు. నటులు రాజేంద్ర నాథ్,  ప్రేమ నాథ్‍ల సోదరి అయిన  కృష్ణ కపూర్‌  1946,మే లో రాజ్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు.  రాజ్‌కపూర్‌, కృష్ణకపూర్‌  దంపతులకు అయిదుగురు సంతానం.  రణధీర్‌, రిషీ కపూర్, రాజీవ్ కపూర్  కొడుకులు,  రితూ నందా,  రిమా కపూర్ కుమార్తెలు.

ఈ  ఉదయాన్నే నా తల్లిని కోల్పోయాను, ఆమె ప్రశాంతంగా కన్నమూసారంటూ రణధీర్ కపూర్ ట్వీట్ చేశారు.  రిషీ కపూర్‌ కుమార్తె రిధిమ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నాన‍్నమ్మకు సంతాపం తెలుపుతూ లవ్‌ యూ  ఆల్‌వేస్‌..దాది అని పోస్ట్‌ చేశారు.  మరోవైపు కృష్ణ కపూర్‌ మరణంపై చలన చిత్ర పరిశ్రమ పెద్దలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  నటి రవీనా టాండన్‌ సహా  పలువురు  ప్రముఖులు సంతాప సందేశాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement