
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు రియో కపాడియా(66) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సప్నే సుహానే లడక్‌పాన్ కే, మహాభారత్ సీరియల్స్‌లోనూ నటించారు. దిల్ చాహ్తా హై, చక్ దే ఇండియా, మర్దానీ చిత్రాల్లో కనిపించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
రియో మృతి పట్ల సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సంతాపం ప్రకటించింది. కపాడియా బాలీవుడ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియాలో చిత్రంలో కనిపించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్- 2 అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ తండ్రిగా నటించారు. దాదాపు మూడు దశాబ్దాల తన కెరీర్‌లో కుటుంబం, జుద్వా రాజా, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. మహాభారతం సీరియల్‌లో గంధర్ రాజు పాత్రకు ప్రశంసలు అందుకున్నారు.
CINTAA expresses its condolences on the demise of Rio Kapadia (Member since 2004)
— CINTAA_Official (@CintaaOfficial) September 14, 2023
.#condolence #condolencias #restinpeace #rip #RioKapadia #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/d6GOLdtUZu
Comments
Please login to add a commentAdd a comment