నాకు సిక్స్ ప్యాక్ లేదు.. ఫ్యామిలీ ప్యాకే! | I've got a family pack, no six-pack: Armaan Jain | Sakshi
Sakshi News home page

నాకు సిక్స్ ప్యాక్ లేదు.. ఫ్యామిలీ ప్యాకే!

Published Thu, Jul 3 2014 3:22 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

నాకు సిక్స్ ప్యాక్ లేదు.. ఫ్యామిలీ ప్యాకే!

నాకు సిక్స్ ప్యాక్ లేదు.. ఫ్యామిలీ ప్యాకే!

 ముంబై: తనకు ఇంకా సిక్స్ ప్యాక్ రాలేదని, ప్రస్తుతానికి ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నానని బాలీవుడ్ వర్దమాన నటుడు అర్మాన్ జైన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం అర్మాన్ సిక్స్ కోసం పరితపిస్తున్నా..శరీరాకృతిలో పెద్దగా మార్పులు కనిపించడం లేదని అంగీకరించాడు. 'నేను ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నాను. ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేస్తే నా బాడీ లాంగ్వేజీలో మార్పు కోసం యత్నిస్తానని' అర్మాన్ తెలిపాడు. తనకు సినిమాలతో పాటు.. ఆటలంటే మహాప్రాణమన్నాడు. ప్రతీరోజూ రెండు గంటలపాటు ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్ ఆటలు ఆడుతుంటానన్నాడు. అరిఫ్ ఆలీ దర్శకత్వంలో రూపొందిన 'లేకర్ హమ్ దీవానా దిల్ ' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అర్మాన్..దీక్షాసేథ్ తో జోడీ కట్టాడు.

 

దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్ కు ముఖానికి రంగువేసుకునేముందే సినిమాతో సంబంధం ఉంది. కరణ్ జోహార్ వద్ద అతను మూడు సంవత్సరాలు దర్శకత్వశాఖలో పనిచేశాడు. 'మై నేమ్ ఈజ్ ఖాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ', 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాలకు  అర్మాన్ శిక్షను పొందాడు. కేవలం కరణ్ వద్దకు సినిమా డైరెక్షన్ నేర్చుకుందామనే మాత్రమే ఫీల్డ్ లో అడుగుపెట్టినట్లు ఈ  23 ఏళ్ల యువనటుడు తెలిపాడు. తాను లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చని గతంలో అర్మాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు అని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement