Arif Ali
-
ఫిబ్రవరి 8న పాకిస్తాన్ ఎన్నికలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరుపుతామని అధ్యక్షుడు అరిఫ్ అల్వీ గురువారం ప్రకటించారు. దేశంలో ఆర్థిక అస్థిరత తీవ్రరూపం దాలి్చన ఈ సమయంలో అధ్యక్షుడితో చర్చించి, ఎన్నికల తేదీని ఖరారు చేయాలంటూ అంతకుముందు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్(ఈసీపీ) చీఫ్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా, కమిషన్‌లోని నలుగురు సభ్యులు, అటార్నీ జనరల్ ఉస్మాన్ అవాన్ కలిసి అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కలిశారు. ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల తేదీని 2024 ఫిబ్రవరి 8గా నిర్ణయించినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. -
నవంబర్‌లో గిల్గిత్ అసెంబ్లీ ఎన్నికలు
ఇస్లామాబాద్: నవంబర్ 15వ తేదీన గిల్గిత్– బాల్టిస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న ఆ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. 2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్– బాల్టిస్తాన్ శాసన సభకు నవంబర్ 15న ఎన్నికలు జరుగుతాయని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు చెల్లుబాటు కావని భారత్ పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ..భారత్ అంతరంగిక విషయాలపై మాట్లాడేందుకు పాక్‌కు ఎలాంటి హక్కు లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతోపాటు గిల్గిత్–బాల్టిస్తాన్ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం పాక్ సీనియర్ దౌత్యాధికారికి నోటీసులు జారీ చేసింది. -
రాజ్ కపూర్ మనవడు, దీక్షసేత్ ల మూవీ ప్రెస్ మీట్
-
నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు
న్యూఢిల్లీ: వర్ధమాన నటుడు అర్మాన్ జైన్ నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అతని జీవితంలో ప్రేమ ప్రయాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధమూ లేదని ఈ 23 ఏళ్ల యువ నటుడు అంగీకరించాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్... ఆరిఫ్ అలీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘లేకర్ హం దివానా దిల్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చన్నాడు. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు. అందువల్లనే నావైపు ఎవరూ చూడడం లేదు. ఇదిలాఉంచితే మరికొంతమంది యువతులు నాకు రాఖీ కట్టారు. నన్ను వారి సోదరుడిగా భావించారు. చాలా చిన్నతనంనుంచే పని చేయడం ప్రారంభించాను. దృష్టంతా పనిమీదనే ఉంచా. ఎక్కడికైనా బయటికి వెళ్లేందుకు కూడా నాకు తగినంత సమయం దొరకడం లేదు’ అని అన్నాడు. టీనేజర్‌గా ఉన్న సమయంలో అర్మాన్... కరణ్‌జోహార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం కాకుండా పెట్టుబడిదారుడు మనోజ్‌జైన్, రాజ్‌కపూర్ కుమార్తె రీమా కుమారుడైన అర్మాన్... నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో మొదటినుంచి తన కొవ్వును తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాడు. ‘నేను నిజంగా చాలా బరువుగా ఉంటాను. నటన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నా. దీంతో తిండి బాగా తగ్గించేశా ’ అని ఈ ఫుట్‌బాల్ క్రీడా ప్రేమికుడు చెప్పాడు.