మా అమ్మ కొట్టలేదు | My mom has never slapped me: Armaan Jain | Sakshi
Sakshi News home page

మా అమ్మ కొట్టలేదు

Published Tue, Jul 1 2014 10:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మా అమ్మ కొట్టలేదు - Sakshi

మా అమ్మ కొట్టలేదు

ఒక చెంప దెబ్బ షాట్‌ను సరిగ్గా తీయడం కోసం 200 టేక్‌లు తీసుకున్నానని ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగిడుతున్న అర్మాన్‌జైన్ చెప్పాడు. ‘మా అమ్మ రీమా నన్ను ఏనాడూ కొట్టలేదు. అందువల్లనే ఆ సీన్‌ను పండించడానికి అన్ని టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది’ అని రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘నేను అసలు అల్లరే చేసేవాడిని కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఆమెను సతాయిస్తే వెంటనే ఓ గదిలో బంధించేది. అంతేతప్ప ఏనాడూ నాపైకి చేయెత్తలేదు. ఈ సినిమాలో నా తల్లి పాత్రధారి అనిత నన్ను తొలిసారిగా కొట్టింది.
 
 దీంతో దిగ్భ్రాంతికి గురయ్యా’ అని అన్నాడు. కపూర్‌ల కుటుంబానికి చెందిన ఈ నటవారసుడు తన బంధువులైన రణ్‌బీర్, కరిష్మా, కరీనా కపూర్‌ల సహాయం ఏనాడూ తీసుకోలేదు. అయినప్పటికీ తొలి సినిమా ద్వారా భారీ హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాడు. అరిఫ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాలో అర్మాన్ సరసన దీక్షాసేథ్ నటించింది. ఈ సినిమాకు కరీనా భర్త సైఫ్ అలీఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుద ల కానుంది.
 
 ‘సైఫ్ సినిమాలో నాకు ఓ అవకాశం దొరికింది. మా సోదరులు ఎవరైనా కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని అంతా అనుకుంటారు. అయితే అది సరికాదు. సినిమాలు మినహా అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఏ ఒక్కరికీ చెప్పకుండానే ‘లేకర్ హం దివానా దిల్’ సినిమా ఆడిషన్‌లో పాల్గొన్నా. ఈ సినిమాకోసం ఆరిఫ్ నన్ను ఎంపిక చేసిన తర్వాత ఈ విషయాన్ని దీదీ (కరీనాక పూర్) తెలియజేశా’ అని అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement