అర్మాన్ జైన్ కు షారుఖ్ ఖాన్ అభినందనలు | Shah Rukh Khan wishes newcomer Armaan 'happy first step' | Sakshi
Sakshi News home page

అర్మాన్ జైన్ కు షారుఖ్ ఖాన్ అభినందనలు

Published Fri, Jul 4 2014 3:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Shah Rukh Khan wishes newcomer Armaan 'happy first step'

ముంబై:వర్దమాన నటుడు అర్మాన్ జైన్ కు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అభినందనలు తెలియజేశారు. అర్మాన్ హీరోగా నటించిన 'లేకర్ హమ్ దీవానా దిల్' శుక్రవారం విడుదలైన సందర్భంగా షారుఖ్.. ఆ యువనటుడుకి ఆశీస్సులు అందించాడు. అర్మాన్ తొలి సినిమా ఆరంగేట్రం బాగుందంటూ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా ఆ టీంకు, అర్మాన్ కు ప్రత్యేకం అభినందనలు తెలిపాడు. అతను వేసిన తొలి అడుగు నిజంగానే ఈ సినిమా ప్రపంచానికి సంతోషకరమైనదని తెలిపాడు. దివంగత రాజ్ కపూర్ మనవడైన అర్మాన్ జైన్ కలలు సాకారం కావాలని షారుఖ్ పేర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ కూడా అర్మాన్-దీక్షాసేథ్ జోడీని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ సినిమాలో వారిద్దరి జోడీ చాలా ఆకర్షణీయంగా ఉందని తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement