తండ్రైన అసిస్టెంట్ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెప్పిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్, నటుడు అర్మాన్ జైన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అనిస్సా మల్హోత్రా ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరీనా కపూర్ బంధువు అయిన అర్మాన్ జైన్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఈ విషయం తెలుసుకున్న కరీనా కపూర్, నీతూ కపూర్ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ వారితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ శుభవార్త విన్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. నీతూ కపూర్‌కు ఆర్మాన్ జైన్ మేనల్లుడు. అర్మాన్, అనిస్సా ఫిబ్రవరి 2020లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో బేబీ షవర్‌ను నిర్వహించారు.
View this post on Instagram
A post shared by Anissa Malhotra Jain (@stylebyanissa)