తండ్రైన అసిస్టెంట్ డైరెక్టర్.. కంగ్రాట్స్‌ చెప్పిన స్టార్ హీరోయిన్! | Armaan Jain and Anissa Malhotra welcome their baby boy | Sakshi
Sakshi News home page

Armaan Jain: తండ్రైన అసిస్టెంట్ డైరెక్టర్.. కంగ్రాట్స్‌ చెప్పిన స్టార్ హీరోయిన్!

Published Sun, Apr 23 2023 7:58 PM | Last Updated on Sun, Apr 23 2023 8:21 PM

Armaan Jain and Anissa Malhotra welcome their baby boy - Sakshi

బాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్, నటుడు అర్మాన్ జైన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అనిస్సా మల్హోత్రా ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరీనా కపూర్ బంధువు అ‍యిన అర్మాన్ జైన్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 

ఈ విషయం తెలుసుకున్న కరీనా కపూర్, నీతూ కపూర్ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ వారితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ శుభవార్త విన్న పలువురు బాలీవుడ్ తారలు  ఈ జంటకు అభినందనలు తెలిపారు.  కాగా.. నీతూ కపూర్‌కు ఆర్మాన్ జైన్‌ మేనల్లుడు. అర్మాన్, అనిస్సా ఫిబ్రవరి 2020లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో బేబీ షవర్‌ను నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement