assistant director
-
‘కార్బన్ పాజిటివ్’ పొలం!
లిస్సిమోల్ జె. వడక్కూట్.. దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన డైనమిక్ వ్యవసాయ అధికారిణి. కేరళ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో సహాయ సంచాలకురాలిగా గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కొచ్చిన్ నగరానికి సమీపంలో అలువి అనే చోట వందేళ్లకు ముందే ఏర్పాటైన ప్రభుత్వ వరి విత్తనోత్పత్తి క్షేత్రం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం లిస్సిమోల్ ఈ క్షేత్రం బాధ్యతలు తీసుకునేటప్పటికి దేశంలో ఎవరికీ దీని గురించి తెలీదు. అయితే, ఆమె అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ క్షేత్రానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. దేశంలోనే తొలి ‘కార్బన్ న్యూట్రల్’ వరి క్షేత్రంగా అలువి సీడ్ ఫామ్‌కు గుర్తింపు దక్కింది. 5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వరి (ఇక్కడ పండించే వరి రకాల్లో అత్యధికం దేశీ రకాలే)తో పాటు అనేక ఇతర పంటలను సాగుచేస్తూ.. ఒక ఆదర్శ సమీకృత వ్యవసాయ క్షేత్రంగా లిస్సిమోల్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. ‘కార్బన్ న్యూట్రల్’ అంటే?నీటిని నిల్వ గట్టి వరి పంటను సాగు చేస్తే కర్బన ఉద్గారాలు భారీగానే వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉద్గారాలతో పాటు... నీటిని నిల్వగట్టడం వల్ల మిథేన్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంటుంది. అటువంటి పొలం నుంచి విడుదలయ్యే ఉద్గారాలను అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించటం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించటం మాత్రమే కాకుండా.. అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరించే స్థాయికి ఈ ఫామ్‌ను అభివృద్ధి చేయటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. 2022 డిసెంబర్లో అలువ ఫామ్‌ను ప్రభుత్వం కార్బన్ న్యూట్రల్ ఫామ్‌గా ప్రకటించింది.170 టన్నుల కర్బనం మిగులు!కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘కాలేజ్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’ (ఇలాంటి కాలేజీ ఒకటి దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు) ప్రయోగాలు చేసి ఉద్గారాలను శాస్త్రీయంగా లెక్కగట్టింది. తురుత్ ద్వీప ప్రాంతంలో గల ఈ ఫామ్ 43 టన్నుల కర్బనాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుండగా, 213 టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరిస్తోందని ఈ ప్రయోగాల్లో తేలింది. అంటే.. ఈ క్షేత్రం 170 టన్నుల కార్బన్ క్రెడిట్లను సంపాయించిందన్న మాట. ఇది నిజానికి ‘కార్బన్ పాజిటివ్’ క్షేత్రం!కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 13 విత్తనోత్పత్తి క్షేత్రాలు నడుస్తున్నాయి. వీటన్నిటినీ కార్బన్ న్యూట్రల్ ఫామ్స్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరుకోవటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్బన్ న్యూట్రల్ ప్రదర్శనా క్షేత్రాలను నిర్మించే ప్రయత్నమూ జరుగుతోంది.ఇదీ సమీకృత సేంద్రియ సేద్యం5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో 3 హెక్టార్లలో వరితో పాటు.. ఒక హెక్టారులో చిరుధాన్యాలు, చియా గింజలు, కొబ్బరి, అరటి, దుంప పంటలు, జాపత్రి, కూరగాయలు, ΄్యాషన్ ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తున్నారు. 2012 నాటికే ఎన్‌పిఓపి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాసర్గోడ్ కల్లన్ రకం దేశీ ఆవులు 9, మలబార్ మేకలు 16, కుట్టనాడన్ బాతులు వంద, నాటు కోళ్లు, గిన్నె కోళ్లు కలిపి 50తో పాటు బ్యాచ్‌కి 5 వేల గిఫ్ట్ తిలాపియా చేపలను సైతం ఈ సమీకృత క్షేత్రంలో పెంచుతున్నారు. దేశీ వరి రకాలు (జపాన్ వైలెట్, రక్తశాలి, గోల్డెన్ నవార, వెల్లతొండి, వదక్కన్ వెల్లారి కైమ, జైవ, మనురత్న..), అధికోత్పత్తినిచ్చే వరి వంగడాల విత్తనోత్పత్తిని చేపట్టడంతో పాటు లైవ్ రైస్ మ్యూజియంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. పంచగవ్య, జీవామృతం వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ద్రావణాలతో పాటు చీడపీడలను అరికట్టే కషాయాలను తయారు చేసుకొని పంటలకు వాడటమే కాకుండా రైతులకు విక్రయిస్తున్నారు. వామ్, వర్మీ కం΄ోస్టు, వర్మీవాష్‌ను తయారు చేస్తున్నారు. రెడువీద్ వంటి మిత్రపురుగులను సైతం పెంచుతున్నారు. తేనెటీగల పెంపకం కూడా ఉంది. పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ క్షేత్రం నిజంగా విలక్షణమైనదే. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వరి పొలంలో అనేక సమస్యల పరిష్కారానికి బాతులను ఉపయోగించటం. కలుపు నివారణ, చీడపీడల నియంత్రణతో పాటు భూసారం పెంపొందించడానికి కూడా బాతులు ఉపయోగపడుతున్నాయని లెస్సిమోల్ తెలిపారు. ఇక్కడ అనుసరించే ప్రతి పనినీ శాస్త్రీయంగా రికార్డు చేసి, అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించారు. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని అన్ని హంగులతో సక్రమంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ క్షేత్రం కళ్లకు కడుతున్నదనటంలో అతిశయోక్తి లేదు! దేశం నేర్చుకోదగ్గ పాఠాలు2012 నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఈ క్షేత్రంలో అనుసరిస్తూ పదేళ్లలో ఈ మైలురాయిని దాటాం. హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించే విధంగా వ్యవసాయ పనులను సమూలంగా మార్చాం. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటో రైతులు, స్థానిక ప్రజలకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. దేశం యావత్తూ నేర్చుకోదగిన పర్యావరణ హిత సేద్య పాఠాలకు మా క్షేత్రం కేంద్ర బిందువైంది. – లిస్సిమోల్ జె. వడక్కూట్, సహాయ సంచాలకురాలు, స్టేట్ సీడ్ ఫామ్ అలువి, ఎర్నాకులం జిల్లా పంచాయత్, కేరళ -
గచ్చిబౌలిలో దారుణం..
-
36 ఏళ్లుగా ఒక్క సెలవూ లేదు.. హ్యాట్సాఫ్ ‘కడారి’
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఉద్యోగమంటే ఏడాదిలో చాలా సెలవులుంటాయి. అతి తక్కువ మంది ఈ సెలవుల వినియోగంలో పొదుపుగా వ్యవహరిస్తారు. అత్యవసరానికి తప్ప మరే పనికీ సెలవు పెట్టారు. కానీ కడారి సుబ్బారావు తన 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదంటే ఆశ్చర్యమే మరి. కాకినాడ జిల్లా విద్యాశాఖలో కడారి సుబ్బారావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గొల్లప్రోలుకు చెందిన ఈయన 1987లో గ్రూప్–4 ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ జీవితం 36 ఏళ్ల 8 నెలల కాలంలో ఒక్క సెలవు తీసుకోలేదు. ఈ నెల 30న రిటైర్ కానున్నారు. 2003 నుంచి ఇప్పటి వరకూ 6 సార్లు ఉత్తమ జిల్లా స్థాయి ఉద్యోగిగా, 2009లో తెలుగు అకాడమీ పురస్కారం సాధించారు. -
తండ్రైన అసిస్టెంట్ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెప్పిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్, నటుడు అర్మాన్ జైన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అనిస్సా మల్హోత్రా ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరీనా కపూర్ బంధువు అయిన అర్మాన్ జైన్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న కరీనా కపూర్, నీతూ కపూర్ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ వారితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ శుభవార్త విన్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. నీతూ కపూర్‌కు ఆర్మాన్ జైన్ మేనల్లుడు. అర్మాన్, అనిస్సా ఫిబ్రవరి 2020లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో బేబీ షవర్‌ను నిర్వహించారు. View this post on Instagram A post shared by Anissa Malhotra Jain (@stylebyanissa) -
‘హైటెక్ సెక్స్‌రాకెట్’లో అసిస్టెంట్ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన హైటెక్ సెక్స్‌రాకెట్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ) అరెస్టు చేసింది. ఈ కేసులో సురేశ్ బోయిన అనే టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పోలీసులకు చిక్కాడు. ఈ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను అక్రమంగా తరలించి వాట్సాప్ గ్రూప్‌లు, వెబ్సైట్లలో వారి ఫొటోలను పెట్టి, కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తూ స్టార్ హోటళ్లు, ఓయో రూమ్‌లలో వ్యభిచారదందా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు 33 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిలో బాలీవుడ్లో కథారచయిత ముంబైకి చెందిన మోహిత్ సత్పాల్ అలియాస్ గార్గ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మేకల అఖిల్‌కుమార్, నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళ్‌రావునగర్‌కు చెందిన సురేశ్ బోయిన అలియాస్ కుమార్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై మాదాపూర్, పంజగుట్ట ఠాణాలో ఇప్పటికే నాలుగు కేసులున్నాయి. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్వైపింగ్ మెషీన్, పాస్‌పోర్ట్, ఆధార్, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ►బంజారాహిల్స్‌లోని హయత్ హైట్స్‌లో ఉండే సురేశ్ బోయిన ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సినీపరిశ్రమకే చెందిన నందు అనే వ్యక్తితో కలిసి సురేశ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారదందా మొదలుపెట్టాడు. ►పశ్చిమ బెంగాల్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సురేశ్ నమ్మించి మోడల్స్, సినీతారలను అక్రమంగా తరలించి హైదరాబాద్‌లోని పెద్దలకు పరిచయం చేసేవాడు. లొకాంటో, స్కోక్కా, బ్లాక్‌పేజ్ వంటి వెబ్సైట్లలో అమ్మాయిల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షించేవాడు. 35–40 శాతం కమీషన్ తీసుకొని మహిళలను సరఫరా చేసేవాడు. సురేశ్ ఈ దందాను కొంతకాలం గోవాలో కూడా నిర్వహించాడు. ఇప్పటివరకు 450–500 మంది బాధితులను వ్యభిచారకూపంలోకి దింపాడు. ►2019లో గచ్చిబౌలిలోని క్లబ్‌రోగ్ పబ్‌లో వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తున్న దీపక్ రాయ్‌తో అఖిల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అఖిల్ మాదాపూర్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని దందా మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే పోలీసులు దాడి చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి 400–500 మంది మహిళలను తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దింపి, హైదరాబాద్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తూ విటులను ఆకర్షించేవాడు. -
పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. దుర్గంచెరువులో దూకి ఇటీవల సాయికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్ గతంలో పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గంచెరువులో దూకి సాయికుమార్ సూసైడ్ చేసుకున్నట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.కాగా ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందులేకపోయింది. చదవండి: (రాజ్ కుటుంబాన్ని వెంటాడుతున్న గుండె జబ్బులు) -
గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హాథీరామ్ను రాచకోండ పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్ కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కారులో గంజాయిని హాథీరామ్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై తమకు కొద్ది రోజుల క్రితమే సమాచారం అందిందని. సోమవారం ఖచ్చితమైన సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ కేసులో హథిరామ్తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో హాథీరామ్ను ఏ2 నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
Assistant Director Death అనుమానాస్పద స్థితిలో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ కుంట్లూర్ శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉండే మరిగంటి కార్తీక్ కుమార్(31) సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. కార్తీక్ ఈనెల 14న తన ద్విచక్ర వాహనం(ఏపీ29బీసీ0439)పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తన సోదరుడు సందీప్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం సందీప్ తిరిగి కార్తీక్‌కు ఫోన్ చేస్తే సమాధానం రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న సాయంత్రం సమయంలో గౌరెళ్లి సమీపంలోని జీవీర్ కాలనీ సీఎన్ఆర్ క్రికెట్ అకాడమీ దగ్గర ఓ యువకుడు మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహం కార్తీక్‌ది కావచ్చనే అనుమానంతో 17న ఉదయం అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్ కుటుంబ సభ్యులు అది కార్తీక్ మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన -
'అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటిగా అవకాశం వచ్చింది'
కలలు కన్న జీవితం కోసం క్రమశిక్షణను ఆలంబనగా మలచుకుంది.. స్క్రీన్ ట్రావెల్ స్టార్ట్ చేసింది.. ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది.. సహాయ దర్శకురాలు, నటి దేవిక వత్స.. ♦ ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో స్కూలింగ్ మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది. ♦ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ♦ మొదట పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. తర్వాత యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ♦ 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘గబ్రూ: హిప్ హాప్ కే షెహజాదే’ తో వెబ్‌దునియాలోకి ఎంటర్ అయింది. అది మంచి విజయం సాధించడంతో వరుసగా ‘ద గుడ్ వైబ్స్’, ‘ఇట్స్ నాట్ దట్ సింపుల్’, ‘చీజ్ కేక్’ సిరీస్‌లలో నటించింది. ♦ వెండితెర మీద కనిపించాలన్నది ఆమె ఆశ. అయితే తొలుత ఆఫ్ స్క్రీన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం దొరకింది.. ‘హమారీ అధూరీ కహానీ’ సినిమాకు. ఆ సమయంలోనే ‘దమ్ లగా కే హైశా’ సినిమాలోని ఓ పాత్రకు ఎంపికైంది. ♦ ఆ సినిమా నుంచి నటిగా అవకాశాలు క్యూ కట్టాయి. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ♦ యాక్టర్ల కంటే టెక్నీషియన్ల కష్టమే ఎక్కువ. వారికి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలి. ఇది నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినందుకు చెప్పడం లేదు. యాడ్ షూట్స్ చేసే సమయంలోనే వారి కష్టం నాకు తెలిసింది. అందుకే కొన్ని రోజులు టెక్నీషియన్‌గా పనిచేశా. – దేవికా వత్స. చదవండి : 'ఆ హీరో ఫిజిక్ ది బెస్ట్..రష్మికను బలవంతంగా గెంటేస్తా' హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు -
విశాల్ నా టైటిల్ దొంగిలించాడు!: దర్శకుడి ఆవేదన
నటుడు విశాల్‌పై సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ నటుడు, శాసనసభ్యులు ఉదయనిధి స్టాలిన్‌కు ఫిర్యాదు చేశారు. అందులో ఆయన తాను గత 15 ఏళ్లుగా సహాయ దర్శకుడిగా సినీ పరిశ్రమలో పని చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న "చక్రం" సినిమాకి పని చేసే సమయంలో తాను రాసుకున్న 'కామన్‌మ్యాన్' కథ గురించి చెప్పానన్నారు. అయితే విశాల్ తాను నటిస్తున్న తాజా చిత్రానికి తన "కామన్‌మ్యాన్" టైటిల్‌ను అక్రమంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తన చిత్ర టైటిల్ వాడుకోమని ఆయనకు చెప్తే అప్పుడు ఆయన మౌనంగా ఉండి ఇప్పుడు తన అనుమతి లేకుండా టైటిల్ వాడుకోవాలని చూస్తున్నారన్నారు. తన చిత్ర టైటిల్ కింద "నాట్ ఏ కామన్ మ్యాన్" అనే ట్యాగ్‌లైన్ జోడించారు. దీని గురించి తాను విశాల్‌ను అడగ్గా ఆయన వర్గం తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ ఆరోపించారు. చదవండి: విశాల్ ఫిర్యాదు బాధించింది: నిర్మాత ఆర్బీ చౌదరి -
అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమలో స్టార్ హీరో కూతురు!
'కేదార్నాథ్' సినిమాతో వెండితెరపై కెరీర్‌ను ఆరంభించింది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో సుశాంత్, సారా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి, కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. తర్వాత ఆమె యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమాయణం జరుపుతున్నట్లు టాక్ నడిచింది. వీళ్లిద్దరిదీ విడదీయరాని అనుబంధం అంటూ కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే తాజాగా సారా మరో వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. 'కేదార్నాథ్' అసిస్టెంట్ డైరెక్టర్ జెహన్ హండాతో ఆమె ప్రేమలో పడిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలన్నా చేకూరుస్తూ.. సముద్ర తీరాన జెహన్ హండాతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సారా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా "లవ్ యూ.. నన్ను మళ్లీ అక్కడకు తీసుకెళ్లిపో" అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో వీళ్లిద్దరూ నారింజ రంగు దుస్తులను ధరించగా సారా అతడిపై వాలిపోవడం చూడొచ్చు. ఇదిలా వుంటే గతేడాది జెహన్.. సారా పుట్టినరోజు చేసిన పోస్ట్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. 'మన స్నేహం, ప్రేమ, జ్ఞాపకాలను మార్చడం ఎవరి తరమూ కాదు, నేనెప్పటికీ నీతో ఉంటానని మాటిస్తున్నా'నని చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ స్టార్ కిడ్ ఎవరో గుర్తు పట్టారా? -
కరోనాతో ప్రముఖ అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూత
సాక్షి, వరంగల్: ఓ గిరిజన యువకుడికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టమే సినిమా అసిస్టెంట్ డైరెక్టర్‌ను చేసింది. ప్రస్తుతం మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ బిజిగా గడుపుతున్న అతడిని విధి వెంటాడింది. కరోనా రూపంలో మృత్యువు కబళించగా.. ఇంతకాలం కన్న సినిమా కలలన్నీ చెదిరిపోయాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లూనావత్ తండా గ్రామ పంచాయతీకి చెందిన లూనావత్ శ్రీనివాస్ (30)కు చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన వనజతో 2011 సంవత్సరం వివాహం అయింది. వారికి ఇద్దరు కుమారులు అర్జున్(7), అదర్వ(22 నెలలు) ఉన్నారు. కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనివాస్.. మూడేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాకు డైరెక్టర్ కొరటాల శివ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ పనిచేస్తున్నారు. అలాగే నందినిరెడ్డి అనే మరో మహిళా డైరెక్టర్ వద్ద.. పొలిమేరు అనే మరో సినిమాకు కూడా శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న క్రమంలో ఈనెల 2వ తేదీన శ్రీనివాస్ కరోనా బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ నుంచి ఖమ్మం తీసుకొచ్చి ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఈనెల 12న మృతి చెందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం పుట్టిల్లు అయిన ఉగ్గంపల్లికి వచ్చింది. వనజ అత్తగారి ఇంటివద్ద ఎకరం భూమి తప్ప ఈ కుటుంబానికి ఏ ఆధారం లేదు. దీంతో దిక్కుతోచని స్థితితో ఇద్దరు చిన్నారులతో తల్లి కన్నీటి పర్యంతం అయింది. చదవండి: అజయ్ కొత్త బంగ్లా: ఖరీదు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! -
తండ్రికి అసిస్టెంట్‌గా తనయ
ఇటీవలే మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ మలయాళ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. ఫైట్స్, డ్యాన్స్‌లతో అందర్నీ మెప్పించారు. ఇప్పుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ కూడా సినిమాల్లోకి రాబోతున్నారని మలయాళ ఇండస్ట్రీ టాక్. అయితే విస్మయ పని చేయబోయేది ఆన్‌స్క్రీన్ కాదు... ఆఫ్‌స్క్రీన్. దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయబోతున్నారు. ‘బారోజ్’ అనే చిత్రం ద్వారా మోహన్‌లాల్ తొలిసారి దర్శకుడిగా మారబోతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వంలో తండ్రికి చేదోడుగా ఉంటారట విస్మయ. ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్ర పోషించనున్నారు లాల్. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చని సమాచారం. -
పెళ్లి పేరుతో శారీరకంగా ఒక్కటై.. ఆపై..
సాక్షి, బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచనకు పాల్పడ్డాడని సినిమా ఓ సినీ సహాయ దర్శకురాలు తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీనగరలో నివాసం ఉంటున్న 32 సంవత్సరాల సహాయదర్శకురాలికి 2018లో ఫేస్బుక్లో పరిచయమైంది. అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె పూర్తిగా నమ్మింది. ఈక్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. కొద్దిరోజుల అనంతరం వివాహం చేసుకోవాలని కోరగా తన అసలు నైజాన్ని బయట పెట్టాడు. (వదినతో వివాహేతర సంబంధం..ఇంటికి పిలిపించి) ఇంట్లోవాళ్లు చూసిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని ఇతరులతో చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అనంతరం సొణ్ణేనహళ్లిలో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. అవసరాలు ఉన్నాయంటూ పలుమార్లు లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 12 తేదీన మరో రూ.5 లక్షలు ఇవ్వాలని కోరగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత అతను అందుబాటులోలేకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్చాప్ చేశాడు. దీంతో బాధితురాలు బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. (అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి ) -
నటి ప్రేమాయణం.. విషం తాగిన తల్లి
కర్ణాటక, మండ్య : కొద్ది కాలంగా సహాయ దర్శకుడితో ప్రేమాయణం సాగిస్తున్న ఓ నటి ప్రియుడితో కలసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన నటి తల్లి, అమ్మమ్మ విషం తీసుకోవడంతో అమ్మమ్మ మృతి చెందిన ఘటన బుధవారం మండ్య జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని మద్దూరు తాలూకా మెళ్లహళ్లి గ్రామానికి చెందిన నటి విజయలక్ష్మీ తల్లితండ్రులు మహదేవస్వామి, సవితా, అమ్మమ్మ చెన్నమ్మ (65)లతో కలసి చెన్నపట్టణలో నివాసం ఉంటోంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన విజయలక్ష్మీ కొద్ది రోజులుగా తుంగభద్ర అనే చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో రాయచూరులో పది రోజుల పాటు చిత్రీకరణ జరుపుకొన్న సమయంలో చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్న అంజనప్పతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో గతనెల 15న ఆంజనప్పతో కలసి వెళ్లిపోయిన విజయలక్ష్మీ 15 రోజుల అనంతరం ఇంటికి తిరిగివచ్చింది. ఇకపై ఇటువంటి తప్పులు పునరావృతం చేయనని చెప్పగా తల్లితండ్రులు విజయలక్ష్మీని క్షమించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈనెల 3న మళ్లీ అంజనప్పతో కలసి విజయలక్ష్మీ వెళ్లిపోయింది. దీంతో అంజనప్ప చిరునామా కనుక్కొన్న విజయలక్ష్మీ తండ్రి మహదేవస్వామి అంజినప్ప తల్లితండ్రులను విచారించగా అక్కడికి కూడా రాలేదని సమాధానం వచ్చింది. కూతురు వెళ్లిపోయిందని బాధలో ఉండగానే కొత్త చిత్రాలకు సంబంధించి విజయలక్ష్మీకి అడ్వాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలు ప్రతిరోజూ ఇంటికి వస్తూ దుర్భాషలాడసాగారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన తల్లి సవిత, అమ్మమ్మ చెన్నమ్మ సోమవారం విషం తాగారు. అంతకుముందు తమ మరణానికి అంజినప్ప కారణమని వీడియో చిత్రీకరించారు. ఇది గమనించిన మహదేవస్వామి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చెన్నమ్మ మృతి చెందగా సవితా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా విజయలక్ష్మీ ఇప్పటివరకు సుమారు 16 చిత్రాల్లో నటించిందని తెలుస్తోంది. -
సాక్షి ఎఫెక్ట్: అవినీతి అధికారిపై వేటు
సాక్షిప్రతినిధి విజయనగరం: రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అక్రమాలు నిరంతరం సాగవు. ఎవరూ చూడటం లేదనీ... ఏమైనా చేసేయొచ్చనీ... సొంత నిర్ణయాలు తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. అవినీతిని ఏమాత్రం సహించబోమని అధికారంలోకి వచ్చిన వెంటనే స్పష్టంచేసిన సీఎం అందుకోసం ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్ కూడా పెట్టారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. పట్టుబడిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.వి.వి.ఎస్.చౌదరిపై సస్పెన్షన్ వేటు వేశారు. విజయనగరం రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అధికారిగా, విశాఖపట్నం మైన్స్ అండ్ జియాలజీ ఇన్చార్జ్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న చౌదరిని విధుల నుంచి తప్పిస్తూ జీఓ నెం.344ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఊరుదాటి వెళ్లకూడదంటూ ఆదేశించింది. డీడీకీ అదనపు బాధ్యతలు రీజనల్ విజిలెన్స్ స్కాడ్ ఇన్చార్జ్ బాధ్యతలను విజయనగరం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.పూర్ణచంద్రరావుకు అప్పగించింది. గనుల శాఖ అధికారులు కొందరు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత నెల 20వ తేదీన ‘అక్రమార్కులకు అండ’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఆ కథనంపై వెంటనే స్పందించిన గనులశాఖ మంత్రి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా పేషీ అధికారులను ఆదేశించారు. వారు అన్ని వివరాలను సేకరించి చౌదరి, మరికొందరు అధికారుల చిట్టాలను సేకరించి మంత్రికి అందజేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కొందరు వ్యక్తులు, కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక పరి్మట్లను చౌదరి ఇచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. మరికొందరు అవినీతి అధికారులపైనా చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. -
కే౦ద్ర సమాచార శాఖ అదనపు డీజీగా వెంకటేశ్వర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర సమాచార శాఖ(తెలంగాణ) అదనపు డైరక్టర్ జనరల్‌గా ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్ డిప్యుటేషన్ మీద హైదరాబాద్‌కు వచ్చారు. రిజిస్టార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా(హైదరాబాద్) కార్యాలయంలో అదనపు ప్రెస్ రిజిస్టార్‌గా వ్యవహరించనున్నారు. అంతేగాక సమాచార, మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరోకు అధిపతిగా వ్యవహరిస్తారు. 1989 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన ఎస్. వెంకటేశ్వర్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 30 సంవత్సరాల సర్వీస్ కాలంలో పత్రికా సమాచార కార్యాలయం, బెంగుళూరు అదనపు డైరక్టర్ జనరల్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కార్యాలయం, భువనేశ్వర్ డైరక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. -
డైరెక్షన్ మార్చారు
అనుపమా పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారారు. ఇదేదో కొత్త సినిమాలో పాత్ర అనుకోకండి. నిజంగానే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొత్త జాబ్‌లోకి మారారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ విషయం గురించి అనుపమ చెబుతూ– ‘‘ఇది సరికొత్త ప్రారంభం. షంజూ జేబా అనే ట్యాలెంటెడ్ దర్శకుడికి అసిస్టెంట్‌గా చేయడం సంతోషంగా ఉంది. ఈ కొత్త రోల్ పట్ల చాలా ఎగై్జటెడ్‌గా, ఆనందంగా, నెర్వస్‌గా ఉన్నాను. ఈ టీమ్ పట్ల పూర్తి నమ్మకంగా ఉన్నాను. మా సినిమాకు మీ అందరి బ్లెసింగ్స్ కావాలి’’ అన్నారు. మరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ బ్యూటీ పూర్తి స్థాయి దర్శకురాలిగా కొనసాగుతారా? లేదా? వేచి చూడాలి. ప్రస్తుతం బెల్లం కొండ సాయిశ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమాలో నటిస్తున్నారు అనుపమ. -
వైఎస్సార్ అనే దేవుడు మా బాధ విన్నాడు
‘‘మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే వైఎస్సార్గారివి మూడు ఫోటోలు ఉంటాయి. పదేళ్ల క్రితం ఆగిపోవాల్సిన మా అమ్మ గుండె ఇప్పటికీ వినబడుతుందంటే దానికి కారణం వైయస్సార్‌గారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రవికుమార్. శుక్రవారం ‘యాత్ర’ ప్రీ–రిలీజ్ వేడుకలో మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు మాట్లాడారు. వారిలో ‘యాత్ర’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన రవికుమార్ తన మనోభావాలను పంచుకున్నారిలా. 2008లో నేను డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి తీసుకెళితే హార్ట్‌లో హోల్ ఉందని, ఆరు నెలల కంటే బతకదని చెప్పారు. మా అమ్మ దండం పెట్టి ‘అరే, నాకు బతకాలని ఉందిరా. ఏమైనా చేసి ఓ మూడు లక్షలు అప్పు చేసి నాకు ఆపరేషన్ చేయించు’ అన్న మాటలు నాకింకా గుర్తు. అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదనిపించి చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. ఓ హోటల్లో ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు కడుగుతూ పనిచేశాను. నాలుగు నెలలు కష్టపడి పనిచేస్తే నేను సంపాదించింది 20 వేలు. అవి మా అమ్మ మందులకు, బస్సు చార్జీలకు కరిగిపోయాయి. మా అమ్మకు రోజులు దగ్గర పడ్డాయని తెలిసి నన్ను పిలిచి చెల్లిని బాగా చూసుకోమని చెప్పింది. చర్చి, గుడి, మసీదు ఏ దేవుడినీ వదలకుండా దండం పెట్టుకునేది. ఏ దేవుడూ ఆమె ఏడుపు వినలేదు. కానీ, వైఎస్సార్ అనే దేవుడు ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. కామినేని హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా అమ్మకు వైద్యం చేశారు. వైద్యం కోసం ఎవరినైనా అప్పు అడిగితే షూరిటీగా ఏం పెడతారు? అని అడిగేవారు. మాకు ఉన్నదల్లా రెండు గదుల ఇందిరమ్మ ఇల్లు మాత్రమే. అది కూడా ఆ దేవుడి (వైఎస్సార్) దయే. ఈ ఫంక్షన్‌కు మా అమ్మను తీసుకొచ్చేవాణ్ని. కానీ తీసుకురాలేదు. కారణం మా అమ్మకి నేను ఇప్పటికీ ఏం పని చేస్తున్నానో తెలియదు. నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నానని మా అమ్మకి చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు. ఎందుకంటే సినిమాలంటే ఒప్పుకోరని. కానీ అమ్మా... ఇప్పుడు చెబుతున్నాను, ఫిబ్రవరి 8న విడుదలయ్యే ‘యాత్ర’ సినిమాను మా అమ్మ, చెల్లెలితో మా ఊరు డిచ్‌పల్లిలో చూస్తాను. నేనీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి వైఎస్సార్‌గారి రుణం కొంచెమన్నా తీర్చుకున్నాను అనుకుంటున్నాను. నాకీ చాన్స్ ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ గారికి నిర్మాతలు విజయ్ చిల్లా గారికి, శశి దేవిరెడ్డి, శివ గార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని రవికుమార్ ఎమోషనల్ కావడం వీక్షకులను కదిలించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ మాట్లాడినప్పుడు రవికుమార్ మరిన్ని విశేషాలు పంచుకున్నారు. ► ‘యాత్ర’ మీ మొదటి సినిమానా? దర్శకుడు మహీ వి. రాఘవ్గారు తీసిన ‘పాఠశాల’ నా మొదటి సినిమా. ఆ సినిమాకు ఆఫీస్‌బాయ్‌గా పనిచేశాను. నేను కాఫీ షాప్‌లో చేసే రోజుల్లో మహీ అక్కడికి వస్తుండేవారు. అలా ఆయన సినిమాలతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏర్పడింది. మహీగారు చేసిన ‘ఆనందోబ్రహ్మ’కు రైటర్‌గా, ‘యాత్ర’కు రచనా సహకారం అందించాను. ► వైయస్సార్‌గారికి మొదటినుంచే అభిమానిగా ఉండేవారా? మొదట్లో రాజశేఖర్ రెడ్డిగారంటే రాజకీయనాయకులు, మన ముఖ్యమంత్రి అని తెలుసు. కానీ మా అమ్మకు తిరిగి ప్రాణం పోశాక ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ► మొన్న జరిగిన వేడుకలో మాట్లాడాలని ముందే అనుకున్నారా? లేదు. పది నిమిషాల ముందు చెప్పారు. టైముంది. నువ్వు కూడా లబ్ధి పొందావు కదా. నీకు అనిపించింది మాట్లాడితే మాట్లాడు అన్నారు. సడెన్‌గా దర్శకులు స్టేజ్ మీద మాట్లాడమంటే ఎమోషనల్ అయిపోయాను. ► ఇలా వైయస్‌గారి బయోపిక్ ఐడియా ఉందని మహీ మీతో చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మహీసార్, నేను, రాజశేఖర్ అని ఓౖ రెటర్. మేం ముగ్గురం ట్రావెల్ అవుతుంటాం. ఫస్ట్ మాతోనే చెప్పారు. చాలా ఎగై్జట్ అయ్యాను. రైతు ఆత్మహత్య చేసుకునే సీన్ ఒకటి, నారాయణరెడ్డిగారు ఎప్పుడొచ్చినా వైయస్‌గారు ఆయనకు సీట్ ఇచ్చి కూర్చోమనేవారట. అలాగే హై కమాండ్ ఏదో విషయం మాట్లాడటానికి వైయస్గారిని ఒక్కరే రావాలని చెప్పారట. నాతో కేవీపి కూడా వస్తారని సమాధానం పంపారట. దానికి వాళ్లు ‘సీటు కావాలంటే ఒక్కరే రావాలి’ అని చెప్పారట. ‘పదవులు చాలా చూస్తాం. నాతో ఉండే మనుషులే ఎక్కువ’ అనుకునేవారట. ఇలా కొన్ని సీన్స్ చెప్పడంతో మేం ముందుకు వెళ్లాం. ► మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. చలికాలం అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొన్న ఫంక్షన్లో నేను మాట్లాడినది విని, ఫోన్ చేసి ఏడ్చారు. ‘యాత్ర’ సినిమాకి పని చేశానన్న ఆనందం అది. -
బ్లాకుబస్టర్ బ్లాకుబస్టరే...
థాయ్‌లాండ్ గుహ గాథను హాలీవుడ్లో సినిమాగా తీయబోతున్నారనే వార్త చదివిన అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందానికి మనసు మనసులో లేదు.‘ఇది యూనివర్స్ సబ్జెక్ట్. దీన్ని తెలుగులో తీస్తే అదిరిపోతుంది’ అనుకొని నిర్మాత వేటలో పడ్డాడు. ఆ వేటలో అతనికి బక్ర భానుమూర్తి అనే నిర్మాత దొరికాడు.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లు సంపాదించాడు ఈ బక్ర. సినిమా తీయాలనేది తన చిరకాల వాంఛ. మంచి కథ కోసం వెదుకుతున్న సమయంలో బక్రకు తగులుకున్నాడు గోవిందం.‘సార్....ఎంత కాలమని తొక్కలో లవ్‌స్టోరీలు, ఫ్యాక్షన్ కథలు తీస్తాం. ఒక్క సినిమా తీసినా అది చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. ఇది అలాంటి సబ్జెక్టే సార్. మీకు తెలుసుకదా...థాయ్‌లాండ్ గుహలో పిల్లల నరకయాతన గురించి. దీని మీద ఇప్పటికే హాలీవుడ్లో రెండు మూడు సినిమాలు తయారవుతున్నాయి. మన తెలుగులో కూడా తీస్తే బాగుంటుందని పకడ్భందీగా స్క్రిప్ట్ తయారుచేసుకున్నాను’’ కళ్లలో స్టార్లు మెరుస్తుండగా అన్నాడు గోవిందం. ‘‘అక్కడెక్కడో జరిగినదానికి మనోళ్లు ఎలా కనెక్టవుతారోయ్?’’ సందేహం వ్యక్తం చేశాడు బక్ర.‘‘సెంటిమెంట్, భారీ ఎమోషన్, ట్రాజెడి కథలకు అక్కడ ఇక్కడ అనే తేడా ఉండదు సార్. అందరం ఒకేరకంగా కనెక్టవుతాం. పిల్లలు గుహలో చిక్కుకుపోయిన క్షణం నుంచి బయటికి తీసుకొచ్చే వరకు...దేశాలు,ప్రాంతాలు అనే తేడా లేకుండా అందరూ న్యూస్ ఫాలో అయ్యారు. అక్కడెక్కడో జరిగింది కదా అని చదవకుండా ఊరుకోలేదు కదా సార్’’ పాయింట్ లేవదీశాడు గోవిందం.‘‘పిల్లల మీద సినిమా తీయడమే ఒక రిస్క్....అందులోనూ ట్రాజెడి వర్కవుట్ అవుతుందంటావా?’’ సందేహించాడు బక్ర.‘‘హండ్రెడ్ పర్సంట్ వర్కవుట్ అవుతుంది సార్. ఉదాహరణకు 1972లో వచ్చిన పాపం పసివాడు సినిమానే తీసుకుందాం. ‘లాస్ట్ ఇన్ ది డిజర్ట్’ అనే ఆఫ్రికన్ సినిమా ఆధారంగా తీసిన ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మీకు తెలియని విషయం కాదు. కేవలం ఒక్క పిల్లాడి కష్టాలకే ఆ సినిమా అంత విజయం సాధిస్తే.... ఏకంగా పన్నెండు మంది పిల్లల కష్టాలకు మన సినిమా ఎంత హిట్ అవుతుందో ఊహించుకోండి’’ ఊరించాడు గోవిందం. ‘నిజమే’ అనిపించింది బక్రకు.‘‘అది సరే...బడ్జెట్ సంగతి? హాలీవుడ్డోళ్లతో మనమెక్కడ పోటీ పడతామయ్యా?’’ అడిగాడు బక్ర.‘‘ కేవలం యాభై లక్షల్లో మీకు సినిమా తీసి పెడతాను సార్. సినిమా విడుదలకు ముందే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. లాభాలు కండ్ల చూడవచ్చు’’ మరింతగా ఊరించాడు గోవిందం.‘‘యాభై లక్షల్లో సినిమా ఫినిష్ చేస్తావా!! అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బక్ర.‘‘పన్నెండు మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లను తీసుకుందాం...వాళ్లకు రెమ్యునరేషన్లు అంటూ పెద్దగా ఏమీ ఉండవు. ఒక పెద్ద గుహ సెట్ వేస్తాం. సినిమా అంతా ఈ సెట్లోనే లాగించేస్తాం. కాబట్టి మన బడ్జెట్లోసినిమా ఈజీగా పూర్తవుతుంది’’ వివరించాడు గోవిందం.‘ఓకే...రేపు ఒక్కసారి వచ్చి కలువు. ప్రాజెక్ట్ ఫైనల్ చేద్దాం’’ అన్నాడు బక్ర. ఆనందంతో తబ్బిబ్బైపోయాడు గోవిందం. ‘‘ఇదిగో గోవిందం.... ఈడు నా బామ్మర్ది బాలరాజు. నేను ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఈడ్ని సలహా అడుగుతా. ఈడు ఓకే అంటే నాకు కూడా ఓకే...ఒక్కసారి మావోడికి సీన్లు చెప్పు...’’ అడిగాడు బక్ర. మూడుగంటలు నాన్‌స్టాప్‌గా చెప్పాడు గోవిందం.‘‘పోరగాళ్ల కష్టాలు తప్పా....కథలో మసాల ఎక్కడుందయ్యా...ఐటం సాంగు, ఫైట్లు లేంది ఎవరు చూస్తారు?’’ పెదవి విరిచాడు బామ్మర్ది బాలరాజు.‘‘ఇప్పుడేం చేయమంటారు?’’ ఆందోళనగా అడిగాడు గోవిందం.‘‘కథకు మసాల దట్టించి మళ్లీ వినిపించు...అప్పుడు ఆలోచిస్తా’’ ఆర్డర్ వేశాడు బాలరాజు.‘కుదరదు’ అంటే రాకరాక వచ్చిన చాన్స్ మిస్సవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి పదిసంవత్సరాలవుతుంది. ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయితే ఊళ్లోకి వెళ్లి బర్రెలు కాసుకోవడం తప్ప...వేరే గత్యంతరం లేదని ఆలోచించిన గోవిందం ‘అలాగే సార్... మీరు చెప్పినట్లే స్క్రిప్ట్ తయారుచేసి మళ్లీ కలుస్తాను’ అంటూ వెళ్లాడు.వారం తరువాత బామ్మర్ది బాలరాజును కలిశాడు గోవిందం. తాను తయారుచేసుకున్న స్టోరీ ఆర్డర్, ఇతర విషయాల గురించి ఇలా చెప్పాడు. 1. పన్నెండుమంది పిల్లలు, ఫుట్‌బాల్ కోచ్ ఒక పెద్ద గుహలో చిక్కుకుపోతారు. 2. కోచ్‌గా కాస్త పేరున్న హీరోను సెలెక్ట్ చేసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తాం. ఎలా అంటే...గుహలో ఆల్రెడీ ఒక స్మగ్లింగ్ గ్రూప్ చిక్కుకుపోయి ఉంటుంది. వాళ్లకీ మన హీరోకి మధ్య రోమాలు నిక్కబొడిచే ఫైట్లు పెడతాం. దీంతో మాస్ ప్రేక్షకుల నుంచి విజిల్సే విజిల్స్. 3. స్మగ్లర్ల దాడిలో హీరో స్పృహ కోల్పోయి ఆ తరువాత ఏకంగా కోమాలోకి వెళ్లిపోతాడు. ఇది చూసి తట్టుకోలేని చిన్నారులు చిరుతలై స్మగ్మర్ల పని పడతారు. ఈ దెబ్బలకు వాళ్లు స్పృహ కోల్పోయి ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోతారు. కోమాలోకి వెళ్లిన తమ ఫుట్‌బాల్ కోచ్‌కు స్పృహ తెప్పించడానికి ‘జై చిరంజీవా జగదేక వీరా.... అసహాయ శూరా.... అంజనీ కుమారా’ అనే పాట అందుకుంటారు పిల్లలు. మళ్లీ విజిల్సే విజిల్స్. 4. ఆకలిదప్పులతో పిల్లలు అల్లాడుతుంటారు. ఈ విషాదంలో బ్యాక్‌గ్రౌండ్ నుంచి పాట వినిపిస్తుంది: ‘అయ్యో! పసివాడా....గాడ్ ఉన్నాడా?.... మీపై ద్వేషం పూనాడా...అభమూ శుభమూ తెలియని మిమ్మల్ని అనాథలను చేశాడా...పగబట్టిన విధి మిమ్మల్ని.... పసిగట్టి కాటేసిందా’ ఈ పాట వింటూ ఏడ్వని ప్రేక్షకుడు ఉండడు. 5. క్లైమాక్స్:పద్దెనిమిదో రోజు హీరో స్పృహలోకి వస్తాడు. లేవడం లేవడంతోనే ‘ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా?’ అని దేవుడిని నిలదీస్తూ పాట అందుకుంటాడు. ఏమవుతుందో ఏమో అని ప్రేక్షకుల్లో ఒకటే టెన్షన్. కొద్దిసేపటి తరువాత ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం. గుహలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుంటుంది. ఆ తరువాత పెద్ద శబ్దంతో గుహ ముక్కలు చెక్కలవుతుంది. వర్షం ఆగుతుంది. ఆకాశంలో నుంచి ఒక పూలరథం కిందికి వచ్చి పిల్లలను, కోచ్‌ని తీసుకొనిపైకి లేస్తుంది. ఆతరువాత అది థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ల్యాండవుతుంది. శుభం కార్డు పడుతుంది. సంతోషంతో ప్రేక్షకులు చప్పట్లే చప్పట్లు...ఈలలే ఈలలు! రిపీట్ ఆడియెన్స్...రికార్డులు బద్దలు’...చెప్పడం ముగించాడు గోవిందం.‘వెర్రీగుడ్. అద్భుతంగా ఉందయ్యా. తెలుగు సినిమాకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్ కవరయ్యాయి. మన సినిమా ఆ హాలీవుడ్ సినిమాలను మించి ఆడుతుంది’’ అంటూ ఆనందంగా సిగరెట్ వెలిగించాడు బామ్మర్ది బాలరాజు. – యాకుబ్ పాషా -
సినిమాలపై ఆసక్తితోనే దర్శకుడినయ్యా..
♦ కమర్షియల్ దర్శకుడిగా రాణించాలనుంది ♦ వర్ధమాన దర్శకుడు వైకుంఠలవ్య రాయవరం (మండపేట) : సినిమాలపై ఉన్న ఆసక్తితోనే డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్‌కు చేరుకున్నా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రెండు భాషల్లో మూడు సినిమాలకు దర్శకత్వం వహించాను. కమర్షియల్ దర్శకుడిగా రాణించడమే తన ధ్యేయమంటున్నారు శ్రీకాకుళంకు చెందిన వైకుంఠలవ్య. ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న సినిమాకు లొకేషన్స్ చూసేందుకు రాయవరం మండలం పసలపూడి వచ్చిన సందర్భంగా తను దర్శకుడిగా మారిన వైనాన్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాతపట్నం నుంచి వచ్చా.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన నేను డిగ్రీ వరకు అక్కడే చదివాను. సినిమాలపై ఉన్న ఆసక్తితో 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కు వెళ్లాను. కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేశాను. నిన్నేపెళ్లాడుతా, ప్రియరాగాలు, నిధి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించి దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. ధృవతారలు, కలిసిన మనసులు తదితర ఎనిమిది టీవీ సీరియల్స్‌కు దర్శకునిగా పని చేశాను. మూడు చిత్రాలకు... బాలాదిత్య హీరోగా తొలిసారి ‘జాజిమల్లి’ సినిమాకు దర్శకత్వం వహించాను. అలాగే కన్నడంలో ‘మొండ’ సినిమాతో పాటు తెలుగులో మూడో చిత్రంగా నందు, సిద్ద, శ్రీరాజ్ హీరోలుగా ‘3ఇడియట్స్’ సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ సినిమాలో సుమన్, చంద్రమోహన్, కాశీవిశ్వనా«థ్ తదితరులు నటించారు. ఈ సినిమా తొలికాపీ వచ్చింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. పరువు హత్యల నేపథ్యంలో.. పరువు హత్యల నేపథ్యంలో కోనసీమ బ్యాక్‌గ్రౌండ్‌లో కొత్త సినిమా రూపొందిస్తున్నాం. మాధవ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా పూర్తిగా నూతన నటీనటులతో జిల్లాలోనే పూర్తిగా చిత్రీకరిస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 2,3 తేదీల్లో ప్రారంభిస్తాం. ఈ సినిమాకు నవనీత్చంద్ర మ్యూజిక్ డైరెక్టరుగా, సురేష్ గంగుల కెమెరామెన్‌గా, నిర్మాతగా సామర్లకోటకు చెందిన శ్రీనివాస్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. -
అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమలో అగ్రనటి!
ప్రియాంక చోప్రా కజిన్ సోదరిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన పరిణీత చోప్రా అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న పరిణీత చోప్రా గురించి బాలీవుడ్లో వదంతులకు లోటు లేదు. ఆమె గతంలో దర్శకుడు మనీష్ శర్మతో డేటింగ్ చేసినట్టు రూమర్స్ గుప్పుమన్నాయి. మనీష్ శర్మ తెరకెక్కించిన లేడిస్ వర్సెస్ రికీ బల్, శుద్ధ దేశీ రొమాన్స్ సినిమాల్లో పరిణీత తళుక్కమంది. ఆ తర్వాత మనీశ్‌తో బ్రేకప్ అయిందని, ఆ డిప్రెషన్లో బరువు పెరిగిందని, కానీ, మళ్లీ తనకు తానే స్ఫూర్తి తెచ్చుకొని.. ఫిట్‌గా, స్లిమ్‌గా తయారైందని ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. ఇప్పుడా కథనాలు పక్కనపెడితే ‘ఫిలింఫేర్’ మ్యాగజీన్ తాజాగా ప్రచురించిన ఓ రూమర్ మాత్రం హల్చల్ చేస్తోంది. అదేమిటంటే పరిణీత చోప్రా మళ్లీ ప్రేమలో పడిందట. ఈసారి ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఆమె ప్రేమలో మునిగిపోయిందని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ప్రస్తుతం ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఈ అమ్మడు రహస్యంగా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నదని, తమ రిలేషన్షిప్ గురించి ఇప్పుడే మీడియాకు తెలియకుండా వివరాలు గోప్యంగా ఉంచుతున్నదని ఆ మ్యాగజీన్ చెప్పుకొచ్చింది. ఈ రూమర్స్ సంగతి ఎలా ఉన్నా.. పరిణీతి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా సరసన ‘మేరి ప్యారీ బిందు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తొలిసారి గొంతు సవరించుకొని పాట కూడా పాడింది. అంతేకాకుండా రోహిత్ శెట్టీ ‘గోల్మాల్’ సిరీస్‌లోనూ అజయ్ దేవ్‌గణ్ సరసన నటిస్తోంది. -
డామిట్... కథ అడ్డం తిరిగింది!
►సినిమాల్లో నష్టంతో డ్రగ్స్ అమ్మే స్థాయికి దిగజారి... ►కటకటాల పాలైన వర్ధమాన నిర్మాత, అసిస్టెంట్ డెరైక్టర్ సాక్షి, హైదరాబాద్: సినీ పరిశ్రమలో స్థిరపడదామని కలలు కన్న ఓ వ్యక్తి నష్టాలపాలై చివరకు మాదక ద్రవ్యాలు అమ్మే స్థాయికి దిగజారాడు. దానికి అప్పుల్లో మునిగిన మరో అసిస్టెంట్ డెరైక్టర్ సహకరించాడు. సీన్ కట్ చేస్తే... కల చెదిరి ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. వీరిని బాలానగర్ ఎస్ఓటీ, జీడిమెట్ల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూ.3కోట్లు విలువ చేసే 1.3 కిలోల ఆంఫిటమైన్, కొకైన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఏసీపీ నర్సింహారెడ్డి తదితరులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సినిమా పిచ్చితో దారి తప్పి... డిగ్రీ వరకు చదివిన నెల్లూరు జిల్లాకు చెందిన కె.వెంకటసురేశ్బాబు ఆ తర్వాత వజ్రాల వ్యాపారం చేసి బాగానే డబ్బులు సంపాదించాడు. సినిమాలపై మక్కువతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ తెలుగు సినిమా మొదలెట్టాడు. దానిపై రూ.60 లక్షల వరకు ఖర్చు చేసినా, ఇంకా బడ్జెట్ అవసరముండటంతో అది మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికే రాంగోపాల్‌వర్మ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కిశోర్‌తో పరిచయం ఏర్పడింది. కిశోర్... చాలా మంది వద్ద అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సురేశ్‌కు... నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కేఫ్ యజమాని మారం శ్రీహరిరెడ్డితో పరిచయమైంది. తన ఇబ్బందులను శ్రీహరిరెడ్డికి చెప్పాడు. డ్రగ్స్ అమ్మితే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని శ్రీహరి సలహా ఇచ్చి... 1.3 కిలోల ఆంఫిటమైన్, కొకైన్‌ను సురేశ్‌కు అందించాడు. విషయాన్ని కిశోర్‌కు కూడా చెప్పాడు. ఇద్దరూ కలసి దుండిగల్‌లోని ఓ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ ప్యాకెట్లు అమ్మేందుకు బైక్‌పై వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు కుత్బుల్లాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా వీరిని పట్టుకున్నారు. నిందితులను రిమాండ్‌కి తరలించారు. సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్యా ఇచ్చిన సమాచారం ఆధారంగా నెల్లూరు పోలీసులు మరో నిందితుడు శ్రీహరిరెడ్డిని నెల్లూరులో అరెస్టు చేశారు. అతడి నుంచి 1.5 కిలోల ఆంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు
-
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు
సినిమా రంగానికి, డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక సినీనిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. కొకైన్ గ్రాము 5-10 వేల వరకు అమ్ముడవుతుంది. కాగా, నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి, అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ. 6 కోట్లని అంచనా వేశారు. సైబరాబాద్ పరిధిలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు. ఇంతకుముందు ఒక శాస్త్రవేత్తను అరెస్టుచేసి, అతడి వద్ద వందల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన వెంకట సురేష్ అనే వ్యక్తి, యూసుఫ్‌గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి విద్యార్థులకు డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నించారు. ఇతడు ఇంతకుముందు రాంగోపాల్ వర్మ సినిమాలో పని చేసినట్లు తెలిసింది. -
జూనియర్ ఆర్టిస్టుపై కత్తితో దాడి
నార్సింగి: జూనియర్ ఆర్టిస్టుపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పారిపోయిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన సదానందరెడ్డి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేందుకు నగరానికి వచ్చాడు. పుప్పాల గూడ లాలమ్మ గార్డెన్ ప్రాంతంలోని లుబినీ వనం ఆర్గనైజింగ్ సంస్థ కార్యాలయంలో ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం సదానందం వద్దకు వచ్చిన అతడి స్నేహితుడు రవికుమార్ అతడితో మాట్లాడుతూనే కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
చెన్నై : హోటల్ గదిలో రూ.13 లక్షల విలువైన వజ్రాల నగలు, మూడు సెల్ఫోన్లు చోరీ చేసిన సినిమా అసిస్టెంట్ డెరైక్టర్‌ను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన అత్తీవ్వరన్ (39) పారిశ్రామికవేత్త. ఇతడు భార్యతో గత 14వ తేదీ ఉదయం చెన్నై వడపళనికి వచ్చి ప్రైవేటు హోటల్లో బస చేశాడు. భార్యతో షాపింగ్ వెళ్లి రాత్రి 12.30 గంటలకు హోటల్ గదికి వచ్చాడు. గదిలో అత్తీవ్వరన్, అతని భార్య ధరించిన వజ్రాల నెక్లస్, ఉంగరాలు, గడియారం, ఐఫోన్, రెండు విలువైన సెల్ఫోన్లు టేబుల్‌పై పెట్టి నిద్రపోయారు. ఉదయాన్నే నగలు చోరీకి గురైనట్లు తెలిసింది. దీనిపై విరుగంబాక్కం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసులో సంబంధించిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని నగర కమిషనర్ టి.కె.రాజేంద్రన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం పోలీసులు హోటల్ ఉన్న సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా అనుమానాస్పదరీతిలో సంచరిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మణికంఠన్ (24) అని వడపళనికి చెందిన ఇతడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాల్లో పని చేశాడని తెలిసింది. అదే హోటల్లో గది తీసుకున్న మణికంఠన్ అత్తీశ్వరన్ గది తలుపులు తెరచి ఉన్న సమయంలో వజ్రాల నగలను చోరీ చేసినట్లు తెలిసింది. మణికంఠన్‌ను అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచి జైలుకు తరలించారు. -
అకారణంగానే చెంప చెళ్లుమనిపించిందా?
చెన్నై: 'తుపాకి' నటి మీనాక్షి.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించడం వివాదం రేపింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్ర సహాయ దర్శకుడిపై మీనాక్షి చేయిచేసుకుంది. చెన్నై పాత మహాబలిపురం రోడ్డులోని ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారట. సదరు సహాయ దర్శకుడికి మద్దతుగా యూనిట్ సభ్యులు, ఇతర టెక్నీషియన్లు ఆందోళనకు దిగారు. అకారణంగా,. అన్యాయంగా ఆమె కొట్టిందంటూ వారంతా మండిపడ్డారు. సహాయ దర్శకుడికి క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఆమెను షూటింగ్ స్పాట్ నుంచి కదలనివ్వబోమని పట్టుబట్టారు. దీంతో మీనాక్షి.. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కు క్షమాపణలు చెబుతూ, లేఖ రాసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని, బుద్ధిగా ఉంటానని మీనాక్షి చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తుపాకి' చిత్రంలో హీరోయిన్ కాజల్ స్నేహితురాలి పాత్రలో నటించిన మీనాక్షి.. ప్రస్తుతం నేర్ముగమ్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. అయితే ఇద్దరి మధ్య బయటకు చెప్పుకోలేని గొడవ ఏదైనా జరిగిందా? అసలు ఏం జరిగిందనేది ఎవరికీ అంతుబట్టక మల్లగుల్లాలు పడుతున్నారట. మీనాక్షి ఎందుకు అలా ప్రవర్తించిందనే విషయం ఎటూ తేలక సినీజనం ఆరా తీస్తున్నారు. -
సర్వే టెస్ట్‌కు మంగళం.. సెలవు రోజు ఇంటర్వ్యూ
ఏలూరు (టూ టౌన్) :సర్వేయర్ లెసైన్స్‌లు జారీ చేసేందుకు జిల్లా సర్వే, భూమి రికార్డుల విభాగం అధికారులు భారీగా సొమ్ములు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అభ్యర్థులకు సర్వే అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించకపోవడంతోపాటు సెలవు రోజున ఇంట ర్వ్యూలు నిర్వహించడం ఇందుకు ఊతమిస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన 22 మంది హైదరాబాద్‌లోని సర్వే ట్రైనింగ్ అకాడమీలో 6 వారాల పాటు శిక్షణ పొందారు. వీరికి సర్వే, భూ రికార్డుల విభాగం డెప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ ఆధ్వర్యంలో అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లెసైన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. అలా లెసైన్స్ పొందిన వారు ప్రైవేటు సర్వేయర్లుగా భూముల్ని సర్వే చేయడానికి అర్హత పొందుతారు. అయితే, శిక్షణ పొందిన 22 మంది అభ్యర్థులను శుక్రవారం ఏలూరులోని సర్వే, భూమి రికార్డుల కార్యాలయానికి పిలిపించారు. వారికి అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించకుండా.. కేవలం ఇంటర్వ్యూలతో సరిపెట్టారు. అదికూడా 40 నిమిషాల్లో పూర్తిచేశారు. సర్వేయర్ లెసైన్స్ కావాలంటే కొంత సొమ్ము ముట్టజెప్పాలని అభ్యర్థులపై అధికారులు ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులైన సదరు అభ్యర్థులంతా సర్వేయర్ లెసైన్స్ వస్తే తమకు పని దొరుకుతుందన్న ఉద్దేశంతో సొమ్ములిచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా, గురువారం నాడు అసెస్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉం డగా, ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై దాడి ఘటనపై విచారణ జరిపేందుకు వచ్చిన కమిటీ వెంట వెళ్లాల్సి వచ్చిందన్నారు. అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సెలవు రోజైనా విధులకు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించామని చెప్పారు. ఈ విషయంలో అనుమానాలకు తావు లేదన్నారు. ఆలస్యం అవుతుందనే.. సర్వే ట్రైనింగ్ పూర్తయిన అభ్యర్థులకు ఎప్పుటికప్పుడు లెసైన్సులు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. గురువా రం ఇంటర్వ్యూలు నిర్వహించాలను కున్నాం. వీలు కాలేదు. అందుకే సెలవు రోజున ఇంటర్వ్యూలు చేశాం. - పీవీ సత్యనారాయణ, అసిస్టెంట్ డెరైక్టర్, సర్వే విభాగం వసూళ్లకు పాల్పడితే చర్యలు సర్వే లెసైన్సుల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెలవు రోజైనా ఇంటర్వ్యూ నిర్వహించాం. అభ్యర్థులంతా సర్వే అకాడమీలో శిక్షణ పొందిన దృష్ట్యా అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించలేదు. - సీహెచ్‌వీ సుబ్బారావు, డెప్యూటీ డెరైక్టర్, సర్వే విభాగం -
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ డైరెక్టర్
-
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ డైరెక్టర్
మెదక్(జహీరాబాద్): జహీరాబాద్ మండలంలోని పశుసంవర్ధకశాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. ఇటీవల ఇదే శాఖలో పనిచేస్తూ రిటైరైన మహేశ్వరరావు పింఛన్ పేపర్లను హైదరాబాద్‌లోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసుకు పంపించేందుకు ఆయనను రూ.3 వేలు డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా దొరికిపోయిన ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొఫైల్ పిక్చర్...
మెట్రో కథలు మీరు నాకు పని ఇవ్వాలి. చేస్తాను. చూశాడు. అలా చూడొద్దు. పని ఇవ్వండి. చేస్తాను. ప్యాంట్ వేసుకుని ఉంది. కొత్తదని తెలిసిపోతూ ఉంది. ఫుల్‌షర్ట్ వేసి చేతులు మాటిమాటికి పైకి నెడుతూ ఉంది. ఒదులొదులు శరీరం. బట్టలు బిగుతుగా ఉండటం వల్ల చూడటానికి కొంచెం అసౌకర్యంగా ఉంది. సినిమా ఫీల్డంటే చీరలు సారెలు ఇబ్బంది అని చెప్పారు. కొత్తవి. మొన్నే కొన్నాను. కాళ్ల వైపు చూశాడు. షూస్ కూడా కొత్తవే. స్పోర్ట్స్ షూస్. మూడు గంటలకు ఒక ఆడిషన్ ఉంది. ముంబై నుంచి ఆర్టిస్ట్ రావాలి. శంషాబాద్‌లో ల్యాండయ్యి రింగ్రోడ్డున పడింది అని ఫోన్. కాని నాలుగయ్యేలా ఉంది. ఈలోపు ఈమె దూరింది. గంట నుంచి అసిస్టెంట్ డెరైక్టర్ని నస పెడుతోందట. వదిలేశాడు. సినిమాల గురించి మీకేం తెలుసు? మీరు నవ్వుతున్నారు. లేదు.. లేదు.. చెప్పండి.పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని. చాలా తెలుగు సినిమాలు చూశాను. నరసింహరావుగారు రాసిన డెరైక్టర్ కావడం ఎలా అనే పుస్తకం చదివాను. అంతే. మీరు నవ్వుతున్నారు. వయసు నలభై లోపు ఉండే అవకాశం లేదు. యాభై కూడా దాటకపోవచ్చు. ఈ వయసు వాళ్లు ఇలా వచ్చి అడగడం మొదటిసారి. ఏం చేస్తుంటారు? మామూలే. హౌస్‌వైఫ్. మావారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వాలెంటరీ తీసుకున్నారు. ఒక ప్రయివేట్ ఫర్మ్వాళ్ళు మంచి ఆఫర్ ఇవ్వడంతో మళ్లీ ఉద్యోగంలో చేరారు. మా అబ్బాయి యూ.ఎస్. వెళ్లి టూ ఇయర్స్. ఇంట్లో అత్తగారు.. నేను... సరే. చూద్దాం. అంటే పని ఇచ్చినట్టేనా? కాల్ చేస్తాను. మావాడితో టచ్‌లో ఉండండి.పోనీ పద్యం పాడనా? ఇస్తారా? పద్యం పాడతారా? నేను కాలేజ్ రోజుల్లో చాలా పాత్రలు వేశాను. ప్రైజ్‌లు కొట్టాను. బెస్ట్ యాక్టర్‌ని.ఆ సంగతి చెప్పలేదూ. నాటకాలు కూడా రాశాను. యూనివర్సిటీలో ఉండగా ఒక నాటకం ఢిల్లీ దాకా వెళ్లిందనుకోండి. అయితే అవన్నీ పాత రోజులు. చూస్తున్నాడు. పెళ్లయ్యింది. ట్రాన్స్ఫర్లతో ఊళ్లు తిరగడమే సరిపోయింది. అన్నీ పోయాయి. కొడుకు ఒక లోకం అనుకున్నా. వాడూ రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. రెండేళ్లుగా కొంచెం గొడవలు. మావారికి తెలియకుండా మూడు లక్షలు అప్పు చేశాను. మూడు లక్షలా? అవును. చీరల కోసం. ఫేస్బుక్లో పెట్టాలిగా... చూస్తున్నాడు. మొదట ఇంట్లో మొక్కల ఫొటోలు... నచ్చిన సినిమాల ఫొటోలు... గుడ్ మార్నింగ్‌లు... గుడ్నైట్లు... వెలిగే కొవ్వొత్తులు... వాటి కింద క్యాప్షన్లు... ఇవి పెట్టేదాన్ని. తర్వాత ఒకరోజు మంచి ఫొటో దిగి ప్రొఫైల్ పిక్చర్ మార్చాను. బాబోయ్. ఎన్ని లైకులు. చాలా కామెంట్లు. ఏదో పెద్ద నేషనల్ అవార్డు వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఒక కుర్రాడు పొయెట్రీ రాశాడు. సాహిత్యం నుంచి కూడా రిఫరెన్స్ ఇచ్చాడు. అలాంటి చీర కట్టుకున్నవాళ్లను ఏదో అంటారట. గుర్తు లేదు. మొత్తం మీద అలా. మొదట తెలియలేదు. కాని చాలా అలవాటైపోయింది. వారానికి ఒకసారి ప్రొఫైల్ పిక్చర్- నాకు గురువారం సెంటిమెంట్- ఆరోజు మార్చేదాన్ని. లైకులూ కామెంట్లూ నా థ్యాంక్యూ వెరీమచ్లూ... వీటితో మళ్లీ గురువారం దాకా గడిచిపోయేది. మళ్లీ ఇంకోటి. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించేది. టీవీ సీరియళ్లలో పడి కొట్టుకోవడంలో ఈ మజా లేదనిపించేది. కొందరు చాటింగ్‌లోకి వచ్చేవారు. ఎలా ఉన్నావ్ అక్కా అని పలకరించేవారు. అర్ధరాత్రి దాకా అదో కాలక్షేపం. కాని చివరకు అక్కను తీసి గట్టున పెట్టేవారు. చెడ్డ పిల్లలు ఉంటారు కదా. వాళ్లను అన్‌ఫ్రెండ్ చేసి మళ్లీ ఇంకొకరితో. ఎంత ఫేమస్ అయ్యానంటే గురువారం వస్తుందంటే చాలు ముందు రోజు నుంచే హడావిడి... మెసేజ్‌లు... వెయిటింగ్ ఫర్ న్యూ ప్రొఫైల్ పిక్చర్ అని ఆకాంక్షలు. అంత డిమాండ్ ఉన్నప్పుడు కట్టిన చీరలే కట్టి కనపడటం బాగోదు కదా. వాటి వెంట పడ్డాను. మావారు హ్యాపీనే. తన్ను వదిలిపెట్టి ఏదో ఒకటి చేసుకుంటున్నాను. ఇంకేం కావాలి? కాని మా అత్తగారే నస పెట్టి మొన్నొక రోజు సెల్ లాక్కుని విసిరి కొడితే ఆమెను తోసేస్తే తుంటి విరిగి... పెద్ద గొడవ... తల దించుకుంది. తర్వాత సిగ్గేసింది. ఏంటిది? అని. ఇదిగో ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకొని మీ దగ్గరకు వచ్చాను. మీ సినిమాలు కొంచెం పద్ధతిగా ఉంటాయి. పని ఇచ్చినట్టేనా?ఇంకా ఫేస్‌బుక్‌లోనే ఉన్నారా? నవ్వింది. భలేవారే. ఎందుకు బయటకు వస్తాను. కాకపోతే ఇక మీదట నా పోస్ట్‌లు మారతాయి. ఫలానా సినిమా షూటింగ్లో క్లాప్‌బోర్డ్ పట్టుకుని నేను... ఫలానా లొకేషన్లో పుస్తకం చదువుకుంటూ నేను... అలా అన్నమాట. ఆగి అంది. పెద్దగా ఆశలు లేవు. కాని కొంచెం పని నేర్చుకుని ఏవైనా షార్ట్ ఫిల్మ్‌లు తీయాలని ఉంది. ఆడవాళ్ల గురించి.. ఆడపిల్లల గురించి.. చదువుకునే వయసులోకొస్తున్న అబ్బాయిల గురించి. ఏదో మార్చేస్తానని కాదు. నేను మారానుగా మొదట. వేళ్లు మాత్రమే పని చేస్తూ మిగిలిన శరీరమంతా పారలైజ్ అయ్యే వ్యవస్థ ఏదో మనల్ని బిగిస్తోంది. దానిని కొంచెం అలెర్ట్ చేయాలనిపిస్తోంది. మావారు ఆల్రెడీ అయ్యారనుకోండి. ఉద్యోగం మానేశారు... ఈసారి నిజంగానే నవ్వాడు.అయితే పని ఇచ్చినట్టేనా? సరే. రండి. మీరు నాకు పే చేయాలి. కొత్తవాళ్లకు డబ్బులివ్వరని విన్నాను. నాకు కావాలి. మూడు లక్షల అప్పు తీర్చేస్తానని మా అత్తగారికి మాట ఇచ్చాను. ఇదొకటా?అవును. సరే సరే పెద్దగా నవ్వుతూనే ఉన్నాడు. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్
చెన్నై: హీరోయిన్ మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది. హిందీ సినిమా 'అజర్' కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్రిటన్ లో నెలరోజుల పాటు జరగనున్న షూటింగ్ లో ఆమె పనిచేయనుంది. 'దర్శకుడు టోనీ డిసౌజాకు మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. టోనీ భార్య ఆమెకు మంచి ఫ్రెండ్ కావడంతో ఈ అవకాశం దక్కింద'ని సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సినిమా రూపకల్పన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిందని వెల్లడించాయి. 'అజర్' పాత్రను ఇమ్రాన్ హష్మి పోషిస్తున్నారు. ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రీ, హ్యుమా ఖరేషీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సరదాగా కాసేపు, కొత్త జంట, షాడో, గ్రీన్ సిగ్నల్, దోచేయ్ తదితర సినిమాల్లో మధురిమ నటించింది. -
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
-
అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
-
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
విజయవాడ : దూరదర్శన్ ఉన్నతోద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ హనుమంతరావు గురువారం లక్షన్నర లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. టెలీ సీరియల్స్ బిల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయటంతో బాధితులు సీబీఐని ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన సీబీఐ...అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం హనుమంతరావును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమలో పడ్డ విజయలక్ష్మి
నటి విజయలక్ష్మి సహాయ దర్శకుడి ప్రేమలో పడ్డారన్నది తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం. చెన్నై-28 చిత్రంలో హీరోయిన్గా చిత్ర రంగ ప్రవేశం చేసిన నటి విజయలక్ష్మి. ఆ తరువాత అంజాదే, కట్రదు కళవు, వనయుద్ధం, వెన్నెలా వీదు తదితర చిత్రాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన సుల్తాన్ ది వారియర్ యానిమేషన్ చిత్రంలో నటించారు. అయితే ఆ చిత్ర నిర్మాణం పూర్తి కాలేదన్నది గమనార్హం.మరో విషయం ఏమిటంటే విజయలక్ష్మి కాదల్‌కోట్టై చిత్రం దర్శకుడు అగస్థ్య కూతురు. ఆమె కిప్పుడు వివాహ గడియలు దగ్గర పడ్డాయని సమాచారం. వల్లినం చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసిన ఫిరోస్ అనే వ్యక్తితో ప్రేమ పడిందని, త్వరలోనే పెళ్లి జరగనుందని సమాచారం. ఫిరోస్ త్వరలో దర్శకుడుగా మెగాఫోన్ పట్టి కృష్ణ హీరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఒక షూటింగ్లో కలిసిన ఫిరోస్, విజయలక్ష్మిల పరిచయం ప్రేమగా మారిందని ఆమె త్వరలో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధంగా ఉందని కోలీవుడ్ వర్గాల టాక్. -
అదే దమ్ము.. అదే ఎనర్జీ!
ఆ రోజు భక్తవత్సలం నాయుడు మనసంతా ఉద్వేగంగా ఉంది. ‘స్వర్గం-నరకం’లో ప్రతినాయకుడి పాత్ర కోసం ఆడిషన్స్ చేసినవాళ్లల్లో అందరికీ సిఫార్సులున్నాయి. కానీ, భక్తవత్సలంకి గాడ్ ఫాదర్ లేరు. ప్రతిభ మీద నమ్మకంతో భక్తవత్సలం నాయుడు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. కానీ, అతని మీద కోపంగా ఉన్న అసిస్టెంట్ డెరైక్టర్ ఎంతో కసిగా ఆ ఫుటేజ్ దాచేశాడు. విధి విచిత్రమైంది. ఆ అసిస్టెంట్ డెరైక్టర్ ఒకటి తలిస్తే, దైవం వేరే తలచింది. ఆడిషన్స్‌లో పాల్గొన్నవారిలో ఎవరి నటనా చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావుకు సంతృప్తి అనిపించలేదు. అప్పుడాయన తన సతీమణి పద్మతో ‘భక్త టెస్ట్ షూట్ చూశావా?’ అనడిగారు. అసిస్టెంట్ డెరైక్టర్ దాచేసిన ఫుటేజ్ అప్పుడు బయటికొచ్చింది. ఆ ఫుటేజ్‌లో భక్తవత్సలం నటన దాసరి పద్మకు బాగా నచ్చింది. ‘కుర్రాడు బాగున్నాడు.. బాగా నటించగల సత్తా ఉంది’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. దాసరి కూడా భక్తవత్సలం ప్రతిభను నమ్మారు. అంతే.. ‘స్వర్గం-నరకం’లో ప్రతినాయకుడి పాత్రకు ఎంపిక చేసేశారు. అలాగే, భక్తవత్సలం నాయుడు పేరుని ‘మోహన్‌బాబు’గా మార్చేశారు. ఇది జరిగి సరిగ్గా 40 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ప్రతినాయకుడిగా, నాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా మోహన్‌బాబు తిరుగు లేదనిపించుకున్నారు. ఆయన సంభాషణలు పలికే తీరును ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. ఏ పాత్ర చేసినా ఒదిగిపోయిన వైనానికి ముచ్చటపడ్డారు. దర్శక, నిర్మాతలందరికీ ‘మోస్ట్ వాంటెడ్ ఆరిస్ట్’ అయిపోయారు. ఇన్నేళ్ల నట జీవితం తర్వాత మోహన్‌బాబులోని నటుడు ఇంకా అదే ‘ఉత్సాహం’తో ఉన్నాడు. వచ్చిన కొత్తల్లో ఉన్న ఎనర్జీ, ఉత్సాహం, ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు ఉదాహరణ - గత ఏడాది విడుదలైన ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రౌడీ’, ‘యమలీల 2’ చిత్రాలు. ‘రౌడీ’లో విగ్గు లేకుండా తన సహజ ధోరణిలో కనిపించడంతో పాటు, అందులో ‘అన్న’ పాత్రను అద్భుతంగా చేశారు మోహన్‌బాబు. సత్తా ఉన్న నటుడికి సరైన పాత్రలు దొరికితే పరకాయ ప్రవేశం చేసేస్తారు. అందుకు ఓ ఉదాహరణ మోహన్‌బాబు. ఇవాళ ఆయన జన్మదినం. గత కొన్నేళ్లుగా తిరుపతిలోని తన శ్రీవిద్యానికేతన్ విద్యాలయంలో విద్యార్థినీ, విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారాయన. ఈ ఏడాది కూడా మోహన్‌బాబు అక్కడే జరుపుకొంటున్నారు. -
గ్రౌండ్ వాటర్ డీడీపై నేడు, రేపు విచారణ
సాక్షి, కాకినాడ :అసిస్టెంట్ డెరైక్టర్లు, కార్యాలయ సిబ్బందిని వేధిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భూగర్భ జల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం డిప్యూటీ డెరైక్టర్ ప్రసాదరావును విచారణాధికారిగా నియమిస్తూ ఆ శాఖ డెరైక్టర్ కె.వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదరావు సోమ, మంగళవారాల్లో జిల్లాలో విచారణ చేపట్టనున్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని ఏడీ కార్యాలయంలోను, మంగళవారం రాజమండ్రిలోను విచారణ జరపనున్నారు. జిల్లాలో ఈ శాఖ పరిధిలో ముగ్గురు ఏడీలు ఉండగా, ఇటీవల ఒకరు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. కాగా కాకినాడ ఏడీ విజయ్‌కుమార్‌ను కార్యాలయంలోకి రానివ్వకుండా తాళాలు వేయడంతోపాటు రాజమండ్రి ఏడీని కాకినాడలో డెప్యూటేషన్‌పై నియమించారు. వీరితోపాటు రాజమండ్రి, కాకినాడ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని వేధిస్తున్నారంటూ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఈ రెండు కార్యాలయాల్లోని పలువురు సిబ్బంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీడీ వెంకటేశ్వరరావుపై ఈ విచారణ జరగనుంది. -
అవినీతి తోటలో.. విరగకాసిన కోట్లు!
కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది?.. ఒక్కసారి ఉద్యానవన శాఖ పరిస్థితిని.. దాని అధికారిని చూస్తే తెలిసిపోతుంది. వనాలను సంరక్షించాల్సిన సదరు అధికారే వాటిని మేసేశారు. అవినీతి తోటలు సాగు చేసి కోట్లకు కోట్ల ఫలాలు పండించుకున్నారు. సొంతింటిని సుసంపన్నం చేసుకున్నారు. చివరికి పాపం పండింది. ఈయనగారి అక్రమాల చీడపై ఇటీవలే ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఇంతలోనే ఏసీబీ రంగంలోకి దిగింది. ఏక కాలంలో ఆయన, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు జరిపి కోట్లాది రూపాయల అక్రమాస్తులను గుర్తించి, స్వాధీనం చేసుకుంది. శ్రీకాకుళం క్రైం: పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలు.. విలువైన ఫ్లాట్లు.. లాకర్లలో, ఇంటి బీరువాల్లో స్వర్ణాభరణాల ధగధగలు.. లక్షల్లో బయటివారికి అప్పు లు.. మరికొన్ని లక్షల విలువైన బీమా పాల సీలు.. సర్కారు జీతంపై ఆధారపడే ఒక జిల్లాస్థాయి అధికారికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయంటే దానర్థం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఏసీబీ అధికారులు ఆయనగారి వ్యవహారాలపై నిఘా పెట్టారు. అదను చూసి దాడులకు దిగారు. రూ. 8 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. ఇన్ని ఆస్తులు కూడగట్టిన ఆ అధికారి జిల్లా ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్(ఏడీ) ఆర్.వి.వి.ప్రసాద్. ఉదయం 5 గంటలకే దాడులు తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా బుధవారం ఉదయం 5 గంటలకే ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు మరో ఆరుగురు బంధువుల ఇళ్లలో కూడ సోదాలు జరిపారు. శ్రీకాకు ళం పట్టణంలోని శ్రీ కల్కి గణపతి రెసిడెన్సీలో ఉన్న ప్రసాద్ ఇంట్లోని రికార్డులు, బీరువాల్లో ఉన్న బంగా రం, ఆస్తుల పత్రాలు.. అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు జరిపిన ఈ దాడుల్లో 40 ఇళ్ల స్థలాలు, నాలుగు ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, మూడు బ్యాంకు లాకర్లలో 69 తులాలు, ఇంట్లోని బీరువాల్లో మరో 11 తులాల బంగారు అభరణాలను కనుగొన్నామన్నారు. అలాగే బయటవారికి రూ. 25 లక్షల మేరుకు అప్పులిచ్చినట్టు సూచించే పత్రాలు, రూ. 40 లక్షల బీమా పాలసీల బాండ్లు ఉన్నాయని వివరిం చారు. వీటితోపాటు రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయన్నారు. వీటి విలువ సుమారు మూడు కోట్లు ఉండవచ్చని తెలిపారు. అయితే బయట మార్కెట్ విలువను బట్టి ఈ ఆస్తుల విలువ రూ.8 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులేనని నిర్థారణ కావడంతో ప్రసాద్‌ను అరెస్టు చేసి శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. గురువారం ఆయన్ను ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు సమాచారం. బంధువుల ఇళ్లలో సోదాలు ఏడీ ప్రసాద్ ఇంటిపై దాడులు జరిపిన సమయంలోనే వారి బంధువుల ఇళ్లలోనూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు జరిపారు. శ్రీకాకుళం, సోంపేట, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న ఆరుగురు బంధువుల ఇళ్లలో ఏక కాలంలో దాడులు చేశారు. ప్రసాద్ సోదరి అయిన శ్రీకాకుళం డీసీటీవో అనసూయ ఇంట్లోనూ సోదాలు జరిపారు. స్థానిక విశాఖ-బి కాలనీలో నివాసముంటున్న అనసూయ ఇంట్లో ప్రసాద్ ఆస్తులకు సంబంధించి ఏమైనా రికార్డులు, ఆధారాలు లభించవచ్చన్న ఉద్దేశంతో దాడులు చేశారు. సోంపేట మండలం మామిడిపల్లి, విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఉంటున్న బంధువుల ఇళ్లలోనూ సోదా లు జరిపారు. వంశధార నిర్వాసితుల నిధుల్లో అవకతవకలు 1992లో ఉద్యానవన శాఖలో చేరిన ప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగారు. డిప్యుటేషన్లపై వివిధ విభాగాల్లో పనిచేశారు. అందులో భాగంగా వంశధార నిర్వాసితుల పునరావాస విభాగంలోనూ విధులు నిర్వర్తించారు. ఇక్కడే ఆయన భారీ అవకతవకలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉద్యానవన శాఖలో ఏడీగా భాద్యతలు స్వీకరించిన తరువాత కూడా అదే పంథా కొనసాగించారు. ఆ శాఖకు అందే నిధుల్లో చాలా వరకు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మామిడిపల్లిలో ఏసీబీ సోదాలు సోంపేట(మామిడి పల్లి): ఉద్యానవనశాఖ ఏడీ ఆర్.వి.వి.ప్రసాద్ ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు అతని బంధువులు ఉంటున్న మామిడిపల్లిలోని ఇంటిలో కూడా సోదాలు చేశారు. సాహుకారి దివాకర్ ఇంటికి బుధవారం ఉదయం చేరుకున్న ఏసీబీ సీఐ శ్రీనివాసరావు తదితరులు సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించారు. సాక్షి వరుస కథనాలకు స్పందన ఉద్యానవన శాఖలో ప్రసాద్ పాదుగొల్పిన అవినీతిపై ఉద్యానవనంలో అవినీతి చీడ శీర్షికతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. వారం రోజుల కిందట వచ్చిన ఈ కథనాలు ఆ శాఖలో పెద్ద దుమారం రేపాయి. అయితే ఎప్పట్నుంచో ప్రసాద్‌పై అందుతున్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు ఆయన వ్యవహారాలపై కన్నేసి ఉంచారు. ఇదే సమయంలో ‘సాక్షి’లో వచ్చిన కథనాల ఆధారంతో దర్యాప్తును వేగవంతం చేసి. బుధవారం దాడులకు పూనుకున్నారు. ఈ దాడుల్లో ఏలూరు డీఎస్పీ వెంకటేశం, శ్రీకాకుళం సీఐ అజాద్, విజయనగరం సీఐ లక్ష్మోజి, ఏలూరు సీఐ విల్సన్, కాకినాడ సీఐ రాజశేఖర్, విజయవాడ సీఐలు నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ!
‘‘కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు జనాల్లో గుర్తింపు, క్రేజ్ ఉంటాయి. ఈ మూడు రంగాల్లో ఒకటైన సినీ ప్రపంచంలో ఉండటం నా అదృష్టం’’ అని జోగి నాయుడు పేర్కొన్నారు. దర్శకుడు కావాలనుకుని వచ్చినా నటునిగా పేరు తెచ్చుకుని, త్వరలో నిర్మాతగా కూడా మారనున్నారు జోగినాయుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 20ఏళ్ల సినీ ప్రస్థానంలోని మలుపుల్ని గుర్తు చేసుకున్నారాయన. ‘‘2001లో ‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’తో ఈవీవీగారు నన్ను నటునిగా పరిచయం చేశారు. ఇప్పటికి వందకు పైగా సినిమాలు చేశాను. ‘స్వామి రారా’తో నా కెరీర్ ఊపందుకుంది. ఆ ఒక్క సినిమా వల్ల నాకు 20 సినిమాల్లో అవకాశాలొచ్చాయి’’ అని జోగి నాయుడు సంతోషం వెలిబుచ్చారు. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటని అడిగితే - ‘‘ఇప్పుడు నేను బ్యాచ్‌లర్‌ని. అదే ఈ పుట్టినరోజు ప్రత్యేకత’’ అన్నారు నిర్వేదంగా. ఝాన్సీ నుంచి విడిపోయారు కాబట్టి, మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అనడిగితే -‘‘మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడంలేదు. ప్రస్తుతం నా దృష్టంతా చేస్తున్న సినిమాలపైనా, టీవీ షోస్ పైనే. ఈ ఏడాది చివర్లో ఓ నిర్మాణ సంస్థ ఆరంభించాలనుకుంటున్నా. కథలు సిద్ధంగా ఉన్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాలు నిర్మించాలనుకుంటున్నా’’ అన్నారు. మీ పాప ధన్య ఎవరి దగ్గర ఉంటోంది? అనే ప్రశ్నకు -‘‘ఇటీవలే మాకు విడాకులు వచ్చాయి. ప్రస్తుతం పాప ఝాన్సీ దగ్గరే ఉంటోంది. పాప నన్ను కలవొచ్చనే విషయమై కోర్టులో కేసు సాగుతోంది. నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నా’’ అని తెలిపారు. అసలు ఝాన్సీ నుంచి ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు? అంటే.. ‘‘మా మధ్య ఏవో మనస్పర్థలొచ్చాయి. పరిష్కరించుకుని, కలిసి ఉండాలనుకున్నా. కానీ, తనకిష్టం లేదు. దాంతో, విడాకులు ఇవ్వక తప్పలేదు’’ అని చెప్పారు. మీ జీవితంలో పశ్చాత్తాపపడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అనడిగితే -‘‘ఏమీ లేవు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా వచ్చినప్పుడు పూరి జగన్నాథ్ దగ్గర చేశాను. కృష్ణవంశీ దగ్గర కూడా పని చేయాలనుకున్నా. ‘జోగి బ్రదర్స్’ షో చూసి, ఆయనే పిలిపించి సహాయ దర్శకునిగా చేర్చుకున్నారు. అదే షో చూసి, ఓరోజు చిరంజీవిగారు నన్నూ, జోగి కృష్ణంరాజుని పిలిపించి ‘అసలు ఎలా చేస్తారయ్యా.. చాలా బాగుంటుంది’ అంటూ ఇద్దర్నీ అమాంతంగా హత్తుకున్నారు. నా పెళ్లి, మా పాప పుట్టినప్పుడు.. ఇలా నా జీవితంలో ఆనందపడే సంఘటనలు చాలా ఉన్నాయి. నేనెప్పుడూ మంచి విషయాలను మనసులో ఉంచుకుని, చెడు సంఘటనలను మర్చిపోతాను. నేను పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలేవీ నా జీవితంలో జరగలేదు. అలాంటి పనులు కూడా చేయలేదు. ఎవరి కోసమూ సినిమా పరిశ్రమకు రాలేదు. నాకోసం వచ్చాను. చిన్న పల్లెటూరి నుంచి ఇక్కడికొచ్చినప్పుడు మా అమ్మా, నాన్న నాకు అండగా నిలిచారు. ఇప్పుడూ వాళ్లే నా అండ’’ అన్నారు. భవిష్యత్తులో సినిమాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందని జోగినాయుడు వెల్లడించారు. -
సుమోలు పేలాయి కాబట్టే బతికి బట్ట కట్టాను!
తొలియత్నం ముసిరిన చీకట్ల దగ్గరే ఆగిపోయేది కాలమే కాదు. కమ్మిన మబ్బుల్ని చూసి కుంగిపోయేది వెలుగే కాదు. పైన కప్పుకున్న నివురును చూసి నీరసపడేది నిప్పే కాదు. చిన్న చిన్న దెబ్బలకు చితికిపోయేది అసలు జీవితమే కాదు. ఈ ఎరుక ఉంది కాబట్టే జీవితంలోను, దానితో ముడివేసుకున్న సినీ ప్రయాణంలోను ఎదురైన సవాళ్లకు వినాయక్ ఎప్పుడూ లొంగలేదు. అపజయాల్ని విలువైన అనుభవాలుగా మార్చుకుని గాయాల్ని విలువైన పాఠాలుగా మల్చుకుని సినీ ప్రస్థానం సాగిస్తున్న వి.వి.వినాయక్ తన గమనంలో మొదటి అడుగు ‘ఆది’ జ్ఞాపకాల్ని ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు. సినిమాకు ప్రాణం లాంటి సీన్ అది. అంతా సిద్ధం చేసుకున్నాక, పర్మిషన్ లేదంటే ఎలా. నెమ్మదిగా మెదడు మొద్దుబారడం ప్రారంభించింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని స్థితి. ప్రయాణంలో ఒంటరివాడినయ్యానన్న బాధతో ఒక్కసారిగా దుఃఖం కమ్ముకొచ్చేసింది. అప్పుడొచ్చాడు తను. నా భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పాడు. గమ్యం చేరేదాకా ఆ ధైర్యం అలాగే నిలిపాడతను. అతను సినిమానే కాదు, నా నమ్మకాన్నీ నిలబెట్టి హీరో. అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు ఒక చిన్న ప్రేమకథ నా మనసును తట్టింది. దాన్ని ఎన్టీఆర్‌కు వినిపించాను. తనకు బాగా నచ్చింది. సినిమా చేద్దామనుకున్నాం. ప్రేమ కథ వద్దు, మాస్ కథ అయితే ఎన్టీఆర్‌కి సరిపోతుందన్నాడు నాని. వచ్చిన అవకాశం చేజారిపోతుందేమోనన్న భయం కలిగింది నాకు. మాస్ కథ అంటే ఎలా ఉండాలి, ఎన్టీఆర్‌ను ఎలా చూపించాలి అని ఆలోచించా. మాస్ పాత్రలంటే నందమూరి ఫ్యామిలీకి గాలి పీల్చినంత సులువు. అప్పటికే ఫ్యాక్షన్ సినిమాలు తెలుగు తెరపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అలాంటి సినిమా చేయాలనుకున్నా. ఎప్పుడో నా దగ్గర రాసుకున్న రెండు సీన్లు గుర్తుకువచ్చాయి. ఒక పోలీసాఫీసర్ ఇంటిపై శత్రువులు బాంబులు వేసి, కుటుంబాన్ని చంపేస్తారు. బాల హీరో ఒక బాంబ్ విలన్ల మీదకు విసిరి పారిపోతాడు. ఇది మొదటి సీన్. రెండో సీన్ ఏంటంటే, విలన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీస్ జీప్ పేల్చేస్తాడు. హీరో వెంటనే విలన్ వెహికల్ పేల్చేస్తాడు. రూమ్‌లో కూర్చుని కథ రాయడం మొదలుపెట్టాను. ఒక్కోసారి పొద్దున్నే లేచి మొహం కడగకుండా సీన్స్ రాసేవాణ్ని. పూర్తయ్యాక ఎన్టీఆర్‌కి, బెల్లంకొండ సురేశ్‌కు వినిపిస్తే, వాళ్లకు బాగా నచ్చింది. షూటింగ్ మొదలుపెట్టాం. అంతా బాగానే జరుగుతుందనుకున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. హీరో విలన్ ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు వరుస సుమోలు పేలే దృశ్యాన్ని కోరుకొండ సైనిక్ స్కూల్లో తీయడానికి ప్లాన్ చేసుకున్నాం. సరిగ్గా ఉదయం ఏడు గంటలకు సీన్ మొదలుపెట్టేముందు, స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి ఇక్కడ షూట్ చేయడం కుదరదన్నాడు. ఒక్కసారి షాక్ తిన్నాను. సినిమాకు, నా కెరీర్‌కు ఇది చాలా ముఖ్యమైన సీన్. ముందు నుంచే దీన్ని ఎలా తీయాలనే విషయంపై చాలా వర్క్ చేశాను. దానికోసం బాంబే నుంచి టెక్నీషియన్లను రప్పించాం. ఫైట్‌మాస్టర్ విక్రమ్ధర్మాను పిలిపించాం. అయిదు కెమెరాలు సెటప్ చేశాం. ఇప్పుడు సడన్‌గా పర్మిషన్ లేదంటే ఎలా. మెదడు మొద్దుబారిపోతోంది. విక్రమ్ ధర్మా దగ్గరకు వెళ్లి, ప్రిన్సిపాల్‌తో మాట్లాడటానికి రమ్మని అడిగాను. అది నా పని కాదని మొహం మీద చెప్పేశాడతను. అతని రియాక్షన్‌కు ఒక్కసారిగా షాక్ తిన్నాను. అంతలో ఎన్టీఆర్ వచ్చి నా భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పాడు. నాతో పాటు ప్రిన్సిపాల్ రూమ్‌కి వచ్చాడు. ప్రిన్సిపాల్‌కు తెలుగు రాదు. ఎన్టీఆర్ ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడతాడు. మొదట హీరో కారు పేలుస్తాం. దానివల్ల ఎలాంటి డ్యామేజ్ జరగకుంటే మిగతా వాటికి పర్మిషన్ ఇమ్మని తను ప్రిన్సిపాల్‌ను కన్విన్స్ చేశాడు. అదృష్టం కొద్దీ, ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో మిగతా సీన్ షూటింగ్‌కు పర్మిషన్ దొరికింది. ఆ క్షణంలో ఎన్టీఆర్‌ను గట్టిగా పట్టేసుకున్నాను. సినిమా చివరిదాకా ప్రతిక్షణం తను నా వెంట నిలిచాడు. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ విలన్స్‌తో ఫైట్ చేస్తూ గోడకున్న అద్దాల ఫొటో ఫ్రేముల్ని చేత్తో బద్దలు కొడతాడు. పొరపాటున ఒక గాజు ముక్క ఎన్టీఆర్ కుడి చేతిలోకి చొచ్చుకుని పోయింది. కళ్ల ముందే రక్తం ధారగా ప్రవహించడం మొదలుపెట్టింది. నాకు చెమటలు పట్టసాగాయి. ఎన్టీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుని, షెడ్యూల్ బ్రేక్ చేయకుండా షూటింగ్లో పాల్గొన్నాడు. తరువాత ఎన్టీఆర్ ఒంటి చేత్తోనే ఆ ఫైట్ సీన్ పూర్తి చేశాడు. ఇప్పుడు చూస్తే సినిమాలో ఈ విషయం మీకు అర్థమవుతుంది. గాయం మానకుండానే ‘నీ నవ్వుల చల్లదనాన్ని’ పాట చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ పాట ‘ఆది’ సినిమాకు అదనపు అందాన్ని తెచ్చిపెట్టింది. దాని వెనుక ఒక చిన్న కథ ఉంది. అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్న రోజుల్లో రోడ్డుమీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. మణిశర్మ స్టూడియో ఛాయలకు వెళ్లాక, సడన్‌గా ఒక కారు నా ముందు ఆగింది. అందులోంచి చంద్రబోస్‌గారు దిగి నన్ను పలకరించారు. కానీ ఆయనెందుకో కొంచెం డల్‌గా అనిపించి అడిగాను. నేను వినిపించబోయే పాటపై నీ అభిప్రాయం చెప్పు అని ‘నీ నవ్వుల చల్లదనాన్ని’ పాట పాడారు. నాకు చాలా నచ్చిందని చెప్పాను. కానీ ఈ పాట వేరేవాళ్లకు నచ్చలేదన్నాడు. సార్ ఈ పాట నాకివ్వండి, నేను డెరైక్టర్ అవగానే నా మొదటి సినిమాలో పెట్టుకుంటానని చెప్పాను. సరే, ఈ పాట నీదే అన్నారు చంద్రబోస్. ఇది జరిగిన ఏడాదిన్నరకు బోస్‌గారికి ఫోన్ చేసి పాట అడిగాను. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ మొదటిసారి ఊళ్లోకి వచ్చినప్పుడు బోరింగ్ పంపు దగ్గర నీళ్లు తాగేటప్పుడు సీన్‌కు థియేటర్లో విపరీతమైన స్పందన వచ్చింది. దీనికి చిన్నప్పుడెప్పుడో విన్న కథ ఇన్స్పిరేషన్. ఒక ఊళ్లో ఒక రైతు పొలంలో పంట పండిన తరువాత అడిగిన వాళ్లందరికీ ధాన్యం పంచాడు. చివరకు చూస్తే తనకు ఒక్క గింజ కూడా మిగలలేదు. అప్పుడా రైతు తన పొలం పక్కన రాయి మీద కూర్చుని బాధపడుతున్నాడు. అప్పుడొకాయన నువ్వు కూర్చున్నరాయి కింద క్రిష్ణదేవరాయల సింహాసనం ఉంది చూడు అన్నారట. ఇది స్థల మహత్యం గురించి చెప్పిన కథ. అలాగే చాలాసార్లు ఆ ఊరి నీళ్లే అలాంటివి అనే మాట వింటుంటాం. దీని ఆధారంగా ఎన్టీఆర్ సీమలోకి అడుగుపెట్టినప్పుడు ఆ ప్రాంత పౌరుషం గురించి చెప్పడానికి ఈ సీన్ రాసుకున్నాను. అలాగే సోడా సీసా ముక్కల్ని బాంబుల్లో చుట్టడం లాంటి చిన్న చిన్న డిటెయిలింగ్ ఎలా చేయగలిగారని చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు. బెల్లంకొండ సురేశ్‌గారి మిత్రుడు సాదిక్గారి పక్కన కూర్చుని సీమకు సంబంధించి బోలెడన్ని విషయాలు అడిగేవాణ్ని. ఆయన చెప్పిన వివరాలు, సంఘటనల ఆధారంగా ఇలాంటి సీన్స్ రాయగలిగాను. మా సినిమాకు రాంప్రసాద్ కెమెరామెన్. జైల్లో ఎన్టీఆర్ తొడగొట్టే సన్నివేశాలు తీస్తున్నప్పుడు తనకు వేరే సినిమా క్లాష్ వచ్చి సమీర్‌రెడ్డి షూట్‌కు వచ్చాడు. నేను ఆ సీన్‌ను తెరకెక్కించిన విధానం చూసి చాలామందికి నా గురించి గొప్పగా చెప్పాడు. ఈ విషయం గోపాల్‌రెడ్డిగారికి తెలిసి కథ ఉంటే చెప్పు, దుర్గా ఆర్ట్స్‌లో సినిమా చేద్దాం అన్నారు. ఎన్టీఆర్ పక్కన ఉండే ఉదయన్ అయితే, అసలు మనోడికి రజనీకాంత్ అంత బిల్డప్ ఇస్తున్నావ్ అన్నారు. తొడగొట్టే సీన్ షూటింగ్ దశ నుంచే సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. నేను రాసుకున్న పాత్రలు, సన్నివేశాలు తెరమీద అంత ఉద్వేగంగా, బలంగా పండటానికి కారణం సినిమాలో ఆర్టిస్టులు. ఎన్టీఆర్ వీర, భయానక, రౌద్ర, కరుణ రసాల్లో బీభత్సంగా నటించడం. అప్పటిదాకా తన కెరీర్లో చేయని పాత్రను చలపతిరావు ఈ సినిమాలో చేశాడు. తల్లిదండ్రులు లేని పిల్లవాడిని అనుక్షణం గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాబాయిగా ఆయన నటన అద్భుతం. విలన్ నాగిరెడ్డి పాత్రను మొరటుగా, పశు ప్రవృత్తి కలిగిన మనిషిలా తయారు చేశాను. ఆ పాత్రకు రాజన్ పి.దేవ్ పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా చేసినప్పుడు ఉన్నంత కాన్ఫిడెంట్‌గా మరెప్పుడూ ఉండలేకపోయాను. ఏమైనా ‘ఆది’ సినిమా నా కెరీర్లో ఓ మ్యాజిక్. అది ఎవరి జీవితంలోనైనా ఒక్కసారే జరుగుతుందనుకుంటా. ఒక షాట్లో కనుబొమ్మలు ఇలా పైకి ముడవాలని రాసుకుంటే తను అలాగే చేసేవాడు. నేను తనను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న ప్రతి సీన్‌కు ఎన్టీఆర్ జీవం పోశాడు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి