
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర సమాచార శాఖ(తెలంగాణ) అదనపు డైరక్టర్ జనరల్‌గా ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్ డిప్యుటేషన్ మీద హైదరాబాద్‌కు వచ్చారు. రిజిస్టార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా(హైదరాబాద్) కార్యాలయంలో అదనపు ప్రెస్ రిజిస్టార్‌గా వ్యవహరించనున్నారు. అంతేగాక సమాచార, మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరోకు అధిపతిగా వ్యవహరిస్తారు. 1989 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన ఎస్. వెంకటేశ్వర్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 30 సంవత్సరాల సర్వీస్ కాలంలో పత్రికా సమాచార కార్యాలయం, బెంగుళూరు అదనపు డైరక్టర్ జనరల్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కార్యాలయం, భువనేశ్వర్ డైరక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.