మెదక్(జహీరాబాద్): జహీరాబాద్ మండలంలోని పశుసంవర్ధకశాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. ఇటీవల ఇదే శాఖలో పనిచేస్తూ రిటైరైన మహేశ్వరరావు పింఛన్ పేపర్లను హైదరాబాద్‌లోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసుకు పంపించేందుకు ఆయనను రూ.3 వేలు డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా దొరికిపోయిన ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.