
అనుపమా పరమేశ్వరన్, షూటింగ్ లొకేషన్లో...
అనుపమా పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారారు. ఇదేదో కొత్త సినిమాలో పాత్ర అనుకోకండి. నిజంగానే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొత్త జాబ్‌లోకి మారారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ విషయం గురించి అనుపమ చెబుతూ– ‘‘ఇది సరికొత్త ప్రారంభం. షంజూ జేబా అనే ట్యాలెంటెడ్ దర్శకుడికి అసిస్టెంట్‌గా చేయడం సంతోషంగా ఉంది.
ఈ కొత్త రోల్ పట్ల చాలా ఎగై్జటెడ్‌గా, ఆనందంగా, నెర్వస్‌గా ఉన్నాను. ఈ టీమ్ పట్ల పూర్తి నమ్మకంగా ఉన్నాను. మా సినిమాకు మీ అందరి బ్లెసింగ్స్ కావాలి’’ అన్నారు. మరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ బ్యూటీ పూర్తి స్థాయి దర్శకురాలిగా కొనసాగుతారా? లేదా? వేచి చూడాలి. ప్రస్తుతం బెల్లం కొండ సాయిశ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమాలో నటిస్తున్నారు అనుపమ.
Comments
Please login to add a commentAdd a comment