
ప్రేమలో పడ్డ విజయలక్ష్మి
నటి విజయలక్ష్మి సహాయ దర్శకుడి ప్రేమలో పడ్డారన్నది తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం.
నటి విజయలక్ష్మి సహాయ దర్శకుడి ప్రేమలో పడ్డారన్నది తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం. చెన్నై-28 చిత్రంలో హీరోయిన్‌గా చిత్ర రంగ ప్రవేశం చేసిన నటి విజయలక్ష్మి. ఆ తరువాత అంజాదే, కట్రదు కళవు, వనయుద్ధం, వెన్నెలా వీదు తదితర చిత్రాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన సుల్తాన్ ది వారియర్ యానిమేషన్ చిత్రంలో నటించారు. అయితే ఆ చిత్ర నిర్మాణం పూర్తి కాలేదన్నది గమనార్హం.మరో విషయం ఏమిటంటే విజయలక్ష్మి కాదల్‌కోట్టై చిత్రం దర్శకుడు అగస్థ్య కూతురు.
ఆమె కిప్పుడు వివాహ గడియలు దగ్గర పడ్డాయని సమాచారం. వల్లినం చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసిన ఫిరోస్ అనే వ్యక్తితో ప్రేమ పడిందని, త్వరలోనే పెళ్లి జరగనుందని సమాచారం. ఫిరోస్ త్వరలో దర్శకుడుగా మెగాఫోన్ పట్టి కృష్ణ హీరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఒక షూటింగ్‌లో కలిసిన ఫిరోస్, విజయలక్ష్మిల పరిచయం ప్రేమగా మారిందని ఆమె త్వరలో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధంగా ఉందని కోలీవుడ్ వర్గాల టాక్.