జూనియర్ ఆర్టిస్టుపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పారిపోయిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
నార్సింగి: జూనియర్ ఆర్టిస్టుపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పారిపోయిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన సదానందరెడ్డి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేందుకు నగరానికి వచ్చాడు. పుప్పాల గూడ లాలమ్మ గార్డెన్ ప్రాంతంలోని లుబినీ వనం ఆర్గనైజింగ్ సంస్థ కార్యాలయంలో ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం సదానందం వద్దకు వచ్చిన అతడి స్నేహితుడు రవికుమార్ అతడితో మాట్లాడుతూనే కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.