డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు
సినిమా రంగానికి, డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు.
సినిమా రంగానికి, డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. జీడిమెట్ల పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక సినీనిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. కొకైన్ గ్రాము 5-10 వేల వరకు అమ్ముడవుతుంది.
కాగా, నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి, అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ. 6 కోట్లని అంచనా వేశారు. సైబరాబాద్ పరిధిలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు. ఇంతకుముందు ఒక శాస్త్రవేత్తను అరెస్టుచేసి, అతడి వద్ద వందల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన వెంకట సురేష్ అనే వ్యక్తి, యూసుఫ్‌గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి విద్యార్థులకు డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నించారు. ఇతడు ఇంతకుముందు రాంగోపాల్ వర్మ సినిమాలో పని చేసినట్లు తెలిసింది.