Lekar Hum Deewana Dil
-
అర్మాన్ జైన్ కు షారుఖ్ ఖాన్ అభినందనలు
ముంబై:వర్దమాన నటుడు అర్మాన్ జైన్ కు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అభినందనలు తెలియజేశారు. అర్మాన్ హీరోగా నటించిన 'లేకర్ హమ్ దీవానా దిల్' శుక్రవారం విడుదలైన సందర్భంగా షారుఖ్.. ఆ యువనటుడుకి ఆశీస్సులు అందించాడు. అర్మాన్ తొలి సినిమా ఆరంగేట్రం బాగుందంటూ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా ఆ టీంకు, అర్మాన్ కు ప్రత్యేకం అభినందనలు తెలిపాడు. అతను వేసిన తొలి అడుగు నిజంగానే ఈ సినిమా ప్రపంచానికి సంతోషకరమైనదని తెలిపాడు. దివంగత రాజ్ కపూర్ మనవడైన అర్మాన్ జైన్ కలలు సాకారం కావాలని షారుఖ్ పేర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ కూడా అర్మాన్-దీక్షాసేథ్ జోడీని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ సినిమాలో వారిద్దరి జోడీ చాలా ఆకర్షణీయంగా ఉందని తెలిపాడు. -
మా అమ్మ కొట్టలేదు
ఒక చెంప దెబ్బ షాట్‌ను సరిగ్గా తీయడం కోసం 200 టేక్‌లు తీసుకున్నానని ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాతో బాలీవుడ్లో అడుగిడుతున్న అర్మాన్‌జైన్ చెప్పాడు. ‘మా అమ్మ రీమా నన్ను ఏనాడూ కొట్టలేదు. అందువల్లనే ఆ సీన్‌ను పండించడానికి అన్ని టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది’ అని రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘నేను అసలు అల్లరే చేసేవాడిని కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఆమెను సతాయిస్తే వెంటనే ఓ గదిలో బంధించేది. అంతేతప్ప ఏనాడూ నాపైకి చేయెత్తలేదు. ఈ సినిమాలో నా తల్లి పాత్రధారి అనిత నన్ను తొలిసారిగా కొట్టింది. దీంతో దిగ్భ్రాంతికి గురయ్యా’ అని అన్నాడు. కపూర్ల కుటుంబానికి చెందిన ఈ నటవారసుడు తన బంధువులైన రణ్‌బీర్, కరిష్మా, కరీనా కపూర్ల సహాయం ఏనాడూ తీసుకోలేదు. అయినప్పటికీ తొలి సినిమా ద్వారా భారీ హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాడు. అరిఫ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ‘లేకర్ హం దివానా దిల్’ సినిమాలో అర్మాన్ సరసన దీక్షాసేథ్ నటించింది. ఈ సినిమాకు కరీనా భర్త సైఫ్ అలీఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుద ల కానుంది. ‘సైఫ్ సినిమాలో నాకు ఓ అవకాశం దొరికింది. మా సోదరులు ఎవరైనా కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని అంతా అనుకుంటారు. అయితే అది సరికాదు. సినిమాలు మినహా అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఏ ఒక్కరికీ చెప్పకుండానే ‘లేకర్ హం దివానా దిల్’ సినిమా ఆడిషన్లో పాల్గొన్నా. ఈ సినిమాకోసం ఆరిఫ్ నన్ను ఎంపిక చేసిన తర్వాత ఈ విషయాన్ని దీదీ (కరీనాక పూర్) తెలియజేశా’ అని అన్నాడు. -
అభద్రతా భావం లేదు
సహనటుడు అర్మాన్‌జైన్ రాజ్‌కుమార్... నిర్మాత రాజ్‌కపూర్ మనవడే అయినప్పటికీ తానేమీ అభద్రతా భావానికి లోనవడం లేదని నటి దీక్షాసేథ్ చెప్పింది. అర్మాన్తో కలసి ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమాతో బాలీవుడ్లో తొలిసారిగా నటిస్తున్న ఈ సుందరి... గతంలో ‘వేదం’ అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించింది. ‘అతడు కూడా కపూరేనని తెలిసిన తర్వాత కూడా నేనేమీ అభద్రతా భావానికి లోనవడం లేదు. ఈ సినిమాలో నా పాత్ర సరైనది కాకపోతే మాత్రమే నాకు కచ్చితంగా ఆ భావన కలుగుతుంది. ఈ సినిమా చూసినట్టయితే పని విభజన సరిగ్గా జరిగిందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అర్మాన్... కరీనాకపూర్, కరిష్మా కపూర్లకు సోదరుడి వరుస. కొత్త నటుడు బాలీవుడ్‌లోకి అడుగిడితే అతగాడు ఎవరి కుమారుడనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన వారిని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం అత్యంత సహజమనేది నా భావన. అసలేం జరుగుతోందనే విషయం తెలుసుకోవాలనే తొందరపాటు కూడా సహజమే’ అని అంది. ‘లేకర్ హమ్ దిల్ దీవానా’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఇల్యూమినాటి, ఇరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్ ఇండియా పోటీల్లో తలపడ్డ దీక్షాసేథ్ బాలీవుడ్లో తాను నటిస్తున్న తొలి సినిమాలో సంభాషణలు ఎలా చెప్పాననే విషయం తెలుసుకునేందుకు తెగ తొందరపడిపోతోంది. ‘మాతృభాషలో తొలిసారిగా నటించిన సినిమా కావడంతో సినిమా విడుదల కోసం నేను కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నానని తెలి పింది. -
రాజ్ కపూర్ మనవడు, దీక్షసేత్ ల మూవీ ప్రెస్ మీట్