
నిన్న మొన్నటివరకు బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన విక్కీ కౌశల్ ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్’ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఆయన తొలిసారి ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. విక్కీ ఇప్పుడు భారత వ్యోమగామి రాకేశ్ శర్మ బయోపిక్ ‘సారే జహాసే అచ్చా’లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈ బయోపిక్‌లో తొలుత ఆమిర్‌ఖాన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సడన్‌గా షారుక్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే... ‘డాన్ 3’ సినిమా కోసం షారుక్‌ఖాన్ రెడీ అవుతున్నారని, అందుకే ఆయన స్థానంలో విక్కీ కౌశల్ నటించబోతున్నారని బాలీవుడ్ తాజా ఖబర్.