చంద్రుడిపై అడుగుపెట్టిన భారత వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో తాను నటిస్తున్నట్టు ఆమిర్ ఖాన్ గతంలో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'సెల్యూట్' అని టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే, 'మిస్టర్ పెర్ఫెక్ట్' ఆమిర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం చిత్ర యూనిట్‌తో విభేదాలేనని తెలుస్తోంది. కొన్ని విషయాల్లో సినిమా క్రియేటివ్ టీమ్‌కు ఆమిర్‌కు అభిప్రాయభేదాలు వచ్చాయట. దీంతో ఈ బయోపిక్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మహేష్ మఠీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అమీర్ భార్యగా ప్రియాంకా చోప్రా నటిస్తారని గతంలో భావించారు. 2018 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం థాయిలాండ్‌లో కొనసాగుతున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' హూటింగ్ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్‌లో అమీర్ పాల్గొంటాడని అనుకున్నారు. స్కిప్ట్ చివరిదశలో విభేదాలు రావడంతో ఆమిర్ టాటా చెప్పాడని, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడానికి షారుఖ్ ఖాన్‌ను నిర్మాతలు సంపద్రించారని బాలీవుడ్ మీడియా తాజా కథనంలో తెలిపింది. దీనిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
Published Sun, Dec 10 2017 9:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment