
ముంబై : బాలీవుడ్ ప్రేమికులు మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఓ వేడుకలో తళుక్కుమన్నారు. ఇటీవల నటుడు ఆర్మాన్ జైన్, అనిస్సా మల్హోత్రాల వివాహం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరు మంగళవారం గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. కాగా ఈ పార్టీలో లవ్ బర్డ్స్.. రణ్‌బీర్ కపూర్-అలియా భట్, వరుణ్ దావన్-నటాషా దలాల్, మైలైకా అరోరా-అర్జున్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో మలైకా ఆరెంజ్, అర్జున్ గ్రీన్ దుస్తుల్లోధగధగ మెరుస్తూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (దిష్టి తగులుతుందేమో జాగ్రత్త!!)
మలైకా, అర్జున్ కపూర్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే, అయితే ఈ విషయాన్ని బహిర్గతంగా ఎప్పుడూ ప్రకటించకపోయినా ప్రతి సందర్భంలోనూ ఒకరిమీద మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాగా 2017లో వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ మలైకా అరోరా సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ విడాకులు తీసుకున్నారు. ఇక అర్జున్ కంటే మలైకా దాదాపు పన్నెండేళ్లు పెద్దవారన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ త్వరలోనే వివాహానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment