
చిత్రమ్ చెప్పిన ప్రేమకథ!
ప్రేమకథా చిత్రమ్’ తెరకెక్కించిన జె. ప్రభాకర్ రెడ్డి స్వీయదర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’.
‘ప్రేమకథా చిత్రమ్’ తెరకెక్కించిన జె. ప్రభాకర్ రెడ్డి స్వీయదర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఇటీవల నాయకానాయికలపై విదేశాలలో పాటలను చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. జార్జియా దేశ రాజధాని టిబ్లిసి, అనామరి, స్నో, కాస్‌బెర్గ్ తదితర అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. వచ్చే నెలలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి రచన: అజయ్, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్.