సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చాలా కాలం తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో తెలుగు తమ్ముళ్లు నిమగ్నమయ్యారు. మంత్రి నారాయణ, మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముగ్గురు నేతలు తయారు చేసిన జాబితాను సోమవారం అధిష్టానానికి సమర్పించనున్నట్లు తెలిసింది.
ముందుగా దేవాలయ, మార్కెట్ కమిటీలు పూర్తి చేయనున్నారు. ఆ తరువాత గ్రంధాలయ, నూడా, ఆర్టీసీ చైర్మన్ పదవుల నియమాకం చేపట్టనుండడంతో వీటి కోసం తమ్ముళ్ల మధ్య పోటీ తీవ్ర మైంది. ఒకరికి తెలియకుండా ఒకరు ముఖ్యమైన పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ‘నా వాళ్లకే ఆ పదవులు కట్టబెట్టాలి. పార్టీలో ఎటువంటి అనుభవం లేని.. పార్టీ కోసం మొదటినుంచి కష్టపడని వ్యక్తుల వర్గీయులకు ఇస్తే ఒప్పుకునేది లేదు’ అని ఇద్దరు మాజీ మంత్రులు అధిష్టానానికి తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాహుల వివరాలు..
జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోసం ఆదాల ప్రభాకరరెడ్డి వర్గానికి చెందిన పేరిన కోటేశ్వరరెడ్డి, సోమిరెడ్డి వర్గానికి చెందిన పాముల రమణయ్యకు ఇప్పించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇంకా కోవూరు మార్కెట్ కమిటీకి పోటీ పడుతున్న గూడూరు వెంకటనాగశేఖరరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
నెల్లూరు అర్బన్ డవలప్‌మెంట్ సొసైటీ (నుడా) చైర్మన్ కోసం టీడీపీ అడహక్ కమిటీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, సీనియర్ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూరాధ పోటీ పడుతున్నారు. 33 మండలాలు మొత్తం కలిపితే సీనియర్ నాయకులు సైతం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ చైర్మన్ కోసం ఆర్టీసీ విభజన పూర్తయితే గూడూరు రఘునాథరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, అనూరాధా చైర్మన్ పదవిని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేవాలయాల పాలకమండళ్లు..
పెంచలకోన దేవస్థానం చైర్మన్ పదవి కోసం మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు గంగా ప్రసాద్ వర్గానికి చెందిన నానాజి, నారా లోకేష్‌బాబుకు సన్నిహితంగా మెలిగే వెంకటగిరి ప్రాంతంలోని బీసీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి పోటీ పడుతున్నారు.చెంగాళమ్మ ఆలయానికి వేనాటి రామచంద్రారెడ్డి ఎవరి పేరు సూచిస్తే వారికే చైర్మన్ పదవి దక్కుతుంది.జొన్నవాడ కామాక్షమ్మ ఆలయానికి పట్టాభిరామిరెడ్డి వర్గీయుడు కాటంరెడ్డి చంద్రారెడ్డి, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్గానికి చెందిన జక్కంరెడ్డి కృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. రంగనాయకుల స్వామి ఆలయానికి సోమిరెడ్డి వర్గానికి చెందిన మండవ రామయ్య, ఒట్టూరు సంపత్‌రాజు, మంత్రి నారాయణ వర్గానికి చెందిన కోట గురుబ్రహ్మ పోటీపడుతున్నారు.
ఇరగాళమ్మ దేవస్థానానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి వర్గానికి చెందిన రమేష్ ఆచారి, మెట్టు సురేష్, సోమిరెడ్డి వర్గానికి చెందిన జలదంకి సుధాకర్ పోటీ పడుతున్నారు. నరసింహ కొండ ఆలయానికి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గానికి చెందిన వేమిరెడ్డి అశోక్‌రెడ్డి, వేమిరెడ్డి ఆనందరెడ్డి పోటీ పడుతున్నారు. మూలస్థానేశ్వర దేవాలయానికి ప్రస్తుత చైర్మన్ ఆంతూరి మహేశ్వరరెడ్డినే కొనసాగించాలని ఉద్దేశంలో నాయకులు ఉన్నారు. అదే విధంగా నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి ఆలయ సభ్యత్వం కోసం తొమ్మిది మంది పోటీ పడుతున్నారు.
నెల్లూరు మార్కెట్ కమిటీకి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి వర్గానికి చెందిన ముసునూరు బాపిరెడ్డి పేరుమాత్రం వినపడుతోంది నాయుడుపేట మార్కెట్ కమిటీ చెర్మైన్ పదవి కోసం విజయభాస్కరరెడ్డి మాత్రం పోటీలో ఉన్నారు. కోవూరు మార్కెట్ కమిటీకి ఎమ్మెల్య పోలంరెడ్డి అనుచరుడు ఊటుకూరు విజయబానురెడ్డి, సోమిరెడ్డి అనుచరుడు సీనియర్ నాయకుడు గూడూరు వెంకటనాగశేఖరరెడ్డి పోటీపడుతున్నారు.
వెంకటగిరి మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పి.రాజేశ్వరరావు పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. కావలి మార్కెట్ కమిటీకి బీద సోదరుల బంధువు దేవరాళ్ల సుబ్రమణ్యం, కలగుంట్ల మధుబాబు, మంత్రి నారాయణ సామాజిక వర్గానికి చెందిన మల్లిశెట్టి వెంకటేశ్వర్లు పోటీ పడుతున్నారు.రాపూరు మార్కెట్ కమిటీకి సోమిరెడ్డి వర్గానికి చెందిన పాపకన్ను మధుసూదన్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఆదాల ప్రభాకర్‌రెడ్డి పొదలకూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మకూరు మార్కెట్ కమిటీకి ఇందూరు వెంకటరమణారెడ్డి, చండ్ర వెంకటసుబ్బయ్యనాయుడు, రాపూరు సుందరరామిరెడ్డి, రాపూరు పెంచలరెడ్డి, నంది వివేకానందరెడ్డి పోటీ పడుతున్నారు. వీరంతా సోమిరెడ్డి, కన్నబాబు వర్గీయులు.
ముచ్చటగా మూడు గ్రూపులు
Published Sun, Dec 14 2014 1:25 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement