వైఎస్‌ఆర్‌సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత ఇందూరు ప్రభాకర్‌రెడ్డిని ప్రత్యర్థులు శనివారం దారుణ హత్య చేశారు. సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన ప్రభాకర్ రెడ్డి, ఆయన బావమరిదిని వెంబడించిన ప్రత్యర్థులు వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లు, కత్తులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇరువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రభాకర్‌రెడ్డి గతంలో ఎంపీపీగా పని చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఘటనాస్ధలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.