జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాస్
Published Mon, Aug 29 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
ఇందూరు : జిల్లా ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఎం.శ్రీనివాస్ రానున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గల రాష్ట్ర శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు డీడీగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి జారీ అయ్యాయి. రెండు, మూడు రోజుల్లో నూతన డీటీవోగా జిల్లాకు వచ్చి విధుల్లో చేరనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం డీడీగా పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి హైదరాబాద్‌లో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సీఏవోగా ప్రభుత్వం పదోన్నతి ఇచ్చి బదిలీ చేస్తూ మరో ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ప్రభాకర్ రెడ్డి జిల్లా ట్రెజరీ అధికారిగా వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది. 2015 డిసెంబర్ 1న ఆయన జిల్లాకు వచ్చారు. వచ్చి రాగానే ట్రెజరీ శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన, ఆరోపణలున్న ఉద్యోగుల సెక్షన్‌ల మార్పు, అర్హులకు పదోన్నతులు కల్పించి మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే జిల్లాలో వెలుగు చూసిన నకలీ పెన్షన్ ‘యాహ్యా’ ఉదంతంపై లోతైన విచారణ చేపట్టడంతో పాటు, మిగతా అన్ని పెన్షన్‌లపై విచారణ చేపట్టిన మొదటి డీడీగా నిలిచిపోయారు.
Advertisement
Advertisement