మెదక్ లోక్సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్: మెదక్ లోక్సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేయడానికి చివరి రోజైన బుధవారం ఎన్నికల వాతావరణం ఊపందుకుంది.
టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ విప్ జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జగ్గారెడ్డి ఇదే రోజు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ మద్దతుతో బీజేపీ టికెట్ దక్కించుకున్నారు.