సాక్షి, హైదరాబాద్: ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలోకి వెళ్లా రని, అందుకే హింసను ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగెస్ర్ నేతలు ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హిత వు చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత గత 10 ఏళ్లలో ఎక్కడా హింసకు తావివ్వలేదని.. అవహేళనలు, అవమా నాలు, కవ్వింపులు జరిగినా సంయమనం పాటించినట్లు చెప్పారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నం హేయమైన, అనాగరిక చర్య అని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలోని 14 స్థానాలు బీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నాగం, రావుల, పి.చంద్ర శేఖర్, ఎర్ర శేఖర్‌ల రాకతో జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలలోనే నేతలకు న్యాయం జరుగుతుందని తెలుసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని, పారాచూట్ నేతలకు టికెట్లిచ్చారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో సర్వే చేస్తున్న సునీల్ కనుగోలు ‘కొనుగోలు’గా మారారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment