వేంపల్లిలో ఒకే రోజు రెండు చోరీలు | theft at prabhakar reddy home in vempalli | Sakshi
Sakshi News home page

వేంపల్లిలో ఒకే రోజు రెండు చోరీలు

Published Sun, Feb 19 2017 9:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

వేంపల్లిలో ఒకే రోజు రెండు చోరీలు

వేంపల్లిలో ఒకే రోజు రెండు చోరీలు

వేంపల్లి (వైఎస్సార్‌ జిల్లా): వేంపల్లి మండల కేంద్రంలోని పుల్లయ్య తోటలో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. వేంపల్లి నారాయణ స్కూల్ లో డైరెక్టర్‌గా వున్న ప్రభాకర్ రెడ్డి పుల్లయ్య తోటలో నివాసం వున్నారు.

శనివారం కడపలో ఓ శుభకార్యానికి ప్రభాకర్‌ రెడ్డి కుటుంబసభ్యులు వెళ్లారు. ఆదివారం వేకువజామున దొంగలు మాటు వేసి ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను పగుల గొట్టి విలువైన నగలు, సామాగ్రిని దోచు కెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకేరోజు చౌడేశ్వరి ఆలయంలో, ఇక్కడ రెండు చోట్లా చోరీలు జరగడంతో వేంపల్లి ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement