Vempalli
-
వేంపల్లి క్రాస్ రోడ్డు వద్ద సీఎం వైఎస్ జగన్ విజువల్స్
-
రెపరెపలాడుతున్న జెండాలు.. సీఎం జగన్ రియాక్షన్
-
కడప: వేంపల్లిలో పర్యటించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
వేంపల్లి: రూ. 40 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేసిన సీఎం జగన్
-
గొప్పగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి..ఆల్ ది వెరీ బెస్ట్: సీఎం వైఎస్ జగన్
-
ఇద్దరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. చివరకు..
వేంపల్లె: వేంపల్లె పట్టణం భరత్‌నగర్ వీధికి చెందిన షేక్ ఫర్హనా (28) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలి తల్లి షహారున్నీషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఫర్హనా 11ఏళ్ల క్రితం పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్‌కాలనీకి చెందిన ప్రవీణ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి లతీఫ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం జావీద్ ఉరఫ్ మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరిద్దరికి జహీన్ షే అనే కుమారుడు ఉన్నాడు. మూడేళ్ల క్రితం భర్త జావీద్ జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. భర్త పట్టించుకోకపోవడంతో షేక్ బాష ఉరఫ్ ఇడ్లీ బాషతో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తుండేది. ఈ నేపథ్యంలో డబ్బుల విషయమై ఇడ్లీ బాషతో గొడవ జరిగేది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు) ఫర్హనాకు కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇడ్లీ బాష బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి వాదనకు దిగాడు. గురువారం తెల్లవారుజామున ఇడ్లీ బాష ఫర్హనా గొంతు కోసి అతికిరాతకంగా చంపినట్లు పర్హనా తల్లి షేక్ షహారున్నీషా పోలీసులకు వివరించింది. అనంతరం ఫర్హనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, వేంపల్లె సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ తిరుపాల్ నాయక్ పరిశీలించారు. షేక్ బాష ఉరఫ్ ఇడ్లీ బాషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!) -
గిడ్డంగివారి పల్లిలో రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం
రిలయన్స్ జియో తన 4జీ మొబైల్ నెట్వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారి పల్లిలో ప్రారంభించింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన జియో సెల్ టవర్ ను కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు జియో అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేంపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన గిడ్డంగివారి పల్లి చుట్టూ కొండలు ఉండటంతో ప్రజలు సరైన మౌలిక సదుపాయాలు, టెలికాం నెట్వర్క్ లేక ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న అనేక సంక్షేమ పథకాలను పొందడంలో ప్రజలు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడప ఎంపీ చొరవ చూపి సెల్ టవర్ ఏర్పాటుకు కృషి చేశారు. ఎంపీ సూచన మేరకు జియో త్వరితగతిన సెల్ టవర్ పనులు పూర్తి చేసి గ్రామంలో హై స్పీడ్ 4జీ మొబైల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. కొత్త సెల్ టవర్ ద్వారా జియో ఇప్పుడు గ్రామ ప్రజలకు హై-స్పీడ్ 4జీ సేవలు అందిస్తోంది. ఫలితంగా విద్యార్థులు కూడా ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళకుండా వారి విద్యను కొనసాగించడానికి సహాయపడుతుంది. కోవిడ్ మహమ్మారి సామాన్యులు సంభాషించే విధానాన్ని మార్చింది. ప్రజలు షాపింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, నేర్చుకోవడం, వినోదం పొందడం మరియు ఆర్థికంగా లావాదేవీలు చేసే విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఈ పరివర్తన కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ మార్కెట్లకు కూడా విస్తరించింది. గతంలో 3G సేవలు ఎక్కువగా పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఆలా కాకుండా టెలికాం కంపెనీలు ఇప్పుడు 4G హైస్పీడ్ సేవలను కొన్ని వందల మంది జనాభా కలిగిన గ్రామాల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంతో పాటు మన రాష్ట్రం లో కూడా అతి పెద్ద 4జీ సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో తన విస్తృతమైన నెట్వర్క్ మరియు అందుబాటు ధరలో జియోఫోన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని కస్టమర్లు సైతం ఈ సేవలు, వాటి ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. (చదవండి: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!) -
వేంపల్లిలో వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు
సాక్షి, వైఎస్సార్: జిల్లా మహిళా నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మాచిరెడ్డి రవి కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ చంద్ర ఒబుల్ రెడ్డి, వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ కుటుంబం అభిమానులు పాల్గొన్నారు. -
వేంపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య
-
‘రెండే రెండు పేజీలు.. చెప్పినవన్నీ చేస్తాం’
సాక్షి, వేంపల్లి : దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన రెండోరోజు వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు... ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘ ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూద్దామన్నా కనిపించడం లేదు. అయితే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో మాత్రం అలా ఉండదు. రెండే రెండు పేజీలుంటుంది. అందులో చెప్పినవన్నీ చేస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేసి మళ్లీ గర్వంగా ప్రజల వద్దకు వస్తాం. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. మీ సలహాలు స్వీకరించి మరింత మెరుగ్గా చేస్తాం. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. వృద్ధులకు రూ.2వేలు పెన్షన్ అలాగే అవ్వా, తాతలకు ప్రస్తుతం రూ.1000 ఉన్న పెన్షన్..మేం అధికారంలోకి రాగానే రూ.2.వేలు చేస్తాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు రూ.2వేల పెన్షన్ ఇస్తే... నేను రూ.3వేలు చేస్తా. అలాగే ఎవరూ లేని ఒంటరి వృద్ధుల సంక్షేమం కోసం ప్రతి మండలంలో ఓ వృద్దాశ్రమం ఏర్పాటు చేస్తా. వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకుంటా. లక్షా 42వేల ఉద్యోగులు భర్తీ అలాగే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తా. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడదాం. ప్రస్తుతం రాష్ట్రంలో కౌరవ పాలన నడుస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు మోసం చేశారు. విద్యార్థుల ఖర్చులకు రూ.20వేలు విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా కాలేజీ విద్యార్థులకు ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి రాగానే కడప స్టీల్ ఫ్లాంట్ కు శంకుస్థాపన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి యువతకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. .’ అని హామీ ఇచ్చారు. -
వైఎస్ జగన్ రాకతో జనసంద్రమైన వేంపల్లి
-
ప్రజా సంకల్పానికి ‘తొలి అడుగు’
-
మొదటి రోజు ప్రజా సంకల్ప యాత్ర
-
తొలిరోజు ముగిసిన ప్రజా సంకల్ప యాత్ర
సాక్షి, ఇడుపులపాయ : ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తొలిరోజు ముగిసింది. ఆయన మొదటి రోజు ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకూ 8.9 కిలోమీటర్లు మేర పాదయాత్ర పూర్తి చేశారు. కాగా సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభైయేడు నిమిషాలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి తొలి అడుగు వేసిన వైఎస్ జగన్.. మారుతీనగర్, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లె మీదుగా వేంపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర చేశారు. వీరన్నగట్టుపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇక రెండోరోజు ప్రజా సంకల్ప యాత్ర వేంపల్లి రోడ్డు నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు దారి పొడవునా వైఎస్ జగన్‌కు జనం ఘనస్వాగతం పలికారు. కోట్లాది జన హృదయాలను కలుస్తూ సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర.. నిర్ధిష్ట లక్ష్యాలతో కొనసాగనుంది. మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, నిజంతో నిమిత్తం లేకుండా అసత్య ప్రచారంతో, దబాయింపు రాజకీయాలతో వర్థిల్లుతున్న వారికి ఈ యాత్ర ముచ్చెమటలు పట్టిస్తూ జరుగుతుంది. ఇక ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకా..పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. వైఎస్ జగన్ వెంట..పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా కలిసి నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే పాదయాత్ర 180 రోజులు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలో మీటర్లు సాగనుంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ ఆశయ సాధన కోసం సుదీర్గ ప్రయాణం
-
గంగాధరం బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు
వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ రోడ్ల మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గంగాధరం బంధువుల ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో సీఐలు శంకర్, రామచంద్రలతోపాటు మరో 5మంది ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ బీచ్ నాలుగు రోడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని పిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏపీ, తెలంగాణా, బెంగుళూరు తదితర ప్రాంతాలలో దాదాపు 29చోట్ల ఈ దాడులు కొనసాగుతుండగా.. అందులో భాగంగా శనివారం వేంపల్లెలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాలాజి వీధిలో ఆయన బావమర్ది, రిటైర్డు అధ్యాపకుడు చంద్రమౌళి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉదయం 6గంటల నుంచే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రమౌళి ఇంట్లో ఉన్న పత్రాలతోపాటు అన్నిచోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే ఇప్పటిదాకా సోదాలు జరుగుతున్నాయి కానీ.. వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయమై సాక్షి ఏసీబీ అధికారులను వివరణ కోరగా చంద్రమౌళి ఇంట్లో ఉన్న పత్రాలు, బంగారు నగలను పరిశీలించామని.. అన్ని ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంకా కడప, పులివెందులలోని గంగాధరం బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. -
వేంపల్లిలో ఒకే రోజు రెండు చోరీలు
వేంపల్లి (వైఎస్సార్ జిల్లా): వేంపల్లి మండల కేంద్రంలోని పుల్లయ్య తోటలో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. వేంపల్లి నారాయణ స్కూల్ లో డైరెక్టర్‌గా వున్న ప్రభాకర్ రెడ్డి పుల్లయ్య తోటలో నివాసం వున్నారు. శనివారం కడపలో ఓ శుభకార్యానికి ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు వెళ్లారు. ఆదివారం వేకువజామున దొంగలు మాటు వేసి ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను పగుల గొట్టి విలువైన నగలు, సామాగ్రిని దోచు కెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకేరోజు చౌడేశ్వరి ఆలయంలో, ఇక్కడ రెండు చోట్లా చోరీలు జరగడంతో వేంపల్లి ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. -
వేంపల్లి చౌడేశ్వరీ ఆలయంలో చోరీ
వేంపల్లి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండల కేంద్రంలోని చౌడేశ్వరీ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. పిరమిడ్ నగర్ లో వున్న ఈ ఆలయంలోని విలువైన వెండి కిరీటం, హుండీని దొంగలు దోచు కెళ్లారు. ఆలయ పూజారి ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లిన సమయంలో.. చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణ, జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు సోమవారం పరిశీలించారు. ఈనెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగే ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదిక, గ్యాలరీ, హెలీప్యాడ్లను పరిశీలించారు. గతంలో గ్యాలరీ పక్కనే ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారని... ప్రస్తుతం అలా కాకుండా వేదిక వెనుకవైపున ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని డైరెక్టర్లు భగవన్నారాయణ, విశ్వనాథరెడ్డిలకు వారు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్బురాజన్, ఎస్ఐలు మస్తాన్ బాషా, మధుమల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవానికి సన్నాహాలు
వేంపల్లె : ఇడుపులపాయలోని ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవాన్ని జనవరి 4వ తేదీన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య గొడవర్తి భగవన్నారాయణ తెలియజేశారు. స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. గౌరవ అతిథులుగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య రాజ్‌రెడ్డి, ఉప కులపతి ఆచార్య రామచంద్రరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. గతనెల రోజుల నుంచి స్నాతకోత్సవ సమీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కూడా అధికారులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు కేటాయించిన పనులపై సమీక్ష చేశారు. స్టేజీ నిర్మాణం, వచ్చిన అతిథులకు భోజన సౌకర్యం, విలేకరులకు ఆహ్వానం, తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు, మెడల్స్ తయారీ, ఇతరత్రా ఆహ్వాన పత్రికలతోపాటు స్నాతకోత్సవ బ్యానర్లువంటి అంశాలను పరిపాలన అధికారి అమరేంద్ర కుమార్ పండ్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవ సమీక్షలో డైరెక్టర్ భగవన్నారాయణతోపాటు ఒంగోలు డైరెక్టర్ విశ్వనాథరెడ్డి, పరిపాలన అధికారి అమరేంద్ర పండ్ర, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, ఆర్థిక అధికారి మోహన్ కృష్ణ, రత్నకుమారి, కెఎల్‌ఎన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, నరసప్ప, అజీజ్, లక్ష్మణ్, ఎంఎన్ బ్రహ్మానందయ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. -
మోడీ కాస్ట్లీ ఫకీర్
వేంపల్లిః నేను పేదల కోసమే పని చేస్తున్నా.. నేనొక ఫకీరునని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర కాంగ్రెసు ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు.ఆదివారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు.దయ్యాలు వేదాలు వల్లించినట్లు.. గాడ్సే అహింసను ప్రభోదించినట్లు మోదీ వ్యాఖ్యలున్నాయన్నారు.బీజేపీని నడిపిస్తున్నది నల్లధన కుబేరులన్నారు. రెండున్నరేళ్లలో లలిత్‌మోడీ కుంభకోణం,విజయమాల్యా బకాయిల మాఫీ, బియ్యం కుంభకోణం తదితరాలు ఉన్నాయన్నారు. తాను ఫకీర్‌నని చెప్పడం 2016 జోక్ అన్నారు. ఆయన 10లక్షల సూట్ వేసుకొనే అత్యంత ఖరీదైన ఫకీరన్నారు.బంగారానికి భారతీయ మహిళలకు ఉన్న అనుబంధం తల్లీబిడ్డల అనుబంధమన్నారు. బంగారు రహిత దేశాన్ని ఆవిష్కరించాలని చూడడం దురదృష్టకరమన్నారు.మహిళలల జోలికి వస్తే మోదీ మటాష్ కావడం తథ్యమన్నారు.బీజేపీ రహిత భారత్‌ను ఆవిష్కరించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జి శ్రీనువాసులు రెడ్డి,యన్‌యస్‌యుఐ జిల్లా అధ్యక్షులు «ధృవ కుమార్ రెడ్డి,సేవాదళ్ జిల్లా చైర్మన్ చార్లెస్,నాయకులు ఉత్తన్న,బాబు,రామకృష్ణ,రామచంద్ర,వెంకట సుబ్బారెడ్డి,నరసింహారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. -
మోడీ కాస్ట్లీ ఫకీర్
వేంపల్లిః నేను పేదల కోసమే పని చేస్తున్నా.. నేనొక ఫకీరునని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర కాంగ్రెసు ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు.ఆదివారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు.దయ్యాలు వేదాలు వల్లించినట్లు.. గాడ్సే అహింసను ప్రభోదించినట్లు మోదీ వ్యాఖ్యలున్నాయన్నారు.బీజేపీని నడిపిస్తున్నది నల్లధన కుబేరులన్నారు. రెండున్నరేళ్లలో లలిత్‌మోడీ కుంభకోణం,విజయమాల్యా బకాయిల మాఫీ, బియ్యం కుంభకోణం తదితరాలు ఉన్నాయన్నారు. తాను ఫకీర్‌నని చెప్పడం 2016 జోక్ అన్నారు. ఆయన 10లక్షల సూట్ వేసుకొనే అత్యంత ఖరీదైన ఫకీరన్నారు.బంగారానికి భారతీయ మహిళలకు ఉన్న అనుబంధం తల్లీబిడ్డల అనుబంధమన్నారు. బంగారు రహిత దేశాన్ని ఆవిష్కరించాలని చూడడం దురదృష్టకరమన్నారు.మహిళలల జోలికి వస్తే మోదీ మటాష్ కావడం తథ్యమన్నారు.బీజేపీ రహిత భారత్‌ను ఆవిష్కరించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జి శ్రీనువాసులు రెడ్డి,యన్‌యస్‌యుఐ జిల్లా అధ్యక్షులు «ధృవ కుమార్ రెడ్డి,సేవాదళ్ జిల్లా చైర్మన్ చార్లెస్,నాయకులు ఉత్తన్న,బాబు,రామకృష్ణ,రామచంద్ర,వెంకట సుబ్బారెడ్డి,నరసింహారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్్ట
- వ్యాపారం లేక చిరువ్యాపారి మృతి వేంపల్లె: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఓ చిరు వ్యాపారి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి సమీపంలో నివాసముంటున్న పోలేపల్లి వెంకటనారాయణ (45) కొన్నేళ్లుగా తోపుడు బండిపై కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రభుత్వం పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడంతో వారం రోజులుగా వ్యాపారం లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దీంతో దిగులు చెంది అనారోగ్యానికి గురయ్యాడని మృతుని భార్య జ్యోతి తెలిపారు. మంగళవారం రాత్రి వెంకటనారాయణకు బీపీ ఎక్కువ కావడంతో కడపలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దీంతో భార్య జ్యోతి, 9వ తరగతి చదువుతున్న కుమార్తె స్వాతి, 8వ తరగతి చదువుతున్న జశ్వంత్, 3వ తరగతి చదువుతున్న కృష్ణలు దిక్కులేని వారయ్యారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
చక్రాయపేట: చక్రాయ పేట మండలం మారెళ్ల మడక సమీపంలో లోతు వంక వద్ద సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మొలల వైద్యుడు గౌతమ్(32) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌతమ్ పదేళ్లుగా వేంపల్లిలో ఉంటూ మొలల వ్యాధికి వైద్యం చేస్తున్నారు. ఆదివారం భార్య రూపాతో కలిసి రాయచోటిలోని తన స్నేహితుని ఇంటికి వెళ్లారు. సోమవారం భార్య రూపాను అక్కడే వదలి తెల్లవారు జామున ఒక్కరే వేంపల్లికి మోటార్ బైక్‌పై బయలు దేరారు. మారెళ్ల మడక లోతు వంక సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లికి తరలించారు. మృతునికి భార్యతో పాటు 8నెలలు, 3 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలకు రాని బంధువులు గౌతమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని పశ్చిమ బెంగాల్‌లోని తల్లికి, సోదరునికి తెలిపారు. కాని వారు కడు పేదవారు కావడంతో రాలేమని చెప్పారు. దీంతో వైస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహగౌడ్, నాయకులు బీయస్ షేక్షావలి, జిల్లా బలిజ సంఘం యూత్ అధ్యక్షుడు కటిక నాగరాజు తదితరులు పాపాఘ్ని నదిలో మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆలయంలో రసాభాస..
వేంపల్లె: వేంపల్లె వృషభాచలేశ్వర దేవస్థానంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో రసాభాస చోటు చేసుకుంది. ఆలయ కమిటీ చైర్మన్ తనపై చేయి చేసుకున్నారని పూజారి ఆరోపించారు. ఆయన శనివారం కాసేపు ఎండలో కూర్చొని నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వృషభాచలేశ్వర దేవస్థానంలో శేషాద్రి పూజారిగా ఉన్నారు. ఇక్కడే గతంలో పూజారిగా ఉన్న ప్రసాద్ గతేడాది డిసెంబర్ 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించేందుకు శేషాద్రి ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం కడప జిల్లా పరిషత్ సమావేశ సమయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డిని బ్రాహ్మణ సంఘాలతో కలిసి శేషాద్రి విజ్ఞప్తి చేశారు. సతీష్‌రెడ్డి వెంటనే ఈవో ప్రతాప్‌తో మాట్లాడారు. శుక్రవారం రాత్రి ఈవో ప్రతాప్.. శేషాద్రిని పిలిపించి తమకు తెలపకుండా సతీష్‌రెడ్డిని ఎందుకు కలిశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే విషయాన్ని చైర్మన్ ఎద్దుల కొండ్రాయుడుకు తెలియజేయడంతో ఆయన అక్కడికి వచ్చి చేయి చేసుకున్నారని శేషాద్రి మీడియా ఎదుట ఆరోపించారు. ఈ విషయంపై చైర్మన్, ఈవోను వివరణ కోరగా.. శేషాద్రి ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల మందలించామని.. చేయి చేసుకోలేదని తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగా శనివారం మధ్యాహ్నం అర్చక సంఘం కన్వీనర్ విజయ్‌కుమార్ జోక్యం చేసుకోవడంతో.. శేషాద్రి, చైర్మన్, ఈవో తర్జనభర్జన పడి రాజీకి వచ్చారు. ఆలయ అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని మీడియా ఎదుట తెలియజేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. మండిపడుతున్న బ్రాహ్మణ సంఘాలు : పూజారిపై చేయి చేసుకోవడం హేయమని బ్రాహ్మణ సంఘ నేతలు మండిపడుతున్నారు. వారు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. మీడియా ఎదుట క్షమాపణ చెప్పాలని ఏపీ బ్రాహ్మణ చైతన్య ఐక్య వేదిక జిల్లా కోఆర్డినేటర్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న అర్చకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు కందనూరు రాఘవాచార్యులు తెలిపారు.