సాక్షి, ఇడుపులపాయ : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తొలిరోజు ముగిసింది. ఆయన మొదటి రోజు ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకూ 8.9 కిలోమీటర్లు మేర పాదయాత్ర పూర్తి చేశారు. కాగా సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభైయేడు నిమిషాలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ నుంచి తొలి అడుగు వేసిన వైఎస్ జగన్.. మారుతీనగర్, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లె మీదుగా వేంపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర చేశారు. వీరన్నగట్టుపల్లెలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇక రెండోరోజు ప్రజా సంకల్ప యాత్ర వేంపల్లి రోడ్డు నుంచి ప్రారంభం కానుంది.
మరోవైపు దారి పొడవునా వైఎస్ జగన్‌కు జనం ఘనస్వాగతం పలికారు. కోట్లాది జన హృదయాలను కలుస్తూ సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర.. నిర్ధిష్ట లక్ష్యాలతో కొనసాగనుంది. మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, నిజంతో నిమిత్తం లేకుండా అసత్య ప్రచారంతో, దబాయింపు రాజకీయాలతో వర్థిల్లుతున్న వారికి ఈ యాత్ర ముచ్చెమటలు పట్టిస్తూ జరుగుతుంది. ఇక ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకా..పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. వైఎస్ జగన్ వెంట..పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా కలిసి నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే పాదయాత్ర 180 రోజులు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలో మీటర్లు సాగనుంది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment