వేంపల్లె: వేంపల్లె వృషభాచలేశ్వర దేవస్థానంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో రసాభాస చోటు చేసుకుంది. ఆలయ కమిటీ చైర్మన్ తనపై చేయి చేసుకున్నారని పూజారి ఆరోపించారు. ఆయన శనివారం కాసేపు ఎండలో కూర్చొని నిరసన తెలిపే ప్రయత్నం చేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వృషభాచలేశ్వర దేవస్థానంలో శేషాద్రి పూజారిగా ఉన్నారు. ఇక్కడే గతంలో పూజారిగా ఉన్న ప్రసాద్ గతేడాది డిసెంబర్ 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించేందుకు శేషాద్రి ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం కడప జిల్లా పరిషత్ సమావేశ సమయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డిని బ్రాహ్మణ సంఘాలతో కలిసి శేషాద్రి విజ్ఞప్తి చేశారు. సతీష్‌రెడ్డి వెంటనే ఈవో ప్రతాప్‌తో మాట్లాడారు.
శుక్రవారం రాత్రి ఈవో ప్రతాప్.. శేషాద్రిని పిలిపించి తమకు తెలపకుండా సతీష్‌రెడ్డిని ఎందుకు కలిశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే విషయాన్ని చైర్మన్ ఎద్దుల కొండ్రాయుడుకు తెలియజేయడంతో ఆయన అక్కడికి వచ్చి చేయి చేసుకున్నారని శేషాద్రి మీడియా ఎదుట ఆరోపించారు. ఈ విషయంపై చైర్మన్, ఈవోను వివరణ కోరగా.. శేషాద్రి ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల మందలించామని.. చేయి చేసుకోలేదని తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగా శనివారం మధ్యాహ్నం అర్చక సంఘం కన్వీనర్ విజయ్‌కుమార్ జోక్యం చేసుకోవడంతో.. శేషాద్రి, చైర్మన్, ఈవో తర్జనభర్జన పడి రాజీకి వచ్చారు. ఆలయ అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని మీడియా ఎదుట తెలియజేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది.
మండిపడుతున్న బ్రాహ్మణ సంఘాలు :
పూజారిపై చేయి చేసుకోవడం హేయమని బ్రాహ్మణ సంఘ నేతలు మండిపడుతున్నారు. వారు ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ఎదుట క్షమాపణ చెప్పాలని ఏపీ బ్రాహ్మణ చైతన్య ఐక్య వేదిక జిల్లా కోఆర్డినేటర్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న అర్చకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు కందనూరు రాఘవాచార్యులు తెలిపారు.
ఆలయంలో రసాభాస..
Published Sun, Jun 12 2016 10:40 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM
Advertisement
Advertisement