వేంపల్లె : ఇడుపులపాయలోని ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవాన్ని జనవరి 4వ తేదీన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య గొడవర్తి భగవన్నారాయణ తెలియజేశారు. స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. గౌరవ అతిథులుగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్‌జీయూకేటీ కులపతి ఆచార్య రాజ్‌రెడ్డి, ఉప కులపతి ఆచార్య రామచంద్రరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. గతనెల రోజుల నుంచి స్నాతకోత్సవ సమీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కూడా అధికారులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు కేటాయించిన పనులపై సమీక్ష చేశారు. స్టేజీ నిర్మాణం, వచ్చిన అతిథులకు భోజన సౌకర్యం, విలేకరులకు ఆహ్వానం, తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు, మెడల్స్ తయారీ, ఇతరత్రా ఆహ్వాన పత్రికలతోపాటు స్నాతకోత్సవ బ్యానర్లువంటి అంశాలను పరిపాలన అధికారి అమరేంద్ర కుమార్ పండ్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవ సమీక్షలో డైరెక్టర్ భగవన్నారాయణతోపాటు ఒంగోలు డైరెక్టర్ విశ్వనాథరెడ్డి, పరిపాలన అధికారి అమరేంద్ర పండ్ర, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, ఆర్థిక అధికారి మోహన్ కృష్ణ, రత్నకుమారి, కెఎల్‌ఎన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, నరసప్ప, అజీజ్, లక్ష్మణ్, ఎంఎన్ బ్రహ్మానందయ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవానికి సన్నాహాలు
Published Thu, Dec 29 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement