వేంపల్లె: వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో మరోసారి అధికార టీడీపీలో విబేధాలు బయటపడ్డాయి. రాయలసీమ టీడీపీ శిక్షణా తరగతుల డెరైక్టర్ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వర్గీయులు చించివేశారు. వేంపల్లెలో నాలుగురోడ్ల కూడలిలో, బస్టాండ్ సమీపంలో లోకేష్, చంద్రబాబు, సీఎం రమేశ్, రాంగోపాల్‌రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాంగోపాల్ రెడ్డి టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పి ఆ ఫ్లెక్సీలను చించివేశారు. దీనిపై రాంగోపాల్ రెడ్డి వర్గీయులు సతీష్‌రెడ్డి వర్గీయులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.