
వేంపల్లి చౌడేశ‍్వరీ ఆలయంలో చోరీ
వేంపల్లి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండల కేంద్రంలోని చౌడేశ‍్వరీ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. పిరమిడ్ నగర్ లో వున్న ఈ ఆలయంలోని విలువైన వెండి కిరీటం, హుండీని దొంగలు దోచు కెళ్లారు.
ఆలయ పూజారి ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లిన సమయంలో.. చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు.