- వ్యాపారం లేక చిరువ్యాపారి మృతి
వేంపల్లె: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఓ చిరు వ్యాపారి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి సమీపంలో నివాసముంటున్న పోలేపల్లి వెంకటనారాయణ (45) కొన్నేళ్లుగా తోపుడు బండిపై కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రభుత్వం పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడంతో వారం రోజులుగా వ్యాపారం లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దీంతో దిగులు చెంది అనారోగ్యానికి గురయ్యాడని మృతుని భార్య జ్యోతి తెలిపారు. మంగళవారం రాత్రి వెంకటనారాయణకు బీపీ ఎక్కువ కావడంతో కడపలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దీంతో భార్య జ్యోతి, 9వ తరగతి చదువుతున్న కుమార్తె స్వాతి, 8వ తరగతి చదువుతున్న జశ్వంత్, 3వ తరగతి చదువుతున్న కృష్ణలు దిక్కులేని వారయ్యారు.
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్్ట
Published Wed, Nov 16 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
Advertisement
Advertisement