chitrapuri colony
-
హైడ్రా ఎంట్రీ.. చిత్రపురి కాలనీలో విల్లాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే టార్గెట్‌గా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో, హైడ్రా చర్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు, తాజాగా మణికొండ చిత్రపూరి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.కాగా, చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు అందజేశారు. ఈ సందర్బంగా జీవో 658కు విరుద్దంగా 225 రోహౌజ్‌ల నిర్మాణాలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇక, గత సొసైటీ పాలక వర్గం దొంగ చాటున నిర్మాణాలకు అనుమతులు పొందిందని అధికారులు తేల్చారు. అలాగే, ఈ నిర్మాణాల కోసం కేవలం జీ+1 అనుమతులు పొంది అక్రమంగా జీ+2 నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు.దీంతో, 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ సూచించారు. గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు రూ.50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకల గుట్టురట్టు చేయాలంటూ ఫిర్యాదుల వెల్లువెట్టడంతో రంగంలోకి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల్లో టెన్షన్ నెలకొంది. -
చిత్రపురిపై బుల్డోజర్
-
మణికొండ చిత్రపురి కాలనీలో ఉద్రిక్తత
-
చిత్రపురి కాలనీలో గృహ ప్రవేశ మహోత్సవంలో చిరంజీవి (ఫొటోలు)
-
సినీ ఇండస్ట్రీకి పెద్ద నేను కాదు: మెగాస్టార్ చిరంజీవి
-
చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరు చెరిపేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది చాలా బాధాకరమని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేసమయంలో చిత్రపరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం ఎంతో శ్రమించి అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే చిత్రపరిశ్రమలోని పెద్దలు ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పరని కేవలం చిత్రపురి కాలనీ అనే సంబోధించడం బాధాకరమన్నారు. చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి నెలకొల్పుతామని చిత్రపురి కమిటీకి 2 సంవత్సరాల క్రితం తాము నివేదిక పంపి, తాము ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఇప్పుడు చిత్రపరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం బాధాకరమని, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే అనుకోవచ్చునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డిలు మాట్లాడుతూ... పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని తాము వ్యతిరేకిండంలేదని, కాని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు సంవత్సరాల క్రితమే తాము ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చిత్రపురి కమిటీకి నివేదిక ఇచ్చామని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం, కమిటీ తమకు ఎంత స్థలం కేటాయించాలి అనే విషయం చర్చించడం, తాము అనుమతులు ఇతరత్రా పనుల్లో ఉండగానే తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి నిర్మిస్తాను అని ఓ సినీ ప్రముఖుడు ప్రకటించుకోవడం సరికాదన్నారు. తమకు అవకాశం ఇచ్చి స్థలం కేటాయిస్తే సంవత్సరంలోపు ఆసుపత్రి నిర్మించి పేద కళాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చిత్రపురి కాలనీలో ఉన్న పాఠశాలను ప్రైవేట్‌కు అప్పగించారని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మించి దాన్ని కూడా ప్రైవేట్‌కు అప్పగించరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. (క్లిక్: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి) -
సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి
బంజారాహిల్స్ (హైదరాబాద్): సినీ కార్మికుల కోసం త్వరలోనే ఓ ఆస్పత్రి కట్టిస్తానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఈ ఏడాది డల్లాస్‌లో నిర్వహించబోయే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సినీరంగంలో ఓ సినిమా నిర్మించాలంటే ఎంతో మంది కార్మికులు ఎంతో కష్టపడతారని, వారి కోసం తాను తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఆస్పత్రి నిర్మిస్తానని ప్రకటించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు) చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆ ఆస్పత్రికి ఎంత ఖర్చైనా కూడా సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పారు. సినీరంగంలో తమ ఎదుగుదలకు సినీ కార్మికులు రకరకాల విభాగాల్లో సహకరిస్తున్న వారికి ఈ ఆస్పత్రిని నిర్మించి ఇవ్వడం తాను కృతజ్ఞతగా భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కల్లా ఈ ఆస్పత్రి నిర్మించి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చిరంజీవి వెల్లడించారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ఈ ఆస్పత్రి నిర్మాణానికి తాను ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తానని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆస్పత్రి కోసం ఇస్తానని చెప్పారు. -
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని..
నిజాంపేట్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి ఘటన మరువక ముందే నగరంలో ఒక యువతిపై జరిగిన అత్యాచారం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీ అనంతరం ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని అర్ధరాత్రి సమయంలో యువతి ఇంటికి వచ్చిన స్నేహితుల్లో ఒకరు ఆమెపై లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి ప్రగతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటోంది. క్రాంతి అలియాస్ మ్యాక్స్‌వెల్ ఈ నెల 13న తన పుట్టినరోజు ఉందంటూ కంటెంట్ రైటర్ అయిన 28 ఏళ్ల యువతిని పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్‌లోని రిపీట్ పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లింది. పబ్‌లో పార్టీ అనంతరం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ క్రాంతితో పాటు స్నేహితులు రోషన్, మనుప్రీత్, కిషోర్ ఆమె ఇంటికి వచ్చారు. అందరూ కలిసి మళ్లీ మద్యం సేవించారు. తెల్లవారుజాము సుమారు 4.30 గంటల వరకు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు. 5 గంటల సమయంలో యువతి నిద్రలోకి జారుకుంది. మిగతావారు కూడా ఆమె ఇంట్లోనే పడుకున్నారు. యువతితో పాటు ఇద్దరు స్నేహితులు ఒక గదిలో, మరో ఇద్దరు ఇంకో గదిలో పడుకున్నారు. సుమారు 6.15 గంటల సమయంలో రోషన్ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతన్ని పక్కకు నెట్టివేసేందుకు ప్రయత్నించింది. అయితే అతడు తనను కొట్టి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు ఆ యువతి 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం లైంగిక దాడికి పాల్పడిన చిత్రపురి కాలనీకి చెందిన రోషన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీరంతా సెంట్రల్ యూని వర్సిటీ విద్యార్థులని పోలీసులు పేర్కొంటున్నారు. యువతిపై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లైంగిక దాడి జరిగిందా? స్నేహితులు అందరూ దీనికి సహకరించారా? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటు వేసిన దర్శకుడు వివి వినాయక్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘చిత్రపురి కాలనీ సొసైటీ’ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది. ప్రముఖ నటుడు భానుచందర్, గిరిబాబు, దర్శకుడు వివి వినాయక్ తదితర సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానెల్స్ పాల్గొనగా.. మన ప్యానెల్, సత్యమేవ జయతే ప్యానెల్ పోటీ పడుతున్నాయి. పదకొండు మంది కమిటీ సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో ప్యానెల్లో 11 మంది అభ్యర్థులు ఉంటారు. చదవండి: చిత్రపురి కాలనీలో అక్రమాలు: నటుడు మన ప్యానెల్ తరఫున నిర్మాత సి. కళ్యాణ్, సత్యమేవ జయతే ప్యానెల్ తరఫున ఓ. కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 16 బూత్‌ల్లో పోలింగ్ నిర్వహించారు. చిత్రపురి కాలనీ సొసైటీలో మొత్తం 4,810 ఓట్లు ఉన్నాయని, పోలింగ్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల ఆఫీసర్ అరుణ తెలిపారు. ఎన్నికల తుది ఫలితాలు సాయంత్రం 7 గంటలకు వెల్లడించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సినీ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 67 ఎకరాల స్థలం కేటాయించి చిత్రపురి కాలనీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
చిత్రపురి కాలనీలో అక్రమాలు: నటుడు
సాక్షి, హైదరాబాద్: ‘సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయి’ అని నటుడు, నిర్మాత కల్యాణ్ ఆరోపించారు. దాదాపు రూ. 300 కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ నెల 10న చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. సత్యమేవ జయతే అనే ప్యానల్ తరఫున ఒ.కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరవై ఏళ్లుగా చిత్రపురి కాలనీకి సంబంధించి అవినీతి జరుగుతూనే ఉందన్నారు. ఈ విషయంపై నిర్మాత సి. కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.8 కోట్ల సబ్సిడీ ఇచ్చారని, ప్రస్తుత సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.6 కోట్లు ఎటు పోయిందని ఒ.కల్యాణ్ ప్రశ్నించారు. హౌసింగ్ సొసైటీని మోసం చేసి మేనేజ్ చేసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో అనిల్‌కుమార్ కావూరి, ఈశ్వరప్రసాద్ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి నరసింహారెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వైవి, శ్రీనివాస్ కూనపురెడ్డి, ఆత్మకూరు రాధ, మల్లికా టి, మధు జాటోత్ పాల్గొన్నారు. -
ఇకపై థియేటర్లలో ఐదు షోలు
హైదరాబాద్ : సినీ అభిమానులకు శుభవార్తే. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం కష్టమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించే పద్దతి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు నాలుగు ఆటలుగా ఉన్న ప్రదర్శనను ఇకపై అయిదు ప్రదర్శనలకు ... అయితే ఐదో షో కచ్చితంగా చిన్న సినిమా అయి ఉండాలని తెలంగాణ సబ్ కమిటీ సోమవారం సూచించింది. అలాగే చిన్న సినిమాల పరిమితి 30 నుంచి 50 థియేటర్లకు పెంచుతూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక సినీ కార్మికుల నివాసాల కోసం చిత్రపురిలో 9 ఎకరాలు కేటాయింపుతో పాటు హైదరాబాద్‌లో టీవీ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సబ్ కమిటీ సోమవారం సమావేశమైంది. సినీరంగం నుండి ఈ భేటీకి దాసరి నారాయణరావు, దగ్గుబాటి సురేష్, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, శంకర్ తదితరులు హాజరయ్యారు. -
సినీ కార్మికులపై మంత్రుల వరాల జల్లు
హైదరాబాద్: సినీ కార్మికులపై రాష్ట్ర మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారడిగిన కోరికలన్నింటినీ అక్కడికక్కడే ఓకే చెప్పి వారిని సంతృప్తి పరిచారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచాయతీ పరిధిలోని చిత్రపురికాలనీలో మంత్రులు కె.తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వారి దృష్టికి తెచ్చిన కాలనీ ప్రధానరోడ్డు నిర్మాణానికి జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. కోటిన్నర నిధులను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, శుక్రవారం నుంచి కాలనీవాసులు ఎటువైపు తిరిగితే అటువైపు బస్‌లను నడుపుతామని హామీ ఇచ్చారు. టింబర్లేక్ కాలనీ మీదుగా రోడ్డును అడ్డుకుంటున్నారని పేర్కొనటంతో వారితో చర్చించి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు అందిస్తామని, కళాకారుల పింఛన్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తామంతా 15వేల మంది ఉండగా అందులో కేవలం 4 వేలమందికే గృహాలు ఇచ్చారని మిగతా వారికి పక్కనే ఉన్న మరో 9 ఎకరాల భూమిని కేటాయించాలని కోరటంతో ముఖ్యమంత్రితో చర్చించి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాలనీకి ఉచిత వైఫై సేవలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, జలమండలి డెరైక్టర్ కొండారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీలు స్వర్ణలతారెడ్డి, శంకర్‌గౌడ్, మణికొండ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి, ఆర్డీవో సురేశ్ పోద్దార్ తదితరులు పాల్గొన్నారు. -
సినీకార్మికులపై వరాల జల్లు
-చిత్రపురి కాలనీలో మంత్రుల పర్యటన హైదరాబాద్ సినీ కార్మికులపై రాష్ట్ర మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారడిన కోరికలన్నింటినీ అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచాయతీ చిత్రపురికాలనీలో ఐటీ మంత్రి కె.తారకరామారావు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వారి దృష్టికి తెచ్చిన కాలనీ ప్రధానరోడ్డు నిర్మాణానికి జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖనుంచి రూ. కోటిన్నర నిధులను ఖర్చుచేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. కాలనీకి రేపటి నుంచి బస్‌లను నడుపుతామని హామీ ఇచ్చారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు తీసుకోవచ్చని కళాకారుల పింఛన్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తాము15వేల మంది ఉండగా కేవలం 4 వేలమందికే గృహాలు ఇచ్చారనీ.. మిగతా వారికి పక్కనే ఉన్న మరో 9ఎకరాల భూమిని కేటాయించాలని కోరటంతో ముఖ్యమంత్రితో చర్చించి కేటాయిస్తామని హామి ఇచ్చారు. కాలనీకి ఉచిత వైఫై సేవలను అందించాలని కళాకారులు కోరారు.. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. త్వరలోనే వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భగా ఆయన ప్రకటించారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్నారు.