Megastar Chiranjeevi Announced To Construct Hospital For Poor Telugu Cine Workers - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి 

Published Sun, Aug 21 2022 10:35 AM | Last Updated on Sun, Aug 21 2022 11:26 AM

Chiranjeevi Decides To Build Hospital For Cine Workers - Sakshi

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌ జెర్సీ ప్రారంభోత్సవంలో చిరంజీవి, శ్రీకాంత్‌, తరుణ్‌, తదితరులు

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): సినీ కార్మికుల కోసం త్వరలోనే ఓ ఆస్పత్రి కట్టిస్తానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఈ ఏడాది డల్లాస్‌లో నిర్వహించబోయే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌ జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథి­గా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సినీరంగంలో ఓ సినిమా నిర్మించాలంటే ఎంతో మంది కార్మికులు ఎంతో కష్టపడతారని, వారి కోసం తాను తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఆస్పత్రి నిర్మిస్తానని ప్రకటించారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(చదవండి: స్టార్స్‌ మేకోవర్‌, న్యూ లుక్కు.. వెరీ కిక్కు)

చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆ ఆస్పత్రికి ఎంత ఖర్చైనా కూడా సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పారు. సినీరంగంలో తమ ఎదుగుదలకు సినీ కార్మికులు రకరకాల విభాగాల్లో సహకరిస్తున్న వా­రికి ఈ ఆస్పత్రిని నిర్మించి ఇవ్వడం తాను కృతజ్ఞతగా భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కల్లా ఈ ఆస్పత్రి నిర్మించి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చిరంజీవి వెల్లడించారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ ఈ ఆస్పత్రి నిర్మాణానికి తాను ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహిస్తానని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆస్పత్రి కోసం ఇస్తానని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement