సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే టార్గెట్‌గా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో, హైడ్రా చర్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు, తాజాగా మణికొండ చిత్రపూరి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.
కాగా, చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు అందజేశారు. ఈ సందర్బంగా జీవో 658కు విరుద్దంగా 225 రోహౌజ్‌ల నిర్మాణాలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇక, గత సొసైటీ పాలక వర్గం దొంగ చాటున నిర్మాణాలకు అనుమతులు పొందిందని అధికారులు తేల్చారు. అలాగే, ఈ నిర్మాణాల కోసం కేవలం జీ+1 అనుమతులు పొంది అక్రమంగా జీ+2 నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు.
దీంతో, 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ సూచించారు. గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు రూ.50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకల గుట్టురట్టు చేయాలంటూ ఫిర్యాదుల వెల్లువెట్టడంతో రంగంలోకి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల్లో టెన్షన్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment